కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 9/15 పేజీలు 3-6
  • వ్యత్యాసాల నుండి నేర్చుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వ్యత్యాసాల నుండి నేర్చుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వ్యత్యాసాల నుండి ప్రయోజనం పొందండి
  • బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • “వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి”
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • “నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 9/15 పేజీలు 3-6

వ్యత్యాసాల నుండి నేర్చుకోండి

ఇప్పటివరకు భూమ్మీద జీవించిన వాళ్లలో యేసే అందరికన్నా గొప్ప బోధకుడని మీరు ఒప్పుకోరా? యేసు బోధించిన పద్ధతిని ఆదర్శంగా తీసుకొని, బహుశా మీరు కూడా ఇతరులకు బోధించేటప్పుడు ప్రశ్నల్ని, ఉపమానాల్ని వాడే ఉంటారు. మరి, యేసు తన బోధలో వ్యత్యాసాలను చూపించే వాక్యాలను కూడా తరచూ ఉపయోగించేవాడని మీరు ఎప్పుడైనా గమనించారా?

చాలామంది ప్రజలు మాట్లాడేటప్పుడు వ్యత్యాసాలను ఉపయోగిస్తారు. బహుశా, మీరు కూడా మీకు తెలియకుండానే తరచూ వాటిని ఉపయోగిస్తుండవచ్చు. ఉదాహరణకు కొన్ని పండ్లు చూపించి, “అన్నీ పండాయన్నారు గానీ ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయే?” అని మీరు అనవచ్చు. లేదా ఒక అమ్మాయి గురించి, “చిన్నప్పుడు ఈమెకు సిగ్గు ఎక్కువ, కానీ ఇప్పుడు చాలా కలుపుగోలుగా ఉంటోంది” అని అనవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో, మీరు ముందు ఓ వాస్తవాన్ని లేదా ఓ విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత, వ్యత్యాసాన్ని చూపించడానికి కానీ, అయితే, బదులుగా, అలా కాకుండా అనే మాటలు ఉపయోగిస్తారు. ఇంకొన్నిసార్లు వ్యత్యాసాన్ని చూపించడానికి మీరు చెప్పే విషయానికే మరిన్ని వివరాలు జోడిస్తారు. మీరు అలా మాట్లాడినప్పుడు చాలా సహజంగా ఉంటుంది, ఇతరులకు సులువుగా అర్థమౌతుంది.

కొన్ని భాషల్లో, సంస్కృతుల్లో వ్యత్యాసాలు వాడడం సర్వసాధారణం కాకపోయినా మనం వాటి విలువను గుర్తించాలి. ఎందుకంటే దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిల్లో, వ్యత్యాసాలు చూపించే వాక్యాలు ఎన్నో కనిపిస్తాయి. యేసు తరచూ వాటిని ఉపయోగించాడు. వీటిని గుర్తుతెచ్చుకోండి: “మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని . . . దీపస్తంభముమీదనే పెట్టుదురు.” “ధర్మశాస్త్రమును . . . నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.” “రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.” “ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదు.”—మత్త. 5:15, 17; 9:12; 15:20.

ఇతర బైబిలు పుస్తకాల్లో కూడా వ్యత్యాసాలు చూపించే అలాంటి పదాలను చూస్తాం. అవి, మీరు ఓ విషయాన్ని అర్థం చేసుకోవడానికి లేదా ఏదైనా పనిని ఇంతకుముందు చేసిన దానికన్నా మెరుగ్గా చేయడానికి సహాయం చేస్తాయి. మీరు తల్లిదండ్రులైతే, ఈ వ్యత్యాసం గురించి ఆలోచించండి: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫె. 6:4) తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుని ‘శిక్షలో’ పెంచాలని పౌలు సూటిగా చెప్పినా, ఆ సలహా బాగానే ఉండేది. కానీ, ఆయన వ్యత్యాసాన్ని చూపించడం ద్వారా అంటే, ‘కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలో, బోధలో పెంచాలి’ అని చెప్పడం ద్వారా విషయాన్ని మరింత స్పష్టం చేశాడు.

ఆ తర్వాత అదే అధ్యాయంలో పౌలు ఇలా రాశాడు: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని . . . ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫె. 6:12) ఆ వ్యత్యాసాన్ని గమనించడం వల్ల, మీరు ఎంతో గంభీరమైన పోరాటంలో ఉన్నారనే విషయాన్ని మీరు అర్థంచేసుకోగలుగుతారు. అది కేవలం మామూలు మనుష్యులకు విరుద్ధంగా కాదు గానీ దురాత్మలకు విరుద్ధంగా చేసే పోరాటం.

వ్యత్యాసాల నుండి ప్రయోజనం పొందండి

పౌలు ఎఫెసీయులకు రాసిన ఇదే పత్రికలోని చాలా వచనాల్లో ఆయన ఉపయోగించిన వ్యత్యాసాలను మీరు చూస్తారు. వీటి గురించి ఆలోచించినప్పుడు పౌలు ఏమి చెప్పాలనుకున్నాడో, ప్రతీ ఒక్కరం ఏమి చేయాలో అర్థం చేసుకోగలుగుతాం.

ఎఫెసీయులు 4, 5 అధ్యాయాల్లో ఉన్న కొన్ని వ్యత్యాసాల్ని చూపించే పదాలను ఈ శీర్షికలో ఇచ్చిన చార్టులో గమనించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతీ వ్యత్యాసాన్ని చదువుతున్నప్పుడు మీ సొంత జీవితం గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ విషయంలో నా మనోవైఖరి ఏమిటి? ఈ సందర్భంలో లేదా ఇలాంటి మరికొన్ని సందర్భాల్లో నేను ఎలా వ్యవహరిస్తాను? ఈ చార్టులోని లేఖనాల ప్రకారం నేను ఎలా ఉన్నానని ఇతరులు భావిస్తారు?’ ఓ లేఖనంలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి మీలో కాస్త మార్పు అవసరమని మీకు అర్థమైతే దాని విషయంలో మార్పు చేసుకోవడానికి కృషి చేయండి. ఆ వ్యత్యాసం మీకు సహాయం చేయనివ్వండి.

ఈ ఆర్టికల్‌లో ఉన్న చార్టును మీ కుటుంబ ఆరాధనలో కూడా చర్చించవచ్చు. ముందుగా, మీ కుటుంబమంతా కలిసి ఆ వ్యత్యాసాల్ని చదవవచ్చు. ఆ తర్వాత, మీలో ఒకరు ఆ లేఖనాల్లో ఉన్న వ్యత్యాసంలోని మొదటి భాగం గురించి ప్రస్తావించవచ్చు, అప్పుడు మిగతా కుటుంబ సభ్యులు ఆ లేఖనంలోని రెండవ భాగంలో ఉన్న విషయాన్ని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ విధంగా, ఆ రెండవ భాగంలో ఉన్న విషయాన్ని కుటుంబమంతా పాటించాలంటే ఏమి చేయాలో మీరు ఆహ్లాదకరంగా చర్చించుకోగలుగుతారు. అవును, అలాంటి వ్యత్యాసాలను పరిశీలించడం వల్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, ఇంటా బయటా క్రైస్తవులకు తగిన విధంగా ప్రవర్తించగలుగుతారు.

వ్యత్యాసం చూపిస్తున్న ఆ లేఖనాల్లోని రెండవ భాగాన్ని మీరు గుర్తుతెచ్చుకోగలరా?

మీరు వ్యత్యాసాల్లో ఉన్న విలువను తెలుసుకున్న కొద్దీ, బైబిల్లోని వ్యత్యాసాలకు సంబంధించిన వాక్యాలను మరింత బాగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా, అవి మీ క్రైస్తవ పరిచర్యలో కూడా ఎంతో తోడ్పడతాయని మీరు గుర్తిస్తారు. బహుశా మీరు గృహస్థులతో ఈ విధంగా అనవచ్చు: “ప్రతీ ఒక్కరిలో ఆత్మ ఉంటుందని దానికి చావు ఉండదని చాలామంది అంటారు, అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమి చెబుతుందో చూడండి.” లేదా ఒక బైబిలు అధ్యయనంలో మీరు ఇలా అడగవచ్చు: “ఈ ప్రాంతంలోని చాలామంది దేవుడు, యేసు ఒక్కరే అంటారు కానీ బైబిల్లో మనం ఏమి తెలుసుకున్నాం? మీరేమి నమ్ముతారు?”

అవును, మనకు ఉపదేశమిచ్చే ఎన్నో వ్యత్యాసాలు లేఖనాల్లో ఉన్నాయి, దేవుని మార్గంలో నడిచేలా అవి మనకు సహాయం చేస్తాయి. అంతేకాకుండా, మనం ఈ వ్యత్యాసాలను ఉపయోగించి ఇతరులు బైబిలు సత్యం తెలుసుకునేలా సహాయం చేయవచ్చు.

ఎఫెసీయులు 4, 5 అధ్యాయాల్లో ఉన్న కొన్ని వ్యత్యాసాలు

ఈ పట్టికను మీ కుటుంబ ఆరాధనలో ఉపయోగించి చూడండి!

“మనమిక మీదట . . . మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను . . . ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక”—4:14.

“ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. “ఆయన శిరస్సయియున్నాడు.”—4:14-16.

“[అన్య జనులు] వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన . . . ”—4:18, 19.

“అయితే మీరు యేసునుగూర్చి విని . . . ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.”—4:20, 21.

“కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే . . . మీ ప్రాచీనస్వభావమును వదులుకొని”—4:22.

“మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై . . . నవీనస్వభావమును ధరించుకొనవలెను.”—4:23, 24.

“దొంగిలువాడు ఇకమీదట దొంగిలక”—4:27, 28.

“తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.”—4:27, 28.

“చెడ్డ మాటలేవీ మీ నోటినుంచి రానివ్వకండి గాని”—4:29, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

“అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి.”—4:29, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

“మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు.”—5:3.

“వాటికి బదులు కృతజ్ఞతలు చెపుతూవుండాలి.”—5:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

“మీరు పూర్వమందు చీకటియై యుంటిరి.”—5:8.

“ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.”—5:8.

“నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక”—5:11.

“వాటిని ఖండించుడి.”—5:11.

“అజ్ఞానులవలె కాక”—5:15, 16.

“మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు . . . జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి”—5:15, 16.

“ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక”—5:17.

“ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.”—5:17.

“మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు.”—5:18.

“అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.” —5:18.

“తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు.”—5:29, 30.

“గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును . . . క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.”—5:29, 30.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి