మీ రాజ్యనిరీక్షణలో పాలుపంచుకొనుటకు బ్రోషూర్లను అందించండి
1 బైబిలు ప్రవచన నెరవేర్పును మనము చూస్తుండగా, మన రాజ్య నిరీక్షణయందు మనము సంతోషిస్తూ, వినగోరు వారికెవరికైనను దానినిగూర్చి మాట్లాడేందుకు మనము ప్రేరేపించబడుచున్నాము. (లూకా 6:45; రోమా. 12:12) యేసు ఆజ్ఞాపించినరీతిగా మనకున్న రాజ్య నిరీక్షణను పంచుకొనుటకు, ఆగష్టులో ప్రాంతీయ పరిచర్యయందు మనము బ్రోషూర్లను అందించుట ఒక మార్గమై యున్నది.—మత్త. 24:14.
2 ఎంచుకునేందుకు మనకు రంగురంగులతో, మంచి సమాచారముగల బ్రోషూర్లు అనేకమున్నవి గనుక, మన ప్రాంతమందున్న వారి అవసరతలను వాటిలో ఏవి బాగుగా తీర్చ గల్గివారి ఆసక్తిని రేకెత్తించగలవు? సాధ్యమైనంతమేరకు బ్రోషూర్లను బాగుగా ఉపయోగించేందుకు, అందలి విషయాలను మనము ఎరిగియుండవలెను. ఇందుకు, ఈ క్రిందనీయబడిన సంక్షిప్త పునర్విమర్శ మనకు సహాయముచేయును.
3 మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?: సాధ్యమైనప్పుడెల్లా ఆగష్టులో ఈ బ్రోషూరును ఉపయోగించుటయందు మనము దృష్టినిలుపుదము. ఇది ప్రాముఖ్యంగ హిందూ సంస్కృతి గల్గిన ప్రజలకొరకు తయారు చేయబడింది కనుక మన ప్రాంతమునకు తగినది. బైబిలు వర్తమానముతో పరిచయములేని వ్యక్తులకు దేవుని వాక్యముయొక్క ప్రాథమిక ఉపదేశాలను కొన్నింటిని అది సులభంగా పరిచయముచేసి అద్భుతమైన రాజ్య నిరీక్షణను పొందేందుకు యింకను పఠించుమని వారిని ప్రోత్సహించుచున్నది.
4 పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము: యేసు భూమిమీద ఉన్నపుడు, దేవుని రాజ్యమనేది ఆయన ప్రచారముయొక్క ముఖ్యాంశమై యుండెను. ఆ రాజ్యము ఒక వాస్తవమైన ప్రభుత్వమని, నేడు జీవితమును దుర్భరము చేయుచున్న సమస్యలను అది ఎట్లు పరిష్కరించునో ఈ బ్రోషూర్ చూపిస్తున్నది.
5 భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!: దేవుడు మానవుని ఎందుకుచేసెనో, మనము భూమిపై నిరంతరము జీవితమును ఎలా అనుభవించగలమో, యిది వివరించును. ఈ బ్రోషూర్నందలి వర్ణనలతోకూడిన ఉపమానములు సంగ్రహంగా వ్రాయబడిన వచనములు యౌవనులకును చదవగల్గే సామర్థ్యం పరిమితంగా ఉన్నవారికిని ఆకర్షణీయంగా ఉన్నవి. చెవిటివారికి ప్రాథమిక బైబిలు బోధనలను అందించుటకు కూడ దీనిని ఉపయోగించవచ్చును.
6 ది డివైన్ నేమ్ దట్ విల్ ఎండ్యూర్ ఫరెవర్: ఈ బ్రోషూరు లేఖనముల మరియు చారిత్రాత్మక దృష్టితో దేవుని నామమునుగూర్చి చర్చిస్తూ ఆ నామమును ఎరిగియుండి, తమ ఆరాధనలో దానిని వాడుకచేయుట క్రైస్తవులకు ఎందుకు తగియున్నదో చూపుచున్నది.
7 “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”: ఈ బ్రోషూర్ పరదైసును వర్ణించుచు, బైబిలుయెడల, మన సృష్టికర్త యెడల మెప్పుదలను వృద్ధిచేయును. దుష్టత్వమును దేవుడు ఎందుకనుమతించెనో చర్చించిన మీదట మూడు ప్రాథమిక బైబిలు బోధనలపై దృష్టిని సారించుచున్నది. అవి: విమోచన, పునరుత్థానము, రాజ్యము. మనం దానినుండి బైబిలు పఠనము చేయుటకు మనకు సులభమగునట్లుగా దాని ప్రతిపేజి క్రింది భాగమున ప్రశ్నలు కూడ ఉన్నవి.
8 త్రిత్వమును మీరు నమ్మవలయునా?: త్రిత్వమును నమ్ముచున్నామని ప్రజలు చెప్పవచ్చును, అయితేదాని అవగాహనలో వారు ఒకరికొకరు వ్యత్యాసం కల్గియుండవచ్చును. త్రిత్వమంటే ఏమిటి? బైబిలు దానిని బోధించుచున్నదా? యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడైయుండి త్రిత్వములో ఒక భాగమై యున్నాడా? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అనే ప్రశ్నలకు ఈ బ్రోషూర్ సమాధానములనిస్తున్నది.
9 మనము ఉపయోగించదలచిన బ్రోషూర్లను ఎంచుకొనిన తరువాత మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచిక వెనుకపేజి నందుగల శీర్షికలను మనము పునరాలోచించవలెను. మన సాహిత్యముల నందించుటకు, ఆసక్తిని వృద్ధిచేసి బైబిలు పఠనమును ప్రారంభించే దృక్పథముతో పునర్దర్శనములు చేయుటనుగూర్చిన సలహాలను మనము అందు కనుగొంటాము.
10 అనేక సందర్భాలలో మంచి సాక్ష్యమివ్వడానికి ఒక నిర్దిష్ట బ్రోషూర్ సరిపోతుంది. అయితే, మనము తగినన్ని బ్రోషూర్లను కల్గియుండి, వాటిలో ఏమున్నదో తెలిసికొని, వివేకముతో బాగుగా సిద్ధపడవలెను. మన ఆసక్తికరమగు పరిచర్యను యెహోవా ఆశీర్వదించగా రాజ్య నిరీక్షణలో మనతోపాటు అనేకులు ఉల్లసించుదురు గాక!—అపొ. 13:47, 48.