విభిన్న బ్రోషూర్లను మీ పరిచర్యలో ఉపయోగించండి
1 ప్రజలు నేడు విభిన్న అంశాల్లో ఆసక్తిని కలిగి ఉన్నారు. జూలై మాసంలో మీరు ప్రాంతీయ సేవ చేస్తుండగా, ప్రాంతంలోని ప్రజలను ఆకట్టుకునే ప్రత్యేకమైన దాన్ని ఉపయోగించడానికి వేర్వేరు విభిన్న బ్రోషూర్లను మీరు కలిగి ఉండవచ్చు. ఈ అందింపుల్లో ఒకదాన్ని మీరు ప్రయత్నించి చూడడానికి ఇష్టపడవచ్చు:
2 “మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?” అనే బ్రోషూర్ను అందించేటప్పుడు మీరిలా అడుగవచ్చు:
◼ “లోకంలో అసలు సమస్యలు లేకుంటే అదెలా ఉండేదని మీరు భావిస్తున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] భూమిని పరిపాలించే పనిని దేవుడు తీసుకోవడం ఒక్కటే మన సమస్యలన్నీ పరిష్కరించబడటానికి మార్గమని మనం వాస్తవంగా అపేక్షించవచ్చు. [20వ పేజీకి తిప్పి, అక్కడ కీర్తన 37:10 మరియు కీర్తన 46:9 ఉదహరించబడి ఉన్న మొదటి పేరాను చదవండి.] మీరు ఇలాంటి లోకంలో జీవించాలని ఇష్టపడుతున్నట్లైతే, మీరు ఈ బ్రోషూర్ను చదవాలి.” దాన్ని ఇవ్వండి.
3 “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే బ్రోషూర్ను ఇలా అందించవచ్చు:
◼ “మన ప్రియమైన వారు అసలు చనిపోకుండా ఉండే సమయం ఎప్పుడైనా వస్తుందని మీరు భావిస్తున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ఎంతో అందంగా వ్రాయబడిన ఈ బ్రోషూర్, అలాంటి దినం భవిష్యత్తునందు త్వరలో రాబోతుందన్న బైబిలు నిశ్చయ వాగ్దానంతో కోట్లాదిమందికి ఊరటనిచ్చింది. [5వ పేజీకి తిప్పి, 1 కొరింథీయులు 15:21, 22 తో సహా ఐదవ పేరాను చదవండి. తర్వాత 30వ పేజీలో ఉన్న బొమ్మను చూపండి.] మరణించిన మన ప్రియమైన వారు పునరుత్థానం అయినప్పుడు వారిని ఆహ్వానించడంలో మనం అనుభవించబోయే సంతోషాన్ని చిత్రకారుడు చక్కగా చిత్రీకరించాడు. అయితే ఈ ఆనందకరమైన దృశ్యం ఎక్కడ జరుగుతుంది? ఆ ప్రశ్నకు బైబిలిచ్చే జవాబును ఈ బ్రోషూర్ మీకు చూపిస్తుంది.” ఒకవేళ బ్రోషూర్ను తీసుకుంటే, మీరిలా చెప్పవచ్చు: “నేను మళ్లీ వచ్చి ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ చర్చించడానికి ఇష్టపడతాను.”
4 బైబిలు పఠనాన్ని ప్రారంభించడానికి ఈ సూటియైన పద్ధతిని ఉపయోగిస్తూ, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” అనే బ్రోషూర్ను మీరు అందించవచ్చు:
◼ “మీరు బైబిలును గురించి విని ఉంటారు, అయితే దాన్ని గురించి ఎక్కువగా నేర్చుకునే అవకాశం లభించి ఉండకపోవచ్చు. బైబిలును గురించి సాధారణంగా అడగబడే ప్రశ్నల్లో కొన్నింటిని ఈ ప్రచురణ వరుసగా చూపుతుంది. [30వ పేజీని చూపండి.] ఈ చివరి ప్రశ్న అనేకుల ఆసక్తిని రేకెత్తించింది: ‘పరదైసులో నిత్యజీవితం కొరకు మీరెలా సిద్ధపడతారు?’” 29-30 పేజీల్లో ఉన్న 57-8 పేరాలను మీరు చర్చించి, ప్రకటన 21:3, 4 చదివినట్లైతే ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించడానికి గట్టి పునాది వేస్తారు. బ్రోషూర్ను అందించి, ఇతర ప్రశ్నల్లో కొన్నింటిని మీరు చర్చించగల్గడానికి పునర్దర్శనం కొరకు ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ముగించండి.
5 “నిరంతరము నిలిచే దైవనామము” బ్రోషూర్ను మీరు ఈ విధంగా, సాధారణంగా అందించేందుకు ప్రయత్నించడానికి ఇష్టపడవచ్చు:
◼ “బైబిలునుండి నేను నేర్చుకున్న మొదటి సంగతుల్లో దేవుని నామం ఒకటి. అది ఏమిటో మీకు తెలుసా? [జవాబు చెప్పనివ్వండి.] నేను మీకు చూపిస్తానుండండి. అది బైబిలులో కీర్తన 83:18 నందిలా ఉంది. [చదవండి.] దేవుని నామమైన యెహోవా అనేక విభిన్న భాషల్లో ఎలా కనిపిస్తుందో ఈ బ్రోషూర్ చూపిస్తుంది. [8వ పేజీలోని బాక్సును చూపండి.] యెహోవాను గురించి, ఆయన సంకల్పాలను గురించి మీరు ఎక్కువగా నేర్చుకోవాలని ఇష్టపడుతుంటే, మీరు ఈ బ్రోషూర్ను చదవాలి.” బ్రోషూర్ను ఇంటివారి చేతికివ్వండి.
6 ఉపయోగించేందుకుగల అలాంటి చక్కని విభిన్న బ్రోషూర్లను కలిగుండి, “దీనులకు సువర్తమానము ప్రకటించుటకు” మనం వాస్తవంగా పూర్తిగా సంసిద్ధులం.—యెష. 61:1.