మొదటిసారి కలిసినప్పుడే పునాదివేయండి
1 మొదటిసారి కలిసినప్పుడే మనం సరియైన పునాదివేసినట్లయితే సమర్థవంతంగా పునర్దర్శనాలు చేయడం సులభమవుతుంది. దానిని చేయడానికి మనకు రీజనింగ్ పుస్తకం సహాయం చేయగలదు.
2 ఈ క్రింది సంభాషణా విధానం రీజనింగ్ పుస్తకం 10వ పుటలోని “బైబిల్/గాడ్” అనే శీర్షిక క్రిందగల రెండవ ఉపోద్ఘాతంపై ఆధారపడింది.
స్నేహపూర్వకంగా నమస్కారం చెప్పిన తర్వాత, ఇలాచెప్పండి:
◼ “ప్రతిదినం పెరిగిపోతున్న సమస్యలకు అభ్యాససిద్ధమైన జవాబులు తామెక్కడ కనుగొందుమనే విషయంలో ఈనాడు అంతకంతకు ఎక్కువమంది ప్రజలు అనిశ్చయ భావం కలిగియుండడాన్ని మనం చూస్తున్నాం కదండీ. అది నిజమని మీరూ అనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ఇంతకుముందైతే ప్రజలు బైబిలువైపు చూడడం జరిగేది. కానీ ఇప్పుడు అనేకమంది తమకు సందేహాలున్నాయని అంటున్నారు. బైబిలును గూర్చి మరి మీరేమనుకుంటున్నారు?” దాని వాస్తవికత విషయంలో గృహస్థుడు సందేహాన్ని వెలిబుచ్చినట్లయితే, ఎందుకు నీవు బైబిలును నమ్మగలవు అనే కరపత్రం తీసి రెండవ పేజీలోగల రెండు, మూడు పేరాలను చదవండి. గృహస్థుడు ఒకవేళ బైబిలు దేవుని వాక్యమని అంగీకరిస్తే, ఆ కరపత్రమందలి రెండవ పేజీలోగల రెండవ పేరాలో సూచింపబడిన లేఖనాల్ని చదివి, వాటిని క్లుప్తంగా ఆయనతో చర్చించండి.
3 మీ ప్రాంతంలో అపనమ్మకం వ్యక్తంచేసే వారు ఎక్కువగా ఉన్నట్లయితే, వారి ఆసక్తిని రేకేత్తించుటకు రీజనింగ్ పుస్తకం 10వ పేజీలోవున్న ఐదవ ఉపోద్ఘాతాన్ని తగినరీతిన మలచడానికి ప్రయత్నించండి.
మీరిట్లు చెప్పవచ్చు:
◼ “ఈనాడు లోకంలోవున్న విభేదాలన్నింటి దృష్ట్యా, చిత్తశుద్ధిగల అనేకమంది ప్రజలు దేవునియందు నమ్మకముంచడం కష్టమని భావిస్తున్నారు. లేదా వారికి ఒకవేళ ఆయనయందు నమ్మకమున్నా, మనమెదుర్కొనే సమస్యలను ఆయన పరిష్కరించగలడని వారు నమ్మడం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] మానవులను గూర్చి, విజ్ఞానశాస్త్రాన్ని గూర్చి, బైబిలును గూర్చి ఈ కరపత్రం ఏమి చెబుతుందో గమనించండి.” ఆ పిదప ఎందుకు నీవు బైబిలును నమ్మగలవు అనే కరపత్రమందలి 3వ పేజీలోగల ఐదవ పేరా చదవడం ప్రారంభించండి.
4 మీ తర్వాతి సందర్శనము నేర్పాటుచేయుటకు కరపత్రం నుండి ప్రశ్నలు వేయండి: మీ మొదటి సందర్శనము మీరు తర్వాత వరుసగా చేయబోవు ఫలవంతమైన పునర్దర్శనాలకు కేవలం ప్రారంభంగా ఉండులాగున పథకం వేయండి. మొదట్లోనే విషయాన్ని లోతుగా వివరించాల్సిన అవసరం ఉందని మీరు భావించవద్దు; లేక తనమీద మీకు నిజమైన శ్రద్ధలేదని గృహస్థుడు భావించునట్లు అర్థాంతరంగా మీ సంభాషణ ఆగిపోగూడదు. కరపత్రం నుండి రెండు మూడు పేరాలు చదివిన తర్వాత, భవిష్యత్తు సందర్శనమందు దానిని చర్చించగల్గునట్లు ఒక ప్రశ్నను వేయండి.
5 ఉదాహరణకు, 4వ పేజీలోని మూడవ పేరాకు దృష్టి మళ్లించి వారినిలా అడుగవచ్చు: “భవిష్యత్తును గూర్చి బైబిలు చెప్పేది నమ్మడానికి కావలసిన రుజువును అది ఇస్తుందని మీరనుకుంటున్నారా?” పునర్దర్శనానికి ఇది ఒక సూచనాంశమును స్థిరపరుస్తున్నది, మీరు మరలా వచ్చినప్పుడు నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో 5వ అధ్యాయాన్ని పరిశీలించవచ్చును.
6 గృహస్థుడు మన సమాచారమందు ఆసక్తి చూపిస్తూ, సాహిత్యం తీసికోవడానికి వెనుదీసినట్లయితే, కలిసిన మొదటిసారే నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించకూడదని మీరనుకోవచ్చు. అయినప్పటికిని నిరంతరము జీవించగలరు అనే పుసక్తమందుగల విషయసూచికలో ప్రాముఖ్యమైన, ఆలాగే ఆసక్తికరమైన అంశాన్ని చూపించుటద్వారా ఆయనలో ఆసక్తి రేకెత్తించండి. ఆ తర్వాత ఆ గృహస్థుని మీరు మరలా సందర్శించినప్పుడు పెద్దసైజు పుస్తకమైతే 40 రూ. చిన్నసైజు పుస్తకమైతే 20 రూ. చందాకు ఆయనకు అందించవచ్చును.
7 ప్రతి గృహస్థుడు ఒక శిష్యుడు కాగలడని మనం దృష్టిస్తే, పునర్దర్శనానికొక పునాదివేయునట్లు మన ముగింపు మాటలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం.