జ్ఞాపకార్థ ఆచరణకొరకు సిద్ధపడుటలో
ఆచరణ యొక్క సరైన సమయం మరియు స్థలం ప్రసంగీకునితో పాటు, అందరికీ తెలుపబడిందా? ప్రసంగీకునికి రవాణా సౌకర్యం ఉందా?
చిహ్నాలను తయారుచేసి వాటిని తగిన సమయానికి ఆచరణస్థలానికి తెచ్చే కచ్చితమైన ఏర్పాట్లు చేయబడినవా?
అవసరమైనన్ని గ్లాసులు మరియు ప్లేట్లతో పాటు శుభ్రమైన టేబుల్ క్లాత్‌తో బల్లను సమయానికి ముందే సిద్ధపరచుటకు ఏర్పాట్లు చేయబడినవా?
ముందుగానే రాజ్యమందిరాన్ని శుభ్రపరచుటకు ఎట్టి ఏర్పాట్లు చేయబడినవి?
అటెండెంట్లు మరియు అందజేసేవాళ్లు నియమించబడ్డారా? తమ పనులను సరిగ్గా చేయుటకు జ్ఞాపకార్థదినానికి ముందు వారితో కూటము ఏర్పాటు చేయబడినదా? ఎప్పుడు? ప్రతివారికీ సమర్ధవంతంగా అందించబడుటకు ఏ పద్ధతి పాటించబడును?
అనారోగ్యులు మరియు వృద్ధులైన సహోదర సహోదరీలకు సహాయం చేయుటకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? అభిషక్తులు ఎవరైనా అనారోగ్యంగా ఉండి సంఘంతో కలిసి హాజరుకాలేని పరిస్థితులలో ఉంటే వారికి అందించుటకు ఏర్పాట్లు చేయబడినవా?