అన్ని భాషలకూ, మతాలకూ చెందిన ప్రజలకు సాక్ష్యమివ్వడం
1 ఇతర భాషల్ని మాట్లాడే, వివిధ మతాల్ని ఆచరించే ప్రజలకు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఆసక్తితో సాక్ష్యమిచ్చారు. తత్ఫలితంగా, “100వ సంవత్సరంనాటికి మధ్యదరా సముద్ర సరిహద్దుల్లో ఉన్న ప్రతీ రాష్ట్రమూ ఒక క్రైస్తవ సముదాయాన్ని కల్గివుంది.”—మధ్యయుగాల చరిత్ర (ఆంగ్లం).
2 ఇక్కడ ఇండియాలో ప్రజలు అనేక భాషలు మాట్లాడతారు. చాలావరకు, ఏ భాష మాట్లాడే ప్రజలు ఆ భాష మాట్లాడే రాష్ట్రంలోనే ఉంటున్నారు. అయినప్పటికీ, ఇండియాలోని అనేక నగరాలూ, పట్టణాలూ ఇప్పుడు వివిధ భాషలు మాట్లాడే ప్రజలు నివసించే కాస్మోపొలిటన్ నగరాలుగా మారుతున్నాయి. ఈ భాషా వైవిధ్యాన్నిబట్టి, అలాంటి ప్రజలతో సంభాషించి సాక్ష్యమివ్వడం ఎలాగో తెలుసుకోవడం కొన్నిసార్లు ఒక సవాలుగానే ఉంటుంది. తత్ఫలితంగా, బహుశా మనం స్థానికంగానే మిషనరీ ప్రాంతాన్ని కల్గివుండవచ్చు. అన్ని భాషలకూ, మతాలకూ చెందిన “ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెన”నే యేసు ఆజ్ఞలను మనమెలా అనుసరించగలం?—అపొ. 10:42.
మరొక భాషను మాట్లాడే ప్రజలకు సాక్ష్యమివ్వడం
3 ప్రజలకు వారి స్వంత భాషలో బోధించినప్పుడు వాళ్లలో అనేకులు ఎంతో త్వరగానూ, లోతైన అవగాహనతోనూ నేర్చుకుంటారనడంలో సందేహమేమీలేదు. ‘సువార్త నిమిత్తమూ,’ అలాగే ‘దానిలో ఇతరులతో పాలివారయ్యేందుకూ’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది సహోదర సహోదరీలు మరొక భాషను నేర్చుకున్నారు. (1 కొరిం. 9:23) ఆంగ్లభాష మాట్లాడే ఒక దేశంలో, ఆంగ్లభాష మాట్లాడే సహోదరి పత్రికా మార్గంలో చైనాభాష మాట్లాడే స్త్రీ అనేక సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, ఆ స్త్రీ చైనా భాషను నేర్చుకుంటున్న మరొక సహోదరి ఆ భాషలో పుస్తకాన్ని ప్రతిపాదించేంత వరకూ బైబిలు పఠన ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. ఆమె ఆ పుస్తకంతో పాటూ బైబిలు పఠనాన్ని కూడా వెంటనే అంగీకరించింది. ఇంత మార్పును ఏది తెచ్చిందంటే ఆ స్త్రీ సొంత భాషలో మాట్లాడడానికి రెండవ సహోదరి చేసిన కృషే.—పోల్చండి అపొస్తలుల కార్యములు 22:2.
4 మీ ప్రాంతంలో సాధారణంగా మాట్లాడే భాషతోపాటూ మరో భాష కూడా మీకు తెలిస్తే, మీకు తెలిసిన ఆ రెండవ భాషను మాట్లాడే మీ ప్రాంతంలోని ప్రజలపై మీరు ప్రత్యేక శ్రద్ధను చూపించగలగవచ్చు. (మత్త. 9:37, 38) ఉదాహరణకు, సత్యంలోకి రావడానికి ముందు వియత్నమీస్ భాషను నేర్చుకున్న అమెరికాలోని ఒక సహోదరుడు, వియత్నమీస్ భాష మాట్లాడే ప్రజలతో సువార్తను పంచుకోవడంలో ఇప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ భాషలో తనకున్న పరిజ్ఞానాన్ని సాక్ష్యమివ్వడంలో ఉపయోగించేందుకు తననుతాను అందుబాటులో ఉంచుకోవడానికి, వియత్నమీస్ భాష మాట్లాడే ప్రాంతంలో అవసరం ఎక్కువగా ఉన్న చోటుకి తన కుటుంబసమేతంగా ఆయన వెళ్లాడు. అక్కడకు వెళ్లినప్పటి నుండీ, ఆయన వియత్నామ్ నుండి వచ్చిన అనేకమంది ప్రజలతో బైబిల్ని పఠించడంలో చక్కని సాఫల్యాన్ని సాధించాడు.
5 ఒక పయినీరు సహోదరి తన ప్రాంతంలో అనేకమంది బధిరులైన ప్రజల్ని కలుసుకొంది. తాను వారికి సత్యాన్ని బోధించగలిగేలా సంజ్ఞా భాషను తనకు బోధించే వ్యక్తినెవరినైనా కనుగొనేందుకు సహాయం చేయమని ఆమె యెహోవాకు ప్రార్థించింది. ప్రక్కనున్న సూపర్ మార్కెట్లో ఒకరోజు షాపింగ్ చేస్తుండగా, ఒక వస్తువును కనుగొనడానికి సహాయం అడుగుతూ ఒక యౌవనురాలైన బధిర స్త్రీ నోట్‌ను రాసి ఆమెకు చూపింది. ఆ వస్తువును కనుగొనడానికి ఆమెకు సహాయం చేసిన తర్వాత, ఆ ప్రాంతంలో ఉన్న బధిరులకు సహాయపడేందుకు సంజ్ఞా భాషను నేర్చుకోవాలనే తన కోరికను వ్యక్తపరుస్తూ ఒక నోట్‌ను ఆ పయినీరు రాసింది. “బధిరులకు సహాయపడాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు?” అని అడుగుతూ బధిరురాలైన ఆ స్త్రీ తిరిగి రాసింది. “నేను ఒక యెహోవాసాక్షిని, బధిరులు బైబిల్ని అర్థంచేసుకొనేందుకు సహాయపడాలని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సంజ్ఞా భాషను నేర్పిస్తే నేను మీకు బైబిల్ని సంతోషంగా బోధిస్తాను” అని ఆ సహోదరి తిరిగి రాసింది. “ఆమె సరేనన్నప్పుడు నాకు కల్గిన ఆనందాన్ని మీరు ఊహించలేరు” అని అంటోంది ఆ సహోదరి. ప్రతీ సాయంత్రమూ ఆరువారాలు ఆ స్త్రీ ఇంటికి ఆ సహోదరి వెళ్లింది. ఆమె సంజ్ఞా భాషను నేర్చుకొంది, మరి ఆ స్త్రీ సత్యాన్ని నేర్చుకొని బాప్తిస్మం పొందింది! అది జరిగి 30 ఏళ్లకు పైగా గడిచిపోయింది, మరి ఆ పయినీరు సహోదరి బధిరులకు ఇప్పటికీ సాక్ష్యమిస్తోంది.
6 మీ ప్రాంతం సమగ్రంగా పూర్తిచేయబడి, కొద్దిమంది సాక్షులు మాత్రమే ఉన్నారని మీకు తెలిసిన ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే భాషను మీరు ధారాళంగా మాట్లాడగల్గీ, ఆ ప్రాంతానికి స్వచ్ఛందంగా వెళ్లే అభిలాష మీకుండీ, అలా వెళ్లగలిగే సాధ్యత ఉంటే, మీరు ఆ విషయాన్ని మీ సంఘంలోని పెద్దలతో ఎందుకు చర్చించకూడదు? మీరు అర్హులని వాళ్లు భావిస్తే, మీరు సొసైటీకి రాయవచ్చు. మీ అర్హతలను గూర్చిన, భాషా నైపుణ్యాలను గూర్చిన తమ పరిశీలనలతో కూడిన ఉత్తరాన్ని దానికి జతచేసి పెద్దలు పంపిస్తారు.—కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1988, 21-3 పేజీలను చూడండి.
7 ఇవ్వబడిన ఉపకరణాలను ఉపయోగించడం: మన సాహిత్యాలు అనేక భాషల్లో లభ్యమౌతున్నాయి. మీ ప్రాంతంలో మాట్లాడే అన్ని భాషల్లోనూ కరపత్రాల్నిగానీ లేక దేవుడు కోరుతున్నాడు బ్రొషూరునుగానీ లేక మరితర బ్రొషూరునుగానీ తీసుకెళ్లడం మంచిది. స్థానికంగా మాట్లాడే భాష ఒక వ్యక్తి స్వభాష కాకపోతే, ఆయన ఏ భాష చదవడానికి ఇష్టపడతారో అడగండి. అప్పుడు, వీలైతే ఆ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆయనకు ఇవ్వండి.
8 సాక్ష్యమిచ్చే మీ పనిలో మీరు కలుసుకున్న వ్యక్తి మాట్లాడే భాషలో మీరు మాట్లాడలేకపోయినప్పటికీ, మీరు ఆయనకు సువార్తను అందించవచ్చు. ఎలా? సకల జనులకు సువార్త (గుడ్ న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్) అనే చిన్నపుస్తకాన్ని ఉపయోగించడం ద్వారానే. దాన్లో 59 భాషల్లో ముద్రించబడిన క్లుప్తమైన సందేశం ఉంది. ఆ చిన్న పుస్తకంలో 2వ పేజీలో ఉన్న సూచనలు వివరించినట్లుగా, గృహస్థుడు ఏ భాష మాట్లాడతారో మీరు ధృవపర్చుకున్న తర్వాత, ఆ చిన్న పుస్తకంలో ఆయన మాట్లాడే భాషలో ఉన్న ముద్రిత సందేశంగల పేజీలోని సమాచారాన్ని ఆయనను చదవనివ్వండి. ఆయన దాన్ని చదివిన తర్వాత, ఆయన మాట్లాడే భాషలోవున్న సాహిత్యాన్ని చూపించండి. ఆ భాషలో మీ దగ్గర సాహిత్యంలేకపోతే, మీ దగ్గర మరేయితర భాషలోనైనా సాహిత్యంవుంటే దాన్ని చూపించండి. ఆయన మాట్లాడే భాషలో ఉన్న ఆ సాహిత్య ప్రతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తానని సూచించండి. ఆయన పేరును అడిగి, చిరునామాతోపాటూ దాన్ని రాసుకోండి. బహుశా మీ సంఘంలో ఆ భాష మాట్లాడే మరొకరికి మీరు ఆ సమాచారాన్ని ఇవ్వవొచ్చు. పునర్దర్శనం చేయడానికి ఆ భాషను మాట్లాడేవారెవ్వరూ లేకపోతే, బహుశా మీరు మీ సొంత భాషలో ఉన్న ప్రచురణను అనుసరించడం ద్వారా ఆ వ్యక్తితో పఠనం చేస్తూ, మీరా సవాలును అంగీకరించగలగ వచ్చు.—1 కొరిం. 9:19-23.
క్రైస్తవేతర మతాలకు చెందిన ప్రజలకు సాక్ష్యమివ్వడం
9 ఒక వ్యక్తి మత నేపథ్యాన్ని గూర్చి కొంత పరిజ్ఞానాన్ని కల్గివుండడం, దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రతిభావంతమైన సాక్ష్యాన్నిచ్చేందుకు సహాయపడుతుంది. దేవుని కొరకు మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకం, సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందేందుకు మనం ప్రజలకు సహాయపడటానికి వారి నమ్మకాలను తగినంతగా అర్థం చేసుకొనగలిగేలా ప్రపంచంలోని ప్రధాన మతాల్ని గూర్చిన అంతర్దృష్టిని ఇస్తోంది.
10 క్రైస్తవేతర మతాలకు చెందిన ప్రజలకు సాక్ష్యమివ్వడంలో ఉపయోగించడం కొరకు యెహోవా సంస్థ అందించిన ప్రచురణల్లో కొన్ని, ఈ అనుబంధ శీర్షికలోని చివరి పేజీలో ఉన్న బాక్సులో ఇవ్వబడ్డాయి. ఈ ప్రచురణలను చదవడం ద్వారా, సువార్తతో ప్రజల్ని ఎలా సమీపించవచ్చో మనం అర్థం చేసుకుంటాం. తర్కించుట (ఆంగ్లం) పుస్తకం సహాయకరమైన ఉపకరణమనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ పుస్తంలోని 21-4 పేజీల్లో బౌద్ధమతస్తులకు, హిందువులకు, యూదులకు, ముస్లిమ్‌లకు ఎలా ప్రత్యుత్తరమివ్వవచ్చు అనే విషయంపై అభ్యాససిద్ధమైన సలహాలు ఇవ్వబడ్డాయి.
11 మీరు చెప్పేదాని గురించి జాగ్రత్తవహించడం: లానా మతానికి చెందిన వారి వ్యక్తిగత నమ్మకాలూ, అదే మత విశ్వాసానికి చెందిన ఇతరుల నమ్మకాలూ తప్పక ఒకే విధంగా ఉంటాయనే నిర్థారణకు రాకుండా మనం జాగ్రత్త వహించాలి. బదులుగా, మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకోవడానికి కృషి చేయండి. (అపొ. 10:24-35) ఒక ముస్లిమ్ వ్యక్తిగా, సలీమూన్ ఖురానే దేవుని వాక్యమనే నమ్మకంతో పెరిగాడు. కానీ సర్వదయాళువైన దేవుడు మండుతున్న నరకంలో ప్రజల్ని హింసిస్తాడనే ముస్లిమ్ బోధను ఆయన ఎన్నడూ పూర్తిగా అంగీకరించలేకపోయాడు. ఒక రోజున, యెహోవాసాక్షులు ఆయన్ని ఒక కూటానికి హాజరుకమ్మని ఆహ్వానించారు. సత్యాన్ని వెనువెంటనే గుర్తించిన ఆయన, ఇప్పుడు క్రైస్తవ సంఘంలో ఒక పెద్దగా సంతోషంగా సేవ చేస్తున్నాడు.
12 క్రైస్తవేతర మత విశ్వాసాలుగల వారికి సాక్ష్యమిస్తున్నప్పుడు, మనం వారిని సమీపించే విధానం, సువార్తను గురించి వారితో సంభాషించే అవకాశం చేజారిపోయేలా చేయకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరంవుంది. (అపొ. 24:16) కొన్ని మతాలను అనుసరించేవారు, వారిని ‘మత మార్పిడిచేసేందుకు’ చేసే ఏ ప్రయత్నాల విషయంలోనైనా ఎంతో ప్రతికూల దృక్పథాన్ని కల్గి ఉంటారు. దేవుని వాక్య సత్యమంతటివైపూ వారిని ఆకర్షించేలా వారికి పరిచయమున్న విషయంపై సంభాషణను ప్రారంభించేందుకు వీలయ్యే అంశాల్ని కనుగొనే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు దయాపూర్వకంగా సమీపించి, సత్యాన్ని స్పష్టంగా అందిస్తే, గొఱ్ఱెల్లాంటివారు ప్రతిస్పందిస్తారు.
13 మనం మట్లాడే మాటల్ని ఎంచుకోవడమనేది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయమే, లేకపోతే మనం అనవసరంగా ప్రజలను మన సందేశం నుండి దూరం చేస్తాము. ఉదాహరణకు, మిమ్మల్ని మీరు వెంటనే క్రైస్తవునిగా పరిచయం చేసుకుంటే, మీరు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలకుచెందినవారనే తలంపు దానంతటదే మీ శ్రోత మనస్సులోకి రావచ్చు, అది ఒక ప్రతిబంధకం కాగలదు. బైబిల్ని ‘లేఖనములనీ’ లేక ‘పరిశుద్ధ లేఖనములనీ’ సూచించడం ప్రయోజనకరమైనదిగా కూడా ఉండవచ్చు.—మత్త. 21:42; 2 తిమో. 3:15.
14 బౌద్ధమతస్థులకు సాక్ష్యమివ్వడం: (వుని కొరకు మానవజాతి అన్వేషణ అనే పుస్తకంలోని 6వ అధ్యాయాన్ని చూడండి.) బౌద్ధమతస్థుని నమ్మకాలు వ్యక్తి వ్యక్తికీ భిన్నంగా ఉంటాయి. వ్యక్తిత్వమున్న సృష్టికర్త ఉనికిని ప్రకటించే బదులు, బౌద్ధమతం సా.శ.పూ. ఆరవ శతాబ్దానికి చెందిన గౌతమ బుద్ధుని ఒక మతపరమైన బింబంగా దృష్టిస్తుంది. గౌతముడు రోగినీ, వృద్ధున్నీ, శవాన్నీ మొదటసారి చూసినప్పుడు, అతడు జీవితార్థం విషయంలో కలతచెందాడు. ‘మానవులు బాధననుభవించి, వృద్ధాప్యానికెదిగి, మరణించడానికే జన్మించారా?’ అని ఆయన ఆలోచించాడు. నిజమే, ఆ ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవాలనే నిష్కపటులైన బౌద్ధమతస్థులకు మనం జవాబివ్వవచ్చు.
15 బౌద్ధమతస్థులతో మాట్లాడుతున్నప్పుడు, పవిత్ర గ్రంథాలన్నిటిలోకెల్లా మహోన్నత గ్రంథమైన బైబిల్లో ఉన్న స్పష్టమైన సత్యాలనూ అనుకూలమైన సందేశాన్నీ మాత్రమే ఉపయోగించండి. శాంతి నైతికతలలో, కుటుంబ జీవిత విషయాల్లో అనేకమంది ఇతర ప్రజలు ఆసక్తిని కలిగివున్నట్లుగానే బౌద్ధమతస్థులు కూడా ఎంతో ఆసక్తిని కల్గివున్నారు, వాళ్లు ఈ అంశాలపై చర్చించడానికి తరచూ మక్కువ చూపిస్తారు. మానవాళి సమస్యలకు నిజమైన పరిష్కారంగా రాజ్యాన్ని మీరు ఉన్నతపర్చేందుకు ఇది నడిపించగలదు. కిరాణా దుకాణంలో చైనా దేశస్థున్నొకతన్ని ఒక సహోదరి చూసినప్పుడు, ఆయన మాట్లాడే భాషలో ఒక కరపత్రాన్నిచ్చి, బైబిలు పఠనాన్ని ప్రతిపాదించింది. “మీరనేది పరిశుద్ధ బైబిల్ని గురించేనా? దీన్ని గురించే నా జీవితమంతా నేను అన్వేషిస్తున్నాను!” అని ఆయన అన్నాడు. ఆయన ఆ వారంలోనే బైబిలు పఠనాన్ని ఆరంభించి, కూటాలన్నిటికీ హాజరవ్వడం మొదలుపెట్టాడు.
16 ఒక దశాబ్దానికి పైగా, మరొక పయినీరు సహోదరి చైనీస్ విద్యార్థులకు సత్యాన్ని బోధిస్తోంది. ఈ విద్యార్థులుంటున్న ఎనిమిది అపార్ట్మెంట్లుగల ఒక భవనంలో పనిచేస్తున్నప్పుడు, ప్రతీ అపార్ట్మెంట్లోనూ ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించేలా సహాయం చేయమని ఆమె యెహోవాను ప్రార్థించింది. రెండు వారాల్లోనే, ప్రతీ అపార్ట్మెంట్లో కనీసమొక విద్యార్థితో ఆమె బైబిలు పఠనం చేయడం మొదలుపెట్టింది. విద్యార్థుల్లో తాను ఒక సాధారణ విషయాన్ని కనుగొన్నాననీ, అది వాళ్లంతా శాంతి సంతోషాలను కోరుకొంటారనే విషయమేనని చెప్పడమే వారిని సమీపించే విషయంలో ఆమెకు బాగా పనిచేసింది. అటు తర్వాత వారు కూడా ఆ విషయంలో శ్రద్ధ కల్గివున్నారాని ఆమె అడుగుతుంది. వాళ్లు దానితో ఎప్పుడూ ఏకీభవిస్తారు. చైనా ప్రజల కొరకు రూపొందించబడిన నిరంతర సమాధాన సంతోషాలు—వాటిని కనుగొనే విధానం (ఆంగ్లం) అనే బ్రొషూరువైపు వారి అవధానాన్ని మళ్లిస్తుంది. ఐదుసార్లు బైబిలు పఠనం జరిగిన తర్వాత, దీర్ఘకాలంగా సత్యం కోసం అన్వేషిస్తున్నాననీ మరి తాను దాన్నిప్పుడు కనుగొన్నాననీ ఒక విద్యార్థి ఆమెతో చెప్పాడు.
17 హిందువులకు సాక్ష్యమివ్వడం: (వుని కొరకు మానవజాతి అన్వేషణలో 5వ అధ్యాయం చూడండి.) మనలో అనేకమందికి తెల్సినట్లుగానే, హిందూమతానికి నిర్దిష్టమైన మత సిద్ధాంతాల్లేవు. దాని తత్త్వజ్ఞానం సంక్లిష్టమైనది. (సృష్టికర్తయైన బ్రహ్మ, రక్షణకర్తయైన విష్ణువు, నాశనకర్తయైన శివుడు అయిన) తమ ముఖ్య దేవుడగు బ్రహ్మను త్రిమూర్తి స్వరూపంగా కల్గివున్నారు. పునర్జన్మను గూర్చిన వారి బోధకు అమర్త్యమైన ఆత్మయందలి నమ్మకం అవసరం, అది హిందువుల్లో జీవితం విషయంలో విధివాద దృక్పథాన్ని కలుగజేస్తుంది. (తర్కించుట 317-21 పేజీలనూ, కావలికోట మే 15, 1997, 3-8 పేజీలనూ చూడండి.) హిందూమతం సహనాన్ని బోధిస్తుంది. అది మతాలన్నీ ఒకే సత్యానికి నడిపిస్తాయని కూడా బోధిస్తుంది.
18 హిందూ తత్త్వ విషయాలపై సుదీర్ఘమైన చర్చలు చేయడానికి బదులు, ఒక హిందువుకు సాక్ష్యమివ్వడంలో, భూమిపై మానవ పరిపూర్ణతతో నిరంతరం జీవించగలమనే మన బైబిలు ఆధారిత నిరీక్షణనూ, అలాగే మానవజాతంతా ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న సంతృప్తికరమైన జవాబులనూ వివరిస్తే సరిపోతుంది.
19 యూదులకు సాక్ష్యమివ్వడం: (దేవుని కొరకు మానవజాతి అన్వేషణలో 9వ అధ్యాయాన్ని చూడండి.) ఇతర క్రైస్తవేతర మతాలవలే కల్పితగాథలపైగాక, యూదామతం చరిత్రలో లోతుగా వేరుపారి ఉంది. ప్రేరేపిత హెబ్రీ లేఖనాలద్వారా, సత్యదేవుని కొరకైన మానవజాతి అన్వేషణలో ఒక ముఖ్యమైన లింకు ఇవ్వబడింది. అయినా, దేవుని వాక్యానికి విరుద్ధంగా, ఆధునిక యూదామత ప్రధానబోధ ఏమిటంటే అమర్త్యమైన మానవాత్మనందు నమ్మకముంచడమే. మనం అబ్రాహాము దేవుడ్ని ఆరాధిస్తున్నామని ధృవపర్చడం ద్వారా, నేటి లోకంలో మనమంతా ఒకేవిధమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నామని గుర్తించడం ద్వారా వారికి పరిచయమున్న విషయంపై సంభాషణను ప్రారంభించవచ్చు.
20 దేవునియందు విశ్వాసంలేని యూదున్ని మీరు కలుసుకుంటే, అతడు ఎప్పుడూ అదే విధంగా భావించాడా అని అడగడం, బహుశా అతన్ని బాగా ఆకట్టుకునేదేంటో వివేచించడానికి మీకు సహాయపడవచ్చు. ఉదాహరణకు, దేవుడు బాధను ఎందుకు అనుమతించాడనే దానికి సంతృప్తికరమైన వివరణను అతనెన్నడూ వినకపోయి ఉండవచ్చు. క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క యేసును గూర్చిన తప్పుడు చిత్రీకరణలో గాక, గ్రీకు లేఖనాల యూదా రచయితలు ఆయనను గురించి వివరిస్తున్న దానిలో మెస్సీయగా ఆయన గుర్తింపును పునఃపరిశీలన చేయమని నిష్కపటులైన యూదులను ప్రోత్సహించవచ్చు.
21 ముస్లిమ్‌లకు సాక్ష్యమివ్వడం: (దేవుని కొరకు మానవజాతి అన్వేషణలో 12వ అధ్యాయాన్ని చూడండి.) ఇస్లామ్ మతాన్ని అనుసరించే ముస్లిమ్‌లు తమ ఏకైక దైవంగా అల్లానందూ, ప్రవక్తలలో చివరివానిగా, అతి ప్రముఖుడైన ప్రవక్తగా మహమ్మద్నందూ (సా.శ. 570-632) నమ్మకం ఉంచుతారు. దేవుడొక కుమారున్ని కల్గివున్నాడని ముస్లిమ్‌లు నమ్మరు గనుక, వాళ్లు యేసును దేవుడు పంపించిన చిన్న ప్రవక్తగానే గుర్తిస్తారు గానీ అంతకంటే ఎక్కువని భావించరు. 1,400 సంవత్సరాలకన్నా తక్కువ కాలం క్రిందటిదైన ఖురాన్, హెబ్రీ గ్రీకు లేఖనాలు రెండింటినీ ఉదాహరించింది. ఇస్లామ్, కథోలిక్ మతాలమధ్య బలమైన సామ్యాలున్నాయి. రెండు మతాలూ మానవాత్మ అమర్త్యత్వాన్నీ, తాత్కాలికంగా బాధింపబడే స్థితినీ, మండుతున్న నరకం యొక్క ఉనికినీ బోధిస్తాయి.
22 సత్యదేవుడొక్కడే ఉన్నాడనే, బైబిలు ఆయనచే ప్రేరేపించబడిందనే మన విశ్వాసమే ఒక స్పష్టమైన చర్చనీయాంశం. ఖురాన్‌ను జాగ్రత్తగా చదివే పాఠకుడు, తోరా, కీర్తనలు, మరియు సువార్తల ఉల్లేఖనాలను చూశాడు, వాటిని అలా గుర్తించాలనీ వాటికి లోబడాలనీ కూడా చదివాడు. అందుకే, వారితో వాటిని పఠనం చేస్తామని చెప్పవచ్చు.
23 ఒక ముస్లిమ్‌కు మీరిలా చెప్పడం సముచితంగా ఉండవచ్చు: “ఈ పుస్తకంలో మీ బోధల్లో కొన్నింటిని గురించి నేను చదివాను. [తర్కించుట పుస్తకంలో 24వ పేజీవైపుకి త్రిప్పండి.] మీరు యేసును ప్రవక్తగానూ, మహమ్మద్‌ను ప్రవక్తల్లో చివరివానిగానూ, అత్యంత ప్రముఖునిగానూ విశ్వసిస్తారని ఇది చెబుతోంది. మోషే కూడా నిజమైన ప్రవక్తయై ఉండెనని మీరు విశ్వసిస్తారా? [జవాబు చెప్పనివ్వండి.] దేవుని సొంత నామాన్ని గురించి ఆయన నుండి మోషే ఏమి తెలుసుకున్నాడో నేను మీకు చూపించనా?” అప్పుడు నిర్గమకాండము 6:2, 3 వచనాలను చదవండి. పునర్దర్శనమందు, దేవునికి నిజమైన విధేయతను చూపించవలసిన సమయం (ఆంగ్లం) అనే చిన్నపుస్తకంలో 13వపేజీలోని “ఒకే దేవుడు, ఒకే మతం” అనే ఉపశీర్షికను మీరు చర్చించవచ్చు.
24 “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి” అని చెప్పే యెషయా 55:6 వచనంలో ఉన్న మాటలకు అనుగుణంగా నేడు అనేకమంది ప్రవర్తిస్తున్నారు. యథార్థవంతులైన వ్యక్తుల భాషా నేపథ్యం లేక మత నేపథ్యం ఏదైనప్పటికీ, ఇది వారందరికీ అన్వయిస్తుంది. మనం వెళ్లి “సమస్త జనులను శిష్యులనుగా చేయ[డానికి]” కృషి చేస్తుండగా మన ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదిస్తాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.—మత్త. 28:19.
[6వ పేజీలోని బాక్సు]
క్రైస్తవేతర మతాలకు చెందిన ప్రజల కొరకు రూపొందించబడిన సాహిత్యాలు
బౌద్ధమతస్థుల కొరకు
“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” (బ్రొషూరు)
పిత్రాన్వేషణలో (చిన్నపుస్తకం, [ఆంగ్లం])
చైనీయుల కొరకు
నిరంతర సమాధాన సంతోషాలు—వాటిని కనుగొనే విధానం (బ్రొషూరు [ఆంగ్లం])
హిందువుల కొరకు
కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట (చిన్నపుస్తకం)
మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? (బ్రొషూరు)
మరణంపై విజయం—ఇది మీకు సాధ్యమేనా? (చిన్నపుస్తకం [ఆంగ్లం])
విడుదలకు నడుపు దైవికసత్య మార్గము (చిన్నపుస్తకం)
యూదుల కొరకు
యుద్ధంలేని లోకం ఎప్పుడైనా ఉంటుందా? (బ్రొషూరు [ఆంగ్లం])
ముస్లిమ్‌ల కొరకు
దేవునికి నిజమైన విధేయతను చూపించవలసిన సమయం (చిన్నపుస్తకం)
పరదైసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా (కరపత్రం)