కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g16 No. 4 పేజీలు 11-15
  • పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి
  • తేజరిల్లు!—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్య
  • మీరు తెలుసుకోవాల్సినవి
  • ఏమి చేయవచ్చు
  • దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉందా?
    యువత అడిగే ప్రశ్నలు
  • ఏదైనా తట్టుకునే శక్తి ఎలా వస్తుంది?
    తేజరిల్లు!—2019
  • మీ పరిస్థితులు మారినప్పుడు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా చురుకుగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—2016
g16 No. 4 పేజీలు 11-15
ఒక అమ్మాయి తన ఫ్రెండ్‌ వేరేచోటికి వెళ్లిపోతుందని బాధగా ఉంది

కుటుంబం కోసం | యువత

పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

సమస్య

  • మీ నాన్న ఉద్యోగం వల్ల మీరు వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది.

  • మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ చాలా దూరం వెళ్లిపోతున్నాడు.

  • మీ అక్కకు లేదా అన్నకు పెళ్లై ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు.

ఇలాంటి మార్పులకు మీరు ఎంత బాగా అలవాటుపడతారు?

గాలికి వంగిపోతున్న చెట్టు

గాలికి వంగే చెట్టు తుఫానును తట్టుకునే అవకాశాలు ఎక్కువ. మీ చేతుల్లో లేని పరిస్థితులు లేదా మార్పులు వచ్చినప్పుడు మీరూ ఆ చెట్టులా “వంగిపోవడం” నేర్చుకోవాలి. కానీ అది ఎలా చేయవచ్చో మాట్లాడుకునే ముందు, మార్పు గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చూద్దాం.

మీరు తెలుసుకోవాల్సినవి

మార్పును తప్పించుకోలేము. మనుషులకు సంబంధించి బైబిలు ఒక ముఖ్యమైన సత్యాన్ని చెప్తుంది: అనుకోకుండా కాలవశము చేత అందరికీ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. (ప్రసంగి 9:11) ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా ఈ మాటల్లో నిజాన్ని చూస్తారు. అయితే అనుకోకుండా జరిగే సంఘటనలన్నీ చెడ్డవి కావు. కొన్ని మార్పులు ముందు చెడుగా అనిపించినా రానురాను వాటివల్ల మంచి జరగవచ్చు. కానీ చాలామంది ఒక రొటీన్‌కి లేదా ఒకే పట్టికకు అలవాటు పడి ఉంటారు కాబట్టి మార్పు వచ్చినప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఎదుగుతున్న పిల్లలకు మార్పు మరింత కష్టంగా ఉంటుంది. ఎందుకు? “ఇప్పటికే మీలోపల కొన్ని మార్పులు జరుగుతున్నాయి, వాటికి తోడు బయట కూడా మార్పులు జరిగినప్పుడు మీకు ఇంకా కష్టమౌతుంది” అని అశ్విన్‌ a అనే అబ్బాయి అంటున్నాడు.

ఇంకొక కారణం ఏంటంటే: ఏదైనా మారినప్పుడు పెద్దవాళ్లైతే వాళ్ల సొంత అనుభవాల పుస్తకాన్ని తిరగేస్తారు, అంటే గతంలో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమి చేశారో గుర్తు చేసుకుంటారు. కానీ యువకులకు గుర్తు చేసుకోవడానికి అలాంటి అనుభవాలు చాలా తక్కువ ఉంటాయి.

మీరు పరిస్థితులకు తగ్గట్లు మారడం నేర్చుకోవచ్చు. కొంతమంది పిల్లలకు ఏదైనా చెడు జరిగినా, మార్పులు వచ్చినా తట్టుకుని వాటికి తగ్గట్టుగా మారే సామర్థ్యం ఉంటుంది. వాళ్లు కొత్త పరిస్థితుల్ని తట్టుకోవడమే కాదు, అడ్డంకుల్ని అవకాశాలుగా మార్చుకుంటారు. పరిస్థితులు వాళ్ల చేతుల్లో లేకపోయినా అలాంటివాళ్లు డ్రగ్స్‌పైన, మద్యంపైన ఆధారపడకుండా ఉండగలరు.

ఏమి చేయవచ్చు

వాస్తవానికి అలవాటు పడండి. మీ జీవితం పూర్తిగా మీ చేతుల్లో ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ అది సాధ్యం కాదు. స్నేహితులు వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు లేదా పెళ్లి చేసుకుంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు పెద్దవాళ్లై వేరే చోటికి వెళ్లిపోతారు, పరిస్థితుల వల్ల మీ కుటుంబం స్నేహితులకు, తెలిసిన వాళ్లకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు నిరుత్సాహపడిపోయే బదులు వాస్తవానికి అలవాటు పడడం మంచిది.—మంచి సలహా: ప్రసంగి 7:10.

భవిష్యత్తు వైపు చూడండి. గతం గురించే ఎక్కువగా ఆలోచించడం, అద్దాన్ని చూస్తూ హైవేలో కారు నడపడం లాంటిది. అప్పుడప్పుడు వెనకున్న వాటిని అద్దంలో చూడడం మంచిదే కానీ మీరు ఎక్కువగా ముందున్న రోడ్డునే చూడాలి. మార్పులు వచ్చినప్పుడు కూడా మనం చేయాల్సింది అదే. మన దృష్టి భవిష్యత్తుపైన పెట్టాలి. (సామెతలు 4:25) ఉదాహరణకు వచ్చే నెలలో లేదా రానున్న ఆరు నెలల్లో మీరు ఏ లక్ష్యం పెట్టుకోవచ్చు?

మంచి విషయాల మీదే మనసు పెట్టండి. “కోలుకునే, తట్టుకునే సామర్థ్యం మన మనస్తత్వంతో ముడిపడి ఉంటుంది. మీరు ఉన్న పరిస్థితిలో ఏ మంచి విషయాలు ఉన్నాయో ఆలోచించండి” అని లారా అనే అమ్మాయి అంటుంది.—మంచి సలహా: ప్రసంగి 6:9.

వర్ష అనే అమ్మాయి ఇలా గుర్తు చేసుకుంది, టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆమె క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అందరూ వేరే చోటుకు వెళ్లిపోయారు. ఆమె ఇలా అంటుంది “నాకు చాలా ఒంటరిగా అనిపించింది, అలా జరగకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ ఒకసారి వెనక్కి చూసుకుంటే నేను నిజంగా ఎదగడం మొదలుపెట్టింది అప్పుడే. మనం ఎదగాలంటే మార్పులు ఉండాలని నాకు అప్పుడు తెలిసింది. కొత్త స్నేహాలు చేయడానికి చుట్టూ ఉన్న అవకాశాలను నేను చూడగలిగాను.”—మంచి సలహా: సామెతలు 27:10.

గతం గురించే ఎక్కువగా ఆలోచించడం, హైవేలో అద్దాన్ని చూస్తూ కారు నడపడం లాంటిది.

సహాయపడండి. “ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని బైబిలు చెప్తుంది. (ఫిలిప్పీయులు 2:4) కాబట్టి మీకున్న సమస్యకు నిజమైన పరిష్కారం వేరే వాళ్లకు సహాయం చేయడమే. 17 సంవత్సరాల ఆనా ఇలా ఉంటుంది: “నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకీ, అంతకన్నా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్లకీ సహాయం చేయడం, నాకు చాలా మంచి చేస్తుందని పెద్ద అయ్యే కొద్దీ నేను గ్రహించాను.” ◼ (g16-E No. 4)

a ఈ ఆర్టికల్‌లో కొన్ని అసలు పేర్లు కావు.

ముఖ్యమైన మాటలు

  • “ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు.”—ప్రసంగి 7:10.

  • “మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు.”—ప్రసంగి 6:9.

  • “దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి.”—సామెతలు 27:10.

హ్వాన్‌

హ్వాన్‌

“ప్రస్తుతమున్న పరిస్థితిని బాగా విశ్లేషించి, జీవితంలో ఇది ఒక భాగమని గ్రహించినప్పుడు యవనస్థులు మార్పులను తట్టుకునే లేదా కోలుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటారు. వాస్తవానికి ఎంత త్వరగా అలవాటు పడితే జీవితం అంత బాగా సాగుతుంది. మంచి పరిస్థితులు వస్తాయి.”

కారిసా

కారిసా

“ఒక సమస్య దాటిపోయాక దాని గురించి మళ్లీమళ్లీ ఆలోచించకుండా ఉంటాను. తర్వాతి పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధమౌతాను. కోలుకునే సామర్థ్యం అంటే వెనుకున్న వాటిని చూడకుండా ముందున్న వాటిని చూడడమని నేను నమ్ముతున్నాను.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి