కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

దానియేలు విషయసూచిక

      • నెబుకద్నెజరు రాజు దేవుని పరిపాలనను గుర్తించడం (1-3)

      • చెట్టు గురించి రాజుకు వచ్చిన కల (4-18)

        • చెట్టు నరకబడి ఏడు కాలాలు అలాగే ఉండాలి (16)

        • దేవుడు మనుషుల మీద పరిపాలకుడు (17)

      • దానియేలు కల భావాన్ని చెప్పడం (19-27)

      • రాజు విషయంలో మొదటి నెరవేర్పు (28-36)

        • రాజు ఏడు కాలాలు పిచ్చివాడిలా ఉండడం (32, 33)

      • రాజు పరలోక దేవుణ్ణి ఘనపర్చడం (37)

దానియేలు 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 10:16; 90:2; యిర్మీ 10:10

దానియేలు 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:1

దానియేలు 4:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:2

దానియేలు 4:7

అధస్సూచీలు

  • *

    అంటే, సోదె, జ్యోతిష్యం చెప్పడంలో నైపుణ్యం ఉన్న గుంపు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 47:13
  • +దాని 2:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1825-1826

దానియేలు 4:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 46:1; యిర్మీ 50:2
  • +దాని 1:7
  • +దాని 4:18; 5:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 14

దానియేలు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:20; 2:48
  • +ఆది 41:38; దాని 6:3
  • +దాని 1:17, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 18

దానియేలు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:20-22
  • +దాని 4:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1997, పేజీలు 4-5

దానియేలు 4:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:23-26

దానియేలు 4:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:31; 5:18, 20

దానియేలు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:32, 33

దానియేలు 4:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 21:24
  • +దాని 4:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:34
  • +దాని 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 75

    కావలికోట (అధ్యయన),

    10/2022, పేజీలు 14-16

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

    కావలికోట,

    1/1/2015, పేజీ 9

    10/15/2005, పేజీ 27

దానియేలు 4:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 47:13; దాని 2:27; 5:8, 15

దానియేలు 4:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:7

దానియేలు 4:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

    కావలికోట,

    9/1/2007, పేజీ 18

దానియేలు 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 14:13, 14
  • +దాని 2:37, 38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:13; 8:13
  • +దాని 4:13-16; లూకా 21:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

    జ్ఞానము, పేజీలు 96-97

దానియేలు 4:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:31-33
  • +1స 2:7, 8; యోబు 34:24; యిర్మీ 27:5; యెహె 21:26, 27; దాని 2:21; 7:13, 14; లూకా 1:32, 33
  • +లూకా 21:24; ప్రక 12:6, 14
  • +దాని 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీ 3

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 21:29; యోవే 2:14; యోనా 3:8-10

దానియేలు 4:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2023, పేజీ 31

దానియేలు 4:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:25; అపొ 12:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:16
  • +కీర్త 10:16; దాని 4:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:35

అధస్సూచీలు

  • *

    లేదా “ఆయన చేతిని ఆపగలిగే వాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:9
  • +యోబు 34:24; యెష 43:13

దానియేలు 4:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

దానియేలు 4:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:2, 3
  • +ద్వితీ 32:4; కీర్త 33:5
  • +నిర్గ 18:10, 11; యాకో 4:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

దాని. 4:3కీర్త 10:16; 90:2; యిర్మీ 10:10
దాని. 4:5దాని 2:1
దాని. 4:6దాని 2:2
దాని. 4:7యెష 47:13
దాని. 4:7దాని 2:10, 11
దాని. 4:8యెష 46:1; యిర్మీ 50:2
దాని. 4:8దాని 1:7
దాని. 4:8దాని 4:18; 5:11, 12
దాని. 4:9దాని 1:20; 2:48
దాని. 4:9ఆది 41:38; దాని 6:3
దాని. 4:9దాని 1:17, 20
దాని. 4:10దాని 4:20-22
దాని. 4:10దాని 4:26
దాని. 4:13దాని 4:23-26
దాని. 4:14దాని 4:31; 5:18, 20
దాని. 4:15దాని 4:32, 33
దాని. 4:16లూకా 21:24
దాని. 4:16దాని 4:32
దాని. 4:17దాని 4:34
దాని. 4:17దాని 4:13
దాని. 4:18యెష 47:13; దాని 2:27; 5:8, 15
దాని. 4:19దాని 1:7
దాని. 4:20దాని 4:10, 11
దాని. 4:21దాని 4:12
దాని. 4:22యెష 14:13, 14
దాని. 4:22దాని 2:37, 38
దాని. 4:23దాని 4:13; 8:13
దాని. 4:23దాని 4:13-16; లూకా 21:24
దాని. 4:25దాని 4:31-33
దాని. 4:251స 2:7, 8; యోబు 34:24; యిర్మీ 27:5; యెహె 21:26, 27; దాని 2:21; 7:13, 14; లూకా 1:32, 33
దాని. 4:25లూకా 21:24; ప్రక 12:6, 14
దాని. 4:25దాని 4:16
దాని. 4:26దాని 4:15
దాని. 4:271రా 21:29; యోవే 2:14; యోనా 3:8-10
దాని. 4:31దాని 4:25; అపొ 12:22, 23
దాని. 4:32దాని 4:17
దాని. 4:33దాని 4:25
దాని. 4:34దాని 4:16
దాని. 4:34కీర్త 10:16; దాని 4:3
దాని. 4:35యెష 45:9
దాని. 4:35యోబు 34:24; యెష 43:13
దాని. 4:36దాని 4:26
దాని. 4:37దాని 4:2, 3
దాని. 4:37ద్వితీ 32:4; కీర్త 33:5
దాని. 4:37నిర్గ 18:10, 11; యాకో 4:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
దానియేలు 4:1-37

దానియేలు

4 “భూమంతటా నివసిస్తున్న అన్నిదేశాల, భాషల ప్రజలకు నెబుకద్నెజరు రాజు ఇలా చెప్తున్నాడు: మీకు ఎంతో క్షేమం కలగాలి! 2 సర్వోన్నతుడైన దేవుడు నా విషయంలో చేసిన సూచనల గురించి, అద్భుతాల గురించి మీకు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. 3 ఆయన సూచనలు ఎంత గొప్పవి! ఆయన అద్భుతాలు ఎంత అసాధారణమైనవి! ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన పరిపాలన తరతరాలు ఉంటుంది.+

4 “నెబుకద్నెజరు అనే నేను నా ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ, నా రాజభవనంలో వర్ధిల్లుతూ ఉన్నాను. 5 నాకు భయం కలిగించే ఒక కల వచ్చింది. నా పడక మీద పడుకొని ఉన్నప్పుడు నేను చూసిన రూపాలు, దర్శనాలు నాకు భయం పుట్టించాయి.+ 6 కాబట్టి ఆ కల భావాన్ని చెప్పడానికి బబులోనులోని జ్ఞానులందర్నీ నా ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.+

7 “అప్పుడు ఇంద్రజాలం చేసే పూజారులు, సోదె చెప్పేవాళ్లు, కల్దీయులు,* జ్యోతిష్యులు+ నా దగ్గరికి వచ్చారు. నాకు వచ్చిన కలను వాళ్లకు చెప్పినప్పుడు, వాళ్లు దాని భావం నాకు చెప్పలేకపోయారు.+ 8 చివరికి, నా దేవుని పేరును బట్టి+ బెల్తెషాజరు అనే పేరు పెట్టబడిన దానియేలు+ నా ముందుకు వచ్చాడు; అతనిలో పవిత్ర దేవుళ్ల శక్తి ఉంది,+ నేను ఆ కలను అతనికి ఇలా చెప్పాను:

9 “ ‘ఇంద్రజాలం చేసే పూజారుల పైన అధిపతివైన బెల్తెషాజరూ,+ నీలో పవిత్ర దేవుళ్ల శక్తి ఉందనీ,+ నువ్వు చెప్పలేని రహస్యమంటూ ఏదీ లేదనీ+ నాకు బాగా తెలుసు. కాబట్టి నేను చూసిన కల భావం ఏమిటో నాకు వివరించు.

10 “ ‘నా పడక మీద పడుకొని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాల్లో, భూమి మధ్యలో చాలా ఎత్తుగా ఉన్న ఒక చెట్టు+ నాకు కనిపించింది.+ 11 ఆ చెట్టు పెరిగి, బలంగా తయారైంది; దాని పైభాగం ఆకాశం వరకు వ్యాపించింది, భూమి నలుమూలల నుండి ఆ చెట్టు కనిపించింది. 12 దాని ఆకులు అందంగా ఉన్నాయి, దాని పండ్లు విస్తారంగా ఉన్నాయి, ఆ చెట్టు మీద సమస్త ప్రాణులకు సరిపడా ఆహారం ఉంది. మైదానంలోని జంతువులు నీడ కోసం ఆ చెట్టు కిందికి వస్తున్నాయి, ఆకాశపక్షులు దాని కొమ్మల మీద నివసిస్తున్నాయి, దాని పండ్లను సమస్త ప్రాణులు తింటున్నాయి.

13 “ ‘నా పడక మీద పడుకొని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాల్లో, ఒక కావలివాడు అంటే ఒక పవిత్రుడు పరలోకం నుండి కిందికి దిగిరావడం నేను చూశాను.+ 14 అతను బిగ్గరగా ఇలా చెప్పాడు: “చెట్టును నరకండి,+ దాని కొమ్మల్ని నరికేయండి, దాని ఆకుల్ని తీసేయండి, దాని పండ్లను చెల్లాచెదురు చేయండి! దానికింద నుండి జంతువులు, దాని కొమ్మల మీద నుండి పక్షులు పారిపోవాలి. 15 అయితే దాని మొద్దును వేళ్లతో సహా పొలంలోని గడ్డి మధ్య భూమిలో ఉండిపోనివ్వండి, ఆ మొద్దుకు ఇనుముతో, రాగితో కట్టు కట్టండి. అది ఆకాశ మంచుకు తడుస్తూ, భూమ్మీది పచ్చిక మధ్య జంతువులతో పాటు ఉండాలి.+ 16 దాని హృదయం మనిషి హృదయంలా కాకుండా జంతువు హృదయంలా మారిపోవాలి; అలా ఏడు కాలాలు+ గడవాలి.+ 17 మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడనీ,+ ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాడనీ, మనుషుల్లో అతి తక్కువవాడికి కూడా దాన్ని ఇస్తాడనీ జీవిస్తున్న ప్రజలు తెలుసుకునేలా కావలివాళ్లు+ ఈ సందేశాన్ని ప్రకటించారు, పవిత్రులు ఈ తీర్పును చాటించారు.”

18 “ ‘నెబుకద్నెజరు రాజునైన నాకు వచ్చిన కల ఇదే; బెల్తెషాజరూ, ఇప్పుడు దాని భావం నాకు చెప్పు, నా రాజ్యంలోని మిగతా జ్ఞానులెవ్వరూ దాని భావం నాకు చెప్పలేకపోయారు.+ కానీ నీలో పవిత్ర దేవుళ్ల శక్తి ఉంది కాబట్టి నువ్వు చెప్పగలవు.’

19 “అప్పుడు బెల్తెషాజరు అనే పేరుగల దానియేలుకు+ ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు. అతని ఆలోచనలు అతన్ని భయపెట్టడం మొదలుపెట్టాయి.

“అయితే రాజు, ‘బెల్తెషాజరూ, కల గురించి గానీ, దాని భావం గురించి గానీ భయపడకు’ అన్నాడు.

“అప్పుడు బెల్తెషాజరు ఇలా చెప్పాడు, ‘నా ప్రభూ, ఆ కల నిన్ను ద్వేషించేవాళ్లకు, దాని భావం నీ శత్రువులకు వర్తించాలి.

20 “ ‘నువ్వు ఒక చెట్టును చూశావు, అది పెద్దగా పెరిగి, బలంగా తయారైంది; దాని పైభాగం ఆకాశం వరకు వ్యాపించి, భూమంతటికీ కనిపించింది,+ 21 దాని ఆకులు అందంగా ఉన్నాయి, దాని పండ్లు విస్తారంగా ఉన్నాయి, దాని మీద సమస్త ప్రాణులకు సరిపడా ఆహారం ఉంది, మైదానంలోని జంతువులు దాని కింద నివసిస్తున్నాయి, దాని కొమ్మల మీద ఆకాశపక్షులు నివసిస్తున్నాయి;+ 22 రాజా, ఆ చెట్టు నువ్వే, ఎందుకంటే నువ్వు గొప్పవాడివి అయ్యావు, బలంగా తయారయ్యావు; నీ వైభవం వృద్ధి చెంది ఆకాశం వరకు చేరుకుంది,+ నీ పరిపాలన భూమి నలుమూలలకు విస్తరించింది.+

23 “ ‘ఒక కావలివాడు, అంటే ఒక పవిత్రుడు+ పరలోకం నుండి కిందికి దిగి రావడం, అతను ఇలా చెప్పడం రాజువైన నువ్వు చూశావు: “చెట్టును నరికి, దాన్ని నాశనం చేయండి, కానీ దాని మొద్దును వేళ్లతో సహా పొలంలోని గడ్డి మధ్య భూమిలో ఉండిపోనివ్వండి, ఆ మొద్దుకు ఇనుముతో, రాగితో కట్టు కట్టండి. దాన్ని ఆకాశ మంచుకు తడవనివ్వండి; ఏడు కాలాలు గడిచేవరకు దాన్ని మైదానంలోని జంతువులతో పాటు ఉండనివ్వండి.”+ 24 రాజా, దాని భావం ఇదే; నా ప్రభువైన రాజు విషయంలో జరగాలని సర్వోన్నతుడు చేసిన శాసనం ఇది. 25 నువ్వు మనుషుల మధ్య నుండి దూరంగా వెళ్లగొట్టబడతావు, నువ్వు మైదానంలోని జంతువులతో పాటు నివసిస్తూ, ఎద్దులా గడ్డి తింటావు; నువ్వు ఆకాశ మంచులో తడుస్తావు;+ మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడనీ, ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాడనీ+ నువ్వు తెలుసుకునే వరకు ఏడు కాలాలు+ నీకు అలా జరుగుతుంది.+

26 “ ‘కానీ చెట్టు మొద్దును వేళ్లతో సహా వదిలేయమని వాళ్లు చెప్పారు కాబట్టి,+ పరలోక దేవుడు పరిపాలిస్తున్నాడని నువ్వు తెలుసుకున్న తర్వాత నీ రాజ్యం మళ్లీ నీకు వస్తుంది. 27 కాబట్టి రాజా, దయచేసి నా సలహా పాటించు. నీ పాపాల్ని విడిచిపెట్టి సరైనది చేయి, నీ అపరాధాల్ని విడిచిపెట్టి పేదవాళ్ల మీద కరుణ చూపించు. అలాచేస్తే నువ్వు ఇకమీదట కూడా వర్ధిల్లుతూనే ఉంటావేమో.’ ”+

28 ఇదంతా నెబుకద్నెజరు రాజుకు జరిగింది.

29 పన్నెండు నెలల తర్వాత అతను బబులోనులోని తన రాజభవనం మిద్దె మీద నడుస్తున్నాడు. 30 అప్పుడు రాజు, “ఈ మహా బబులోను నేను నా ఘనతావైభవాల్ని చూపించడం కోసం నా సొంత శక్తితో, బలంతో రాజధానిగా కట్టించుకున్న నగరం కాదా?” అన్నాడు.

31 ఆ మాటలు రాజు నోట ఉండగానే, పరలోకం నుండి ఒక స్వరం వచ్చి ఇలా చెప్పింది: “నెబుకద్నెజరు రాజా, నీకు చెప్పేదేమిటంటే, ‘రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది,+ 32 నువ్వు మనుషులకు దూరంగా వెళ్లగొట్టబడతావు. నువ్వు మైదానంలోని జంతువులతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి తింటావు; మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడనీ, ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాడనీ నువ్వు తెలుసుకునే వరకు ఏడు కాలాలు నీకు ఇలా జరుగుతుంది.’ ”+

33 ఆ మాట ఆ క్షణంలోనే నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. అతను మనుషుల మధ్య నుండి వెళ్లగొట్టబడ్డాడు, అతను ఎద్దులా గడ్డి తినడం మొదలుపెట్టాడు, అతని శరీరం ఆకాశ మంచుకు తడిసింది, అతని వెంట్రుకలు గద్ద ఈకల్లా పొడుగ్గా పెరిగాయి, అతని గోళ్లు పక్షి గోళ్లలా అయ్యాయి.+

34 “ఆ కాలం ముగిసిన తర్వాత,+ నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు చూశాను, నాకు మళ్లీ తెలివి వచ్చింది; అప్పుడు నేను సర్వోన్నతుణ్ణి స్తుతించాను, శాశ్వతకాలం జీవించే దేవుణ్ణి స్తుతించి మహిమపర్చాను; ఎందుకంటే ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, ఆయన రాజ్యం తరతరాలు ఉంటుంది.+ 35 ఆయనతో పోలిస్తే భూనివాసులందరూ అస్సలు లెక్కలోకి రారు; ఆకాశ సైన్యం విషయంలో, భూనివాసుల విషయంలో ఆయన తన ఇష్టప్రకారం చేస్తాడు. ఆయన్ని ఆపగలిగే వాళ్లు* గానీ ‘నువ్వు ఏం చేస్తున్నావు?’ అని ఆయన్ని అడగగలిగే వాళ్లు+ గానీ ఎవ్వరూ లేరు.+

36 “అప్పుడు నాకు మళ్లీ తెలివి వచ్చింది; నా రాజ్య మహిమ, నా ఘనత, నా వైభవం నాకు తిరిగొచ్చాయి.+ నా ఉన్నతాధికారులు, ప్రముఖులు నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు; నేను మళ్లీ నా రాజ్యాన్ని పొందాను, ఇంకా గొప్పవాణ్ణి అయ్యాను.

37 “నెబుకద్నెజరు అనే నేను ఇప్పుడు పరలోక రాజును స్తుతిస్తూ, మహిమపరుస్తున్నాను;+ ఎందుకంటే ఆయన పనులన్నీ సత్యమైనవి, ఆయన మార్గాలు న్యాయమైనవి;+ అంతేకాదు, గర్వంగా ప్రవర్తించేవాళ్లను ఆయన అవమానపర్చగలడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి