కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/90 పేజీ 4
  • ప్రశ్నాభాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగము
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • మర్యాద—దైవభక్తి గల ప్రజలకుండే ఒక విశిష్ట లక్షణం
    మన రాజ్య పరిచర్య—2001
  • దేవుని పరిచారకులమైన మనం మర్యాదగా నడుచుకుందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీ గృహాన్ని అందుబాటులో ఉంచగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
  • మర్యాదగా ప్రవర్తించడం నిజంగా అవసరమా?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 3/90 పేజీ 4

ప్రశ్నాభాగము

• సంఘ పుస్తకపఠనమునకు హాజరైనప్పుడు మనమెట్లు క్రైస్తవ మర్యాదలను ప్రదర్శించగలము?

సాధారణముగా మన పొరుగువారు మనలను గమనించుచుండుటయేగాక కొన్నిసార్లు మనలను గూర్చి వ్యాఖ్యానించటము, మన ప్రవర్తననుబట్టి ప్రతిస్పందించటము జరుగును. (1 కొరిం. 4:9 ని పోల్చుము) యెహోవా సేవకులుగా మన నడవడినిగూర్చిన వారి వ్యాఖ్యానము మరియు ప్రతిస్పందన అనుకూలమైనదిగా ఉండవలెనని కోరుదము. (1 పేతు. 2:12) సంఘపుస్తకపఠన సంబంధముగా మనము మెలగు విషయములోను ఇది సత్యమైయున్నది. వీటిలో ఎక్కువభాగము వ్యక్తిగత గృహములలో జరుగును గనుక, మనము చేయు ప్రతికార్యమందును మన మర్యాదలు బాగుగా ప్రతిబింబించులాగున ప్రత్యేక జాగ్రత్త వహించవలసియున్నాము. మనము పుస్తకపఠనము జరుపుకొనువారి పొరుగు ప్రాంతమందు వాహనములు నిలుపుకొనుస్థలము తక్కువగాయుండును గనుక పొరుగువారియెడలగల మన ప్రేమ మన వాహనమును వారికి ఇబ్బంది, లేక బాధ కలిగించురీతిగా పెట్టకుండునట్లు మనలను నిలుపుచేయును.

మనము కలుసుకొన్నప్పుడు ఆనందిస్తాము. గనుక తరచుగా కూటముల ముందు లేక తరువాత మాట్లాడుకొనటం జరుగుతుంది. (మీకా 2:12) ఆ సమయములో మంచి మర్యాదలు, ఇతరులను గూర్చిన ఆలోచన మనము మాట్లాడుకునే శబ్దము తగుమాత్రపురీతిలో యుండునట్లు మనలను తప్పక నడిపించును. (మత్త. 7:12; గల. 6:10) క్రైస్తవప్రేమ మన పిల్లలు బయట పరుగెత్తకుండా ఆపుటకును, ఇతరుల వస్తువులను పాడుచేయకుండునట్లు చూచుటకు మనలను బలవంతపెట్టును. (సామె. 29:15; 1 కొరిం. 13:4, 5) దీనిలో పుస్తకపఠనము జరుగు గృహములో గౌరవనీయమైన ప్రవర్తనతో మెలగుటయు యిమిడియున్నది. ఏమైన అసభ్యకర ప్రవర్తనను గమనించినప్పుడు, అది పొరుగువారి ఫిర్యాదులకు కారణమై, అతిథ్యముతో పుస్తకపఠనము కొరకై గృహమును తెరచిన యింటివారికి కష్టము లేక ఆ పుస్తకపఠన ప్రాంతములో హాజరగువారికి ఇబ్బందియు కలుగకుండునట్లు ప్రేమగల మరియు గట్టిసలహాను యిచ్చుటకు పెద్దలు ఆలస్యము చేయకూడదు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి