దైవపరిపాలనా వార్తలు
◆ అక్టోబరు మాసములో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 51,152 మంది ప్రచారకులను రిపోర్టు చేయుటకు ఆస్ట్రేలియా సంతోషించినది. గత సంవత్సరపు అదే నెలపైన ఇది 5.3—శాతము అభివృద్ధి.
◆ హాంగ్‌కాంగ్ క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 2,032 ప్రచారకులను అక్టోబరుకు రిపోర్టు చేసినది. సబ్‌స్క్రిప్ష్‌న్ కాంపైన్‌లో సేకరించిన 4,511 చందాలు సబ్‌స్క్రిప్ష్‌న్ కాంపైన్‌లో ఎప్పుడు సేకరించబడలేదు. క్రితము ఒక నెలలో సంపాదించినవాటికి అవి రెట్టింపు.
◆ జమైకా అక్టోబరులో 8,701 ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యను రిపోర్టు చేసినది.
◆ అక్టోబరులో నైజీరియా 1,39,150 మంది ప్రచారకులను క్రొత్త సేవా సంవత్సరములో రెండవ శిఖరాగ్ర సంఖ్యగా రిపోర్టు చేసినది. మరియు క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలుగా 9,244 మంది రెగ్యులర్ పయినీర్‌లను 1,83,701 బైబిలు పఠనములను రిపోర్టు చేసినది.
◆ సాలమన్ ఐలాండ్స్‌లోని జిల్లా సమావేశములకు 2,339 హాజరుకాగా 37 మంది బాప్తిస్మము పొందిరి. పబ్లిషర్ల శిఖరాగ్ర సంఖ్య 777.
◆ తైవాన్ అక్టోబరు సేవలో 7—శాతము అభివృద్ధితో 1,594 మందిని రిపోర్టు చేసినది. వీటిలో రెగ్యులర్ మరియు ఆక్సిలర్ పయినీర్ల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలు యున్నవి. గంటలు, పునర్దర్శనములు, సబ్‌స్క్రిప్ష్‌న్‌లు, పత్రికలు అన్నియు శిఖరాగ్ర సంఖ్యలే. సంఘప్రచారకులు సగటున 12.2 గంటలను కలిగియున్నారు. ఇదియు క్రొత్త శిఖరాగ్ర సంఖ్యయే.