ఇండెక్స్ నుండి లభించు సహాయముతో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట
1 సమర్పించుకొన్న క్రైస్తవులుగా మన పరిచర్యను మనఃపూర్వకముగా నెరవేర్చుటకు మనము ప్రయత్నింతుము. దీని చేయునట్లు మనకు సహాయపడుటకై విలువైన ప్రచురణలుగల గొప్ప గ్రంథాలయమునందు విస్తారమైన మార్గదర్శకత్వమును మరియు ప్రోత్సాహమును యెహోవా దయచేసియున్నాడు. వాటిని మనము శ్రేష్టముగా ఉపయోగించుకొనగలమా? దీనిని చేయుటకు ప్రాథమిక సహాయము 1961 నుండి వివిధ భాషలలో ఎడతెగక ప్రచురించబడుచున్న వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్.
2 మీ పరిచర్యను నెరవేర్చుటకు ఇండెక్స్ మీకెట్లు సహాయపడగలదు? అత్యుత్తమమైన ఉపదేశము మరియు అప్పటికే అందించబడిన వివరణలవైపు మళ్లించుటద్వారా అది అట్లు చేయగలదు. ఇండెక్స్ ప్రపంచవ్యాప్తమైన సహోదరత్వమును మనస్సునందుంచుకొని తయారుచేయబడినది. పిల్లల దగ్గర నుండి తాతలవరకు, నూతన బైబిలు విద్యార్థులనుండి పెద్దల వరకు ప్రయోజనకరమైన ఏ ఉద్దేశ్యమునకైనను అవసరమైన సంబంధిత విషయములను అందరు కనుగొనవచ్చును.
నీకు అవసరమైన దానిని కనుగొనుట ఎట్లు
3 వరుసగాయున్న వచనములు లేక ప్రత్యేకముగా యున్న వచనముయొక్క అర్థమును తెలుసుకొనవలెనని నీవు ఆసక్తితో వుంటే వెనుకవైపున ఉన్న లేఖన ఇండెక్స్‌కు త్రిప్పుట మొదట శ్రేష్టముగా ఉండును. త్రిత్వ సిద్ధాంతమును రుజువు పరచుటకై యోహాను 10:30ని ఎవరైన సూచించారా? యేసుక్రీస్తు ఆ మాటలు ఎందుకు చెప్పాడో స్పష్టముచేయు సమాచారము యొద్దకు లేఖన ఇండెక్స్ నిన్ను నడిపించును. మనకు కలతగా, అగోచరముగా ఉన్న లేఖనముల వివరణలను చూచుకొలది మన వ్యక్తిగత బైబిలు పఠనమును ఈ లేఖన ఇండెక్స్ దీవెనకరముగా చేయును.
4 విషయాంశములపై నున్న ఇండెక్స్ ప్రయోజనకరమైన ఒకే సమాచారమునకు విభిన్న మార్గములను చూపించును. ఉదాహరణకు నీ పిల్లలను నీవు కూటములకు తీసుకు వెళ్తున్నందుకు అవిశ్వాసియైన జత అభ్యంతరము తెలుపుతుంటే ఏమి చేయాలి అను సమాచారము నీకు అవసరమైయుండవచ్చును. దానికి సమాధానమును కనుగొనుటకు “భర్తలు,” “భార్యలు,” “పిల్లలు,” “వ్యతిరేకత,” లేక “కూటములు” మొదలగు శీర్షికలకు నీవు త్రిప్పవచ్చును. ఏ అంశమునకైనను నీవు వెదకుచున్నది మొదటి శీర్షిక క్రింద కనపడకపోయినట్లయిన మరొక దానిలో ప్రయత్నించుము. నీకై నీవు ఇట్లడుగుకొనుము. ‘ఎవరు ఇమిడియున్నారు? ప్రత్యేకమైన స్థలము ప్రాముఖ్యమైన భావోద్రేకమా? ఒక గురియా? నీకు సరియైన దానిగా కనిపించిన ముఖ్య శీర్షికను నీవు కనుగొనిన నేరుగా దాని క్రిందనున్న సంబంధిత ఇతర విషయముల పేర్లను పరిశీలించుము. తరచు మరెక్కువ సూటియైన శీర్షికను గుర్తించుట ద్వారా ఇది సమయమును కాపాడును.
5 ఇండ్క్స్ను ఉపయోగించుటలో నైపుణ్యమనునది మన పరిశుద్ధ బాధ్యతలను నెరవేర్చుటయందు విజయము పొందుటలో ఎంతగానో దోహదపడగలదు. ఈ సాధనమును ఎంతో నైపుణ్యముగా వాడుటకు తయారగుకొలది మన కుటుంబములు, మన బైబిలు విద్యార్థులు, మన సంఘములు ప్రయోజనమును పొందును. మన రాజ్య పరిచర్యను నెరవేర్చుటలో వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ ఎట్లు మిగుల విలువగలదై యుండగలదో తెలుపు ప్రత్యేక రంగాలను రాబోవు మన రాజ్య పరిచర్య సంచికలు తెలియజేయును.