సువార్తనందించుట—కర పత్రములతో
1 “నాకు ఒక బైబిలు కరపత్రమును ఇచ్చిన స్త్రీని దాటి వెళ్లితిని,” అని ఒక వ్యక్తి సొసైటికి వ్రాశాడు. దానిపై ‘లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్’ అని వుంది. దానిని చదవకముందు ఎంతో క్రుంగినవాడనైయుంటిని. అయితే దానిని చదివిన తరువాత సమాధానముతో ఎంతో ధైర్యముగల వాడనైతిని.” ఆ మనుష్యుడు ఇంకా ఎక్కువ సమాచారమును కోరి, ఈ విధంగా వ్రాశాడు: “నేను మీ యొద్దనుండి ‘యు కేన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్’ పుస్తకమును పొందాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను.”
2 నిజముగా ఈనాడు యెహోవాను స్తుతించు అనేకులు తమ ఆత్మీయదాహమును కరపత్రముల వలన తీర్చుకొనిరి. మీరు మీ పరిచర్యలో కరపత్రములను ఉపయోగిస్తున్నారా? అనేకమంది అలా చేస్తున్నారు. ఒక్క బ్రూక్లిన్‌లోనే 12 కోట్ల 20 లక్షల కంటె ఎక్కువగా పీస్‌పుల్ న్యూవరల్డ్ కరపత్రములు, అలాగే దాదాపు 25 కోట్ల బైబిలును ఎందుకు నమ్మవలెను? వాట్ డు జెహోవాస్ విట్‌నెస్ బిలీవ్? మరియు వాట్ హోప్ ఫర్ డెడ్ లవ్డ్ వన్స్? అను కరపత్రములు ముద్రించబడినవి.
3 ఈ క్లుప్తమైన వర్తమానములలో వివరించబడిన దేవుని వాక్యపు శక్తిని మనమెన్నటికిని తక్కువ అంచనా వేయకూడదు. (హెబ్రీ. 4:12; జెకర్యా 4:10; యాకోబు 3:4, 5 ను పోల్చుము.) ఒక సాక్షి ఇలా వ్రాశాడు: “నేను వాచ్‌టవర్ సొసైటియొక్క అనేక కరపత్రములు చదివి, క్రమక్రమముగా సత్యమును నేర్చుకొన్నాను.” ఇంకను ఆయన వివరించినదేమనగా: “వేగముగా పరుగెత్తు ఈ లోకములో చదువుటకు తరచు ప్రజలు ఎక్కువ సమయమును తీసుకొనరు. కాని కరపత్రములు ఒక ప్రాముఖ్యమైన సమాచారమును కలిగియుండుటకు సరిపడునంతవి. అలాగే వాటిని చూడకముందే తీసి పారవేయునంత పెద్దవి కావు.”
4 అనేక కారణములవలన ప్రజలు తరచు మననుండి సాహిత్యములను తీసుకొనుటకు వెనుకాడుదురు. అయితే అనేకమంది ఒక కరపత్రమును తీసుకొనుటకు సులభంగా అంగీకరింతురు. ఒక ప్రాంతీయకాపరి కరపత్రములను పెట్టుకొనిన ఒక చిన్న ప్లాస్టిక్ హోల్డరును కలిగియుండి ఇంటివారికి ఇష్టమైన కరపత్రమును తీసుకొననిస్తానని వివరిస్తున్నాడు. “ఎక్కువగా కోరుకొనిన మొదటి కరపత్రము” “వాట్ జెహోవాస్ విట్‌నెసెస్ బిలీవ్” అనునదని ఆయన వివరించుచున్నాడు.
మొదటిసారి కలిసినప్పుడు
5 సంభాషణను ప్రారంభించుటకు కరపత్రమును ఇచ్చుట ఒక ఫలవంతమైన మార్గముగా కొంతమంది ప్రచారకులు కనుగొనుచున్నారు. ఒక కరపత్రమును అందించుట ద్వారా తలుపు తీయుటకు వెనుకాడు ఇంటివారు తెరచుటకు ప్రేరేపింపబడవచ్చును.
6 ఇంటివారు ఒకవేళ పనితొందర లేక వ్యాకులతతో యున్నట్లయిన కేవలము ఒక కరపత్రమే అవసరమైనదైయుండును. మృతుల నిరీక్షణను గూర్చి తెలుపు ఒక కరపత్రము ద్వారా ఒక స్త్రీ ఎంతో ఆదరింపబడినదై ఎక్కువ సమాచారము కొరకు సొసైటికి వ్రాసెను. ఇంటిలో ఎవరులేనప్పుడు ఇంటివారి కొరకై ఒక కరపత్రమును బయట నడచువారికి కనిపించకుండునట్లు ఇంటివద్ద వదలిపెట్టవచ్చును.
పునర్దర్శనములందు
7 గతములో కొంత ఆసక్తిని చూపిన చోటికి వెళ్లినప్పుడు ఒకరు ఇలా చెప్పవచ్చును: “హాలో, [పేరు చెప్పి] మీరు ఇంటి యొద్ద ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మనము మొదటిసారి కలిసినప్పుడు మీరు బైబిలునుగూర్చి మాట్లాడుటకు సమయాన్ని తీసుకోవటం నన్నెంతో ముగ్ధున్ని చేసింది. మీకు బహుశా ఆసక్తి కలిగిస్తుందనుకుంటున్న ఇంకొక సమాచారము ఉన్నది. అది ఈ కరపత్రములో ఉన్నది. ఇది లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూవరల్డ్. మీకు జ్ఞాపకమున్నట్లయిన ముందుసారి మానవజాతికి నిజమైన మరియు చిరకాల సమాధానమును గూర్చిన బైబిలు వాగ్దానమును మనము మాట్లాడుకున్నాము. అయినను అనేకులు ఈ వాగ్దానములను చదివినప్పుడు పరలోకమునుగూర్చే తలస్తారు గనుక కీర్తన 37:29 ఈ ఆశీర్వాదములు భూమిపైనే జరుగునని తెలుపుదానిని గమనించండి. [కరపత్రములో అది ఎక్కుడున్నదో చూపిస్తు లేఖనమును చదువుము.] అది ఆసక్తిదాయకంగా లేదా? [అనేక పేరాగ్రాఫ్‌లను చర్చించుము] ఈ కరపత్రములో ప్రోత్సాహకరమైన అనేక లేఖనములున్నవి. అవన్నియు అలాగే ఆనందాన్ని కలిగించునవిగా మీరు చూస్తారు. బహుశా ఈసారి నేను వచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని ఈరోజు చదివినట్లుగానే చదువుదాము.”
8 నిజముగా మన కరపత్రములను యెహోవా నుండి వచ్చిన వరములు. ఆయన స్తుతికి, మన నిత్య ఆశీర్వాదములకొరకు ఫలవంతమైన పరిచర్యను చేయుచుండగా విలువకరమైన ఈ సహాయమును నేర్పుగా ఉపయోగింతుము గాక.—సామె. 22:29.