వాచ్‌టవర్ చందా ప్రత్యేక కార్యముకొరకు సిద్ధపడియుండుడి
ఏప్రిల్ మరియు మే మాసములో జరుగు వాచ్‌టవర్ చందా ఉన్నత కార్యముకొరకు ఎదురుచూస్తు, ప్రత్యేక ఆసక్తిగల ది వాచ్‌టవర్ మరియు అవేక్! సంచికలను సొసైటి తయారుచేయుచున్నది. అందలి శీర్షికలు అన్ని ప్రాంతముల ప్రజల మనస్సులలో ఉండు వివిధ ముఖ్యమైన అంశములను కలిగియుండును.
ది వాచ్‌టవర్ ఈ క్రింది అంశములను చర్చించును: “అది మీరు అనుకొనుదానికంటె ఆలస్యమా?” (ఏప్రిల్ 1), “శాంతి నిజముగా ఎప్పుడు వచ్చును?” (ఏప్రిల్ 15), “అరాచకమైన లోకములో నేరమును ఎదుర్కొనుట” (మే 1), “మీ కుటుంబ జీవితములో దేవుని ముందుంచుము!” అవేక్ సంచికలు ఈ క్రింది అంశములను కలిగియుండును: “మానవుడు మరియు మృగము సమాధానముతో జీవించునప్పుడు” (ఏప్రిల్ 8), “విడాకులు పొందినవారి పిల్లలకు సహాయము” (ఏప్రిల్ 22), “లాటరీ జ్వరము—గెలుచునదెవరు? ఓడునదెవరు?” (మే 8), “దూరదర్శిని—లోకమును మార్చిన పెట్టె” (మే 22), ప్రాంతీయభాష వాచ్‌టవర్: “ఆనందభరితమైన జనాంగము” (ఏప్రిల్ 1), “శాంతి—నిరాయుధీకరణ వలన వచ్చునా?” (మే 1), “పేరాశలేని లోకము—సాధ్యమేనా” (జూన్ 1), ప్రాంతీయభాష అవేక్!: “ఇల్లులేని పిల్లలకు—పరిష్కారమున్నదా?” (ఏప్రిల్ 8), “తుపాకులు లేని లోకము—సాధ్యమేనా?” (మే 8).
ప్రచారకులందరు, ప్రత్యేకముగా పయినీర్లు విడి పత్రికలను అందించుట, చందాలను సేకరించుటలో ఎక్కువగా చేయుటకు తమతమ వ్యక్తిగత అవసరతలను పరిశీలించుకొనవలెను. వాచ్‌టవర్ కాంపైన్ ప్రథమము నుండి కూడా కావలసినన్ని పత్రికలుండులాగున తగినంత సమయమునకు ముందే మీకు అదనముగా కావలసిన పత్రికలను అడగండి.