ఇతరులయందు వ్యక్తిగత శ్రద్ధను చూపుట
1 ఇతరులయెడల యెహోవా కలిగియున్న శ్రద్ధ విస్తారముగా తేటతెల్లమయ్యింది. తన సృష్టియంతటికి కావలసిన భౌతిక అవసరతలను ఆయనే ఉదారంగా అందించలేదా? (ఆది. 1:29, 30; 2:16, 17; మత్త. 5:45; మరియు లూకా 6:35ను పోల్చుము.) అతి ముఖ్యముగా మనలను పాపమరణములనుండి విడిపించుటకు ఏర్పాటు చేసి మనయందు వ్యక్తిగత శ్రద్ధను చూపలేదా?—యోహా. 3:16.
2 యేసు భూమిపై ఉన్నప్పుడు, ఇతరులయెడల వ్యక్తిగత శ్రద్ధను చూపిన తన తండ్రి యొక్క సంపూర్ణ మాదిరిని ఆయన అనుసరించెను. (మత్త. 11:28-30; 1 పేతు. 2:21) కుష్టరోగముతో ఉన్న వ్యక్తి “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని” యేసును అడుగగా, “నా కిష్టమే” అని యేసు ప్రత్యుత్తరమిచ్చి అతని స్వస్థపరచెను. (మత్త. 8:2, 3) నాయీనను పట్టణమును సమీపించినప్పుడు, ఒక విధవరాలైన తల్లికి ఒక్కడే కుమారుడగు యౌవనుడు చనిపోయి మోసికొని పోబడుచుండగా యేసు వారిని, ఎదుర్కొని, జాలిపడి, యేసు అతనిని లేపెను. (లూకా 7:11-15) అడుగకుండానే, యేసు ఇతరులయందు వ్యక్తిగత శ్రద్ధను చూపెను. తన సమయము, అవధానమునకు చిన్నపిల్లలుకూడ యోగ్యులని దృష్టించబడిరి. ఇతరులను ఓదార్చుటకు, ప్రోత్సహించుటకు తానెన్నడు తీరిక లేనివాడుగా ఆయన ఉండలేదు.—మత్త. 20:31-34; మార్కు 10:13-16.
కుటుంబము మరియు స్నేహితులు
3 ఇతరులయెడల వ్యక్తిగత శ్రద్ధను చూపు మార్గములను అన్వేషించుటకు యెహోవా మరియు యేసుక్రీస్తువలె మనము కృషిసల్పవలయును. గనుక, దానిని చేయుటకుగల కొన్ని అవకాశములను మనము పరిశీలించుదాము.
4 సహోదరులకున్న ఒకానొక గొప్ప ఆవశ్యకత ఏమనగా తమ స్వంత కుటుంబ సభ్యులయెడల నిజమైన వ్యక్తిగత శ్రద్ధను తీసికొనుట, మరియు కుటుంబ ఆత్మీయతను నిర్లక్ష్యము చేయకుండుట, అందులో కుటుంబముతో క్రమముగా పఠించుట ఇమిడియున్నది. మీ కుటుంబ పఠనములో ఆసక్తికరముగా మరియు ఆచరణాత్మక విలువగలదిగా ఉండునట్లు మీరు పరిశీలనాంశమును పరిగణించారా? మీ ఇంటిలోనున్న ప్రతి సభ్యునితో ప్రాంతీయసేవలో క్రమముగా కలిసి పనిచేయులాగున చూచుకొనుచున్నారా? మీరు అలా చేయుచున్నప్పుడు, అది సంతోషదాయక సమయముగా ఉన్నదా? ఇతరులకు సహాయము చేయు కోరికను మీరు మీ పిల్లలలో వృద్ధిచేసి, తద్వారా వారు పొరుగువారియెడల క్రైస్తవప్రేమను చూపునట్లు చేయుచున్నారా? వివాహితులై, ఇంటిలో పిల్లలు లేకపోయినకూడా మీరు కుటుంబ పఠనమును కలిగియున్నారా?
5 మనము చేయుదగు ప్రతివానికి, ఆత్మీయ సహాయమును అందించగోరుచున్నాము. అయితే పనిరద్దీ కలిగియున్న మన జీవితములలో ప్రత్యేక అవసరతలున్న సంఘమందలి సభ్యులయందు వ్యక్తిగత శ్రద్ధను చూపుటను మనము మరచుచున్నామా? (సామె. 3:27; గలతీ. 6:10) క్రైస్తవ సంఘమందు తండ్రిలేని పిల్లలు, వృద్ధులు, విధవరాండ్రు, రోగులు, కృంగినవారు, వికలాంగులు, ప్రత్యేక అవసరతలుగల ఇతరులు ఉందురు. యెహోవా మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుకరించి, మన సహోదర సహోదరీలందరియెడల వ్యక్తిగత శ్రద్ధను చూపుటలో మనము నిర్లక్ష్యము చేయకూడదు.—1 కొరిం. 10:24; ఫిలి. 2:4; హెబ్రీ. 13:15.
క్షేత్రమందు గొర్రెలను పోలినవారు
6 గృహబైబిలు పఠనములను కలిగియున్న ప్రజలయెడల మనమెలా వ్యక్తిగత శ్రద్ధను చూపగలము? లోక పరిచయస్థులతో సహవాసమును తెంచుకొనవలసిన అగత్యతను వీరిలో అనేకులు గమనించారు. మనము పని తొందర కలిగియున్నను, అట్టి విద్యార్థులయెడల వ్యక్తిగత శ్రద్ధను చూపి, మార్పులు చేసికొన్న వారిని మన క్రొత్త స్నేహితులుగా ఆహ్వానించుచున్నామా? వారితో మనము పఠనము చేయకపోయినను వారిని ప్రోత్సహించేవారిగా మనమున్నామా?—మార్కు 10:28-30 పోల్చుము.
7 సువార్తను వినుటకు ఇష్టపడువారియెడల యథార్థమైన వ్యక్తిగత శ్రద్ధను చూపుటలో మీరు అత్యధిక భాగము వహించుచున్నారా? వారి ఆత్మీయ అవసరతలను తీర్చుకొనుటకు వారికి సహాయము చేయుటలో మీరు కృషిసల్పుచున్నారా? వ్యక్తిగతముగా, ప్రాంతీయసేవలో అధిక భాగము వహించుటకు మీరేమి చేయగలరు? మరి ఎక్కువ భాగము వహించగల స్థానమందు మీరున్నట్లయితే వెనుకంజవేయకుము.—లూకా 9:60-62.
8 ఇతరులయందు వ్యక్తిగత శ్రద్ధను కనపర్చుటలో యెహోవాను మరియు యేసును మనము అనుకరించవలెను. కుష్ఠరోగముతోవున్న మనుష్యుని విషయములో యేసు చేసియున్నట్లు, మనము కనికరముతో సహాయము చేయవలెను. అవును, ఇతరులయెడల వ్యక్తిగత శ్రద్ధను చూపు మార్గములకొరకు మనము అన్నివేళల కనిపెట్టుకొనియుండవలెను.