శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
జూలై 8తో ఆరంభమగు వారము
పాట 202 (18)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు.
20 ని: “శాంతి మరియు భద్రత—ఒక నిశ్చయమైన నిరీక్షణ” మొదటి ఐదు పేరాలనుండి పెద్ద 12 నిమిషముల ప్రసంగము నిచ్చును. పిదప 6-8 పేరాలను ప్రేక్షకులతో చర్చించును. 7వ పేరానందు ట్రూపీస్ పుస్తకము నుండి సలహా ఇవ్వబడిన మాట్లాడదగు అంశములను ఇంటివారితో ఎలా ఉపయోగించవచ్చునో నిపుణతగల ప్రచారకుని ప్రదర్శించనీయుము.
15 ని: “వర్షాకాలములో అత్యంత దైవిక పరిపాలన ప్రయోజనమును పొందుట.” ప్రసంగము మరియు ఒక కుటుంబ చర్చ.
(3ని.) అధ్యక్షుడు మొదట రెండు పేరాలను చర్చించి, కుటుంబ చర్చను పరిచయము చేయును. వర్షాకాలమందు కుటుంబ ఆత్మీయతను నిర్లక్ష్యము చేయకూడదు. అన్ని కాలములందు ఆత్మీయ అవసరతలందు లక్ష్యముంచునట్లు కుటుంబ పెద్దలు నిశ్చయపరచుకొనవలెను.—ద్వితీ. 6:6, 7.
(10.ని) పేరాలు 3-6 నందలి అంశములతో కుటుంబ చర్చ. వర్షాకాలమందు ఆత్మీయపనులు చేరునట్లు చూచుటకు కావలసిన ఏర్పాట్లను గూర్చి కుటుంబ పెద్ద కుటుంబముతో చర్చించును. తాము సందర్శించబోవు ప్రాంతమందలి స్థానిక సంఘముయొక్క అడ్రసు, కూటముల సమయములను కుటుంబములోని ఒక సభ్యుడు తీసుకొనెను. సంఘముతో కలిసి ప్రాంతీయసేవలో పాల్గొనుటకును, ఆలాగే తటస్థ సాక్ష్యమిచ్చుటకుగల అవకాశములను వినియోగించుకొనుటకును తగినంత సాహిత్యములను కుటుంబము కలిగియుండవలెను. సాక్ష్యమివ్వగల అవకాశములను అందించుటకు తామెదుర్కొను పరిస్థితులనుగూర్చి పేర్కొనబడును. “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లా సమావేశమునకు హాజరగు పథకములనుగూర్చి కుటుంబ పెద్ద అవధానమును చూపును మరియు ప్రతిదినము ముగింపునందు ఆ దిన కార్యక్రమమందలి అంశములను పునర్విమర్శ చేయుదుమని వారికి జ్ఞాపకము చేయును. ఆ విధముగా చేయుటవలన వచ్చు ప్రయోజనములను అతడు వివరించును. వర్షాకాలము నుండి సమావేశ సమయములనుండి అత్యంత దైవిక పరిపాలనా ప్రయోజనమును పొందుటకు అందరు ఆశతో అపేక్షించవలెను.
(2ని.) అధ్యక్షుడు పేరా 7 నందలి సమాచారముతో ముగించును. మనము ఎటువంటి పథకములను వేసినను, కుటుంబ ఆత్మీయతను నిర్లక్ష్యపరచకుండునట్లు జాగ్రత్తపడవలెను.
పాట 100 (81) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 15తో ఆరంభమగు వారము
పాట 116 (108)
5 ని: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్సు రిపోర్టు. ప్రపంచవ్యాప్త పనికొరకు అందించిన ఆర్థికమద్దతుకై సొసైటి వ్యక్తపర్చిన మెప్పును చదువుము. మరియు స్వీకరించబడిన చందాల కొరకు సంఘమునకు కృతజ్ఞత తెల్పుము.
20 ని: 1991 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు హాజరగుటకు ఇప్పుడే ఏర్పాటు చేసికొనుము—1వ భాగము. 1-9 పేరాలను ప్రేక్షకులతో చర్చించుము. సమయము అనుమతిస్తే “జిల్లా సమావేశపు జ్ఞాపికలను” క్లుప్తముగా పునర్విమర్శచేయుము. సమావేశమునకు హాజరగు బైబిలు విద్యార్థులతో తగిన అంశములను ప్రచారకులు చర్చించవచ్చును.
పాట 177 (52) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 22తో ఆరంభమగు వారము
పాట 133 (68)
10 ని: స్థానిక ప్రకటనలు. ప్రస్తుత పత్రికలలో మాట్లాడదగు ఒకటి రెండు అంశములను ఉన్నతపర్చుము. ఈ వారంతములో ప్రాంతీయసేవయందు పూర్తిభాగము వహించునట్లు ప్రచారకులను ప్రోత్సహించుము.
23 ని: “సువార్తనందించుట—తరచు పనిచేయబడు ప్రాంతములో పత్రికలతో.” ప్రశ్నాసమాధానములు. 3వ పేరాను చర్చించునప్పుడు, యౌవన ప్రచారకులు ఇంటివారితో ఎలా మాట్లాడి సాహిత్యమును అందించగలరో ప్రదర్శించుటకు బాగుగా సిద్ధపడిన యౌవనుని ప్రస్తుత పత్రికలను ఉపయోగించనీయుము. ఇలా చెప్పవచ్చును: “నమస్కారమండి. నాపేరు—[అంశమును లేదా ముఖ్యశీర్షికను చూపి] దీనినిగూర్చి విలువైన సమాచారమును మీకు అందించుటకు నేను వచ్చాను. ఈ విషయమును నేను ఆనందించాను. [స్పష్టమైన విషయమును చూపుము లేదా ఉపమానమును వివరించుము.] నాకు అది సహాయపడింది [నీవెలా ప్రయోజనము పొందావో తెలియజేయుము.] దీనిని మీరుకూడ ఆనందించగలరని నేను తలంచుచున్నాను. మీరు ఈ పత్రికను చదువగోరుచున్న యెడల 2.50 రూ.లకు మీవద్ద విడిచి వెళ్లుటకు నేను సంతోషించగలను.”
12 ని: ప్రశ్నాభాగము. పాఠశాల అధ్యక్షుడు చేపట్టు చర్చ.
పాట 216 (108) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 29తో ఆరంభమగు వారము
పాట 139 (74)
10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలన వార్తలు. వారాంతపు ప్రాంతీయ సేవా యేర్పాట్లకు మద్దతునిమ్మని సంఘమును ప్రోత్సహించుము.
7 ని: “ప్రాంతములో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట.” ఆ శీర్షికను ప్రశ్నాసమాధానములతో చర్చించుట. 2-6 పేరాలలోనున్న అంశములను ఎలా ఆచరణాత్మకంగా ఉపయోగించవచ్చునో వివరించుము. 5వ పేరాను చర్చించునప్పుడు, బైబిలు పఠనమును ప్రారంభించుటలో సమస్యవున్న ప్రచారకుడు సహాయము నిమిత్తము సేవాకాపరిని సమీపించుటను ప్రదర్శించుము. ఆ ప్రచారకునికి సహాయపడుటలో సేవాకాపరి ఇండెక్స్‌ను ఉపయోగించును.
20 ని: 1991 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లా సమావేశమునకు హాజరగుటకు ఇప్పుడే ఏర్పాటు చేసికొనుము—2వ భాగము. 10-25 పేరాలను ప్రేక్షకులతో చర్చించుట. ది వాచ్‌టవర్ జూన్ 15, 1989 నందు పుట. 10.20 లలోగల సమాచారముపై ఆధారపడిన అవసరమగు జ్ఞాపికలను చేర్చుము. సమావేశమునకు హాజరుకాక మునుపు ఈ శీర్షికలలోనున్న అంశాలను పునర్విమర్శ చేయుమని కుటుంబములను ప్రోత్సహించుము.
పాట 14 (6) మరియు ముగింపు ప్రార్థన.