దైవపరిపాలనా వార్తలు
◆ హంగేరీ 11,257 ప్రచారకులు క్రొత్త శిఖరమును కలిగియుండెను. బైబిలు పఠనముల సంఖ్య గత సంవత్సరము 5,400 ఉండగా అది ఇప్పుడు 7,219కి చేరుకున్నది.
◆ యుద్ధసమయములో క్షిపణుల దాడుల మూలముగా కొంతమంది సహోదరుల ఇళ్లు పాడైనవని ఇశ్రాయేలు తెలిపింది, కాని ఎవ్వరు భౌతికముగా హానిని అనుభవించలేదు.
◆ లైబీరియాలో కొన్ని ప్రాంతములందు గొప్ప ఉపద్రవములున్నను, సంఘ ప్రచారకులు ప్రాంతీయ సేవలో సగటున 20 గంటలకంటె ఎక్కువ గడుపుచున్నారు. కోటి డి’ఐవొరి మరియు సియారా లియోన్ బ్రాంచిలచే ప్రేమపూర్వకమైన సహాయచర్యలు అందించబడినవి.
◆ తొమ్మిది సంవత్సరముల అనంతరము నికరాగువలోని సహోదరులు మొట్టమొదటిసారిగా మానగువ నందలి పెద్ద స్టేడియంలో సమకూడగల్గిరి. శిఖరాగ్రహాజరు 11,404 మరియు 283 మంది బాప్తిస్మము పొందిరి.