ఆగష్టు కొరకు సేవా కూటములు
గమనిక: సమావేశ కాలమందు, మన రాజ్య పరిచర్య ప్రతివారము కొరకు సేవాకూటముల పట్టిక వేయును. జిల్లాసమావేశమునకు హాజరగుటకు వీలగునట్లు సంఘములు సర్దుబాటు చేసికొనవలెను, ఆ తర్వాతివారపు సేవాకూటములో, ఆ కార్యక్రమము యొక్క ఉన్నతాంశాలను 30 నిమిషములపాటు పునర్విమర్శచేయవలెను. ప్రతిదిన కార్యక్రమమును పునర్విమర్శ చేసేందుకు కీలకాంశములపై దృష్టిని కేంద్రీకరించగల ఇద్దరు లేక ముగ్గురు అర్హతగల సహోదరులను ముందుగానే నియమించవచ్చును. బాగుగా సిద్ధపర్చబడిన యిట్టి పునర్విమర్శ వ్యక్తిగత అన్వయింపుకు ప్రాంతీయసేవలో వాడుటకు తగిన కీలకాంశములను జ్ఞాపకము పెట్టుకొనేందుకు సహోదరులకు సహాయపడును. ప్రేక్షకుల వ్యాఖ్యానములు, వివరించే అనుభవాలు క్లుప్తంగా, సూటిగా ఉండాలి.
ఆగష్టు 10తో ప్రారంభమగు వారము
పాట 123 (63)
10 నిమి: మన రాజ్య పరిచర్య నుండి అవసరమగు ప్రకటనలు, ఏమైనా స్థానిక ప్రకటనలు. మరియు, ఆగష్టు 1, 1992 వాచ్‌టవర్ అందించేటప్పుడు వాడదగిన రెండు నిర్థిష్ట సంభాషణా అంశాలను ఉన్నతపర్చండి.
20 నిమి: “మీ రాజ్య నిరీక్షణలో పాలు పంచుకొనుటకు బ్రోషూర్లను అందించండి.” ప్రశ్నా సమాధానముల చర్చ; ప్రదర్శనలు. లభ్యమగు బ్రోషూర్లనుగూర్చి సంఘానికి తెల్పండి, స్థానిక ప్రాంతానికి అతి ముఖ్యంగా తగిన బ్రోషూర్లను గూర్చి ప్రేక్షకులను వ్యాఖ్యానించమని అడగండి. పేరా 3 చర్చించునపుడు, పొరుగువానికి, సహోద్యోగి లేదా మరోచోట తటస్థ సాక్ష్యమందు మన సమస్యలు అనే బ్రోషూర్‌ను ఎలా అందించవచ్చునో ప్రదర్శించుము. సమయము అనుమతిస్తే, బ్రోషూర్లను అందించిన ప్రచారకులను ముందుగా నియమించి అనుభవాలను చెప్పనిమ్ము. ఆగష్టునెలలో బ్రోషూర్లను అందించుటలో పూర్తిగా పాలు పంచుకొనుమని ఉత్సాహవంతంగా సహోదరులను ప్రోత్సహించుము.
15 నిమి: సెలవు కాలములో మీ సమయాన్ని వివేకంగా వాడండి. సెలవుకాలంలో సమావేశముల నెలల్లోను అదనపు సమయాన్ని దైవిక ఆశయాలను పెంపొందించుకొనుటకు యిప్పుడు పథకము వేసికొనుమని ప్రచారకులను ప్రోత్సహించండి. ప్రయాణించేటప్పుడు తటస్థ సాక్ష్యమిచ్చుటను గూర్చిన సలహాలను యిముడ్చుము. వారములోని బైబిలు పఠనము, సొసైటి ప్రచురణలను చదవడం, సెలవు కాలంలో లభించు అదనపు సమయాన్ని వివేకంగా వాడుకొనుటవంటి వ్యక్తిగత గమ్యాలను ఏర్పాటుచేసికొనమని అందరిని ప్రోత్సహించుము.
పాట 165 (81) ముగింపు ప్రార్థన.
ఆగష్టు 17తో ప్రారంభమగు వారము
పాట 193 (103)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. దైవపరిపాలనా వార్తలు. ప్రాంతీయ సేవ ఏర్పాట్లనుగూర్చి సంఘమునకు జ్ఞాపకముచేయండి.
20 నిమి: “మన ఉపోద్ఘాతమును సాహిత్య అందింపుతో ముడిపెట్టుట.” క్లుప్త ప్రసంగము, ప్రదర్శనలు. పేరా 2 నందివ్వబడిన సలహాలనుపయోగిస్తూ లేఖన పరిచయమును ప్రదర్శించుటకు యౌవన ప్రచారకుని ఏర్పాటుచేయుము. యెషయా 65:21-23 ను వాడుచున్నప్పుడు, పేరా 6 నందలి పరిచయమును ఉపయోగించుము. పేరా 3నందలి సలహాలను పొందుపరుస్తూ మన సమస్యలు అనే బ్రోషూర్‌ను అందిస్తున్నట్లు మరో ప్రచారకుడు ప్రదర్శించవచ్చును. ఈ రెండు సందర్భాలలో సాహిత్య పరిచయము సాహిత్య అందింపుతో ఎలా ముడిపెట్టబడిందో వక్కాణించవలెను. బ్రోషూర్లను, పత్రికలను తీసికొనివెళ్ళమని సంఘానికి జ్ఞాపకము చేయండి.
15 నిమి: ఆర్మగెద్దోనును గూర్చిన ప్రశ్నలు. రీజనింగ్ పుస్తకములో పేజి 44-9 నందున్న సమాచారముతో ప్రసంగము.
పాట 137 (105) ముగింపు ప్రార్థన.
ఆగష్టు 24తో ప్రారంభమగు వారము
పాట 8 (88)
15 నిమి: స్థానిక ప్రకటనలు. అభివృద్ధికొరకై అవసరమగు ప్రోత్సాహముతో పాటు మెచ్చుకొనుచు, సంఘముయొక్క జూలై నెల సేవా రిపోర్టును చర్చించుము. వార్షిక వచనముతో పాటు సందర్భముపై ధ్యానించుట ప్రాంతీయసేవలో పాలుపంచుకొనుచు సంఘముతో సహవాసము చేస్తుండగా నిజమైన సంతోషమును కనుగొనుటకు మనకెలా సహాయము చేయునో సూచించుము. (రోమా. 12:9-16) సమయముంటే, ఈ వారాంతమందు ప్రాంతీయసేవలో వాడుటకు తగిన సంభాషణా అంశాలను ఒకటి లేక రెండింటిని పేర్కొనుము.
15 నిమి: “మీరు బైబిలు పఠనములను చేయుటకు ఆహ్వానమిస్తున్నారా?” ప్రశ్నా సమాధానముల చర్చ. అటుపిమ్మట తొలి సందర్శనములో లేక పునర్దర్శనములో బైబిలు పఠనములను ఎలా ప్రారంభించవచ్చునో చూపగల ఎంపిక చేయబడిన అనుభవాలు.
15 నిమి: స్థానిక అవసరతలు, లేదా తమ్మును సత్యమునకు ఆకర్షించినదేమో తెల్పుటకు ముగ్గురు లేక నలుగురు ప్రచారకులను పరిచయము చేయుము. తాము అధికమించాల్సి వచ్చిన ఆటంకములేవైనా ఉంటేవాటిని చేర్చవచ్చును.
పాట 184 (41) ముగింపు ప్రార్థన.
ఆగష్టు 31తో ప్రారంభమగు వారము
పాట 180 (100)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగము. ఈ భాగమును నిర్వహించుటకు సేవాధ్యక్షుడు నియమించబడ వచ్చును.
20 నిమి: “మన సమస్యలు అను బ్రోషూరునుండి పఠనములు ప్రారంభించుట.” క్లుప్త ఉపోద్ఘాతమిచ్చిన తరువాత (1) మన సమస్యలు బ్రోషూరును అంగీకరించిన వ్యక్తిని, (2) ఆసక్తిచూపి సాహిత్యమును అంగీకరించని వ్యక్తిని పునర్దర్శించుటను ప్రదర్శించుము. ఈ రెండు సందర్భాలకు మరొకసారి పునర్దర్శించు పునాదివేయుము.
15 నిమి: “దేవుని వాక్యమును అంగీకరించి, అన్వయించి ప్రయోజనము పొందుట.” సామాన్యంగా ప్రాంతీయ సమావేశము యెడలనున్న మెప్పుదలను ముందుగా నియమించిన వారిచే క్లుప్తంగా వ్యక్తపరచనిమ్ము. అంతకుముందు ప్రాంతీయ సమావేశములో నేర్చుకొనిన విలువైన అంశాలపై ధ్యానం మళ్లించ వచ్చును. ఆ పిమ్మట 1వ ఆ పేజీలో ఉన్న శీర్షికను ప్రశ్నా సమాధానములతో చర్చించవలెను. తెలిసి ఉంటే, తరువాత ప్రాంతీయ సమావేశపు తేదిని ప్రకటించి అందరిని హాజరు కమ్మని ప్రోత్సహించుము.
పాట 157 (73) ముగింపు ప్రార్థన.