మన ఉపోద్ఘాతమును సాహిత్య అందింపుతో ముడిపెట్టుట
1 ఈనెలలో మీ పరిచయ ప్రసంగమును మీరు సిద్ధపడేటప్పుడు మీ ప్రాంతమందున్న ప్రజలు ఎదుర్కొనుచున్న ప్రధాన సమస్యలను మొదటిగా పరిగణలోనికి తీసికొని, ఆ పిదప ఆగష్టు నెలలో మనము అందించబోవు బ్రోషూర్ల నుండి అభ్యాససిద్ధమైన, లేఖన పరిష్కారములను చూపిస్తున్న వ్యాఖ్యానములను ఎంపిక చేయండి.
2 కొన్ని పరిసరప్రాంతాలలో, పెరుగుచున్న నిరుద్యోగ సమస్య, అధికమౌచున్న జీవనవ్యయమునుగూర్చి ప్రజలు చింతిస్తూ యుండవచ్చును. అట్టి పరిస్థితి మీకు తారసపడితే ఆ సమస్యను గూర్చి మీ ఉపోద్ఘాతములో ప్రత్యేకంగా పేర్కొనవచ్చును.
మీరు ఇలా చెప్పవచ్చును:
◼ “ప్రతి ఒక్కరికి ఉద్యోగము, గృహము ఉండేందుకు ఏమి చేయవచ్చునో మేము ఇరుగుపొరుగువారితో మాట్లాడుచున్నాము. మానవ ప్రభుత్వములు దీనిని సాధించగలవని ఎదురు చూడడం సహేతుకమైనదని మీరనుకుంటున్నారా? [గృహస్థుని ప్రత్యుత్తర మివ్వనిమ్ము] ఈ సమస్యలను ఎట్లు పరిష్కరించాలో ఎరిగిన ఒకాయన ఉన్నారు, యెషయా 65:21-23 నందలి ఆయన అభయపూర్వక వాగ్దానమును గమనించండి. [చదవండి.] మన ప్రోత్సాహము నిమిత్తము మన సృష్టికర్త ఈ వాగ్దానమును వ్రాయించెను, ఈ క్లిష్టకాలములలో యివి మనందరికి అవసరము, కాదా?”—రీజ, పే. 11.
3 ఇప్పుడు మీ పరిచయ ప్రసంగమునకు మన సమస్యలు అను బ్రోషూర్నందలి సమాచారమును జతపర్చవచ్చును. దృష్టాంతమునకు 4 పేజి నందలి 2 పేరాలో సామాన్య మానవుడు ఎదుర్కొను అనేక సమస్యలు పేర్కొనబడినవి. అనేకమంది ప్రజలు వీటిలో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సమస్యలను వ్యక్తిగతంగా ఎదుర్కొనుచున్నారు. గృహస్థుని అవధానమును 5 పేజి నందలి మాష్టారు, ఆనంద్‌తో చెప్పుచున్న మాటలవైపు మరల్చవచ్చును: “మన సమస్యలను త్వరలో ఒకరు పరిష్కరించనై యున్నారని మా కుటుంబము నమ్ముచున్నది.” 6 పేజి 2 పేరా నందలి మాష్టారు వ్యాఖ్యానములను బట్టి మార్పును తేనైయున్నానని యెహోవాచేసిన వాగ్దానమును చూపిస్తూ క్లుప్తంగా మాట్లాడండి. బ్రోషూరు అందించిన తరువాత, దేవుడు మన సమస్యలన్నింటిని ఎలా పరిష్కరించనైయున్నాడో చర్చించుటకు త్వరలో నేను మిమ్మును మరలా కలుసుకుంటాను అని చెప్పి ముగించవచ్చును.
4 “ఇదిగో!” అనే బ్రోషూరును అందించేటప్పుడు, బ్రోషూరు ముందు వెనుక అట్టల మీద మనందరికి ఇండ్లు, ఉపాధికల్పనను గూర్చిన నమ్మకము ఎలా చిత్రీకరించబడిందో ఎందుకు చూపకూడదు. గృహస్థుడు ఆ చిత్రమునంతటిని ఒకేసారి చూచేందుకు వీలుగా మీరు దానిని తెరచిచూపవచ్చును. మీరు అప్పుడే చదివిన లేఖనముతో దానిని ముడిపెట్టి, దేవుని వాగ్దానము నెరవేరిన తదుపరి ఉండబోవు పరిస్థితిని గూర్చి అది చక్కగా వర్ణిస్తున్నదని వివరించండి.
“ప్రభుత్వము” బ్రోషూరును మీరు చూపిస్తుంటే మీరిలా చెప్పవచ్చును:
◼ “దేవుని రాజ్యము రావాలని, ఆయన చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునట్లు ప్రార్థించుడని యేసు మనకు బోధించెను. దేవుని చిత్తము యిక్కడ జరిగితే భూమి నిజంగా పరదైసు యగునని మీరనుకొనుచున్నారా?” గృహస్థుడు ప్రత్యుత్తరమిచ్చిన తదుపరి, ప్రకటన 21:3-5 పరిచయముచేసి చదవండి.
5 పిమ్మట 3వ పేజినందలి ఉపోద్ఘాత పేరానందు ఎంపిక చేయబడిన భాగములను చదవండి. ఆ వ్యాఖ్యానమును గమనించండి: “ఈ రాజ్యము ద్వారా దేవుడు అతి త్వరలోనే యుద్ధాలకు, ఆకలి బాధకు, వ్యాధికి, నేరమునకు అంతము తెచ్చును.” ఈ సమస్యలలో ఏది అతి తీవ్రమైనదని తాను తలంచుచున్నాడో గృహస్థుని అడగండి.
6 యౌవనులు కూడ వృద్ధులైన వారికి సహితము రాజ్య సువర్తమానమును సమర్థవంతముగా అందించగలరు.
యెషయా 65:21-23ను పరిచయము చేసేటప్పుడు యౌవన ప్రచారకులు యిట్లు చెప్పవచ్చును:
◼ “వయస్సులో పెద్దవారైన మీరు జీవితములో నాకంటె ఎక్కువ అనుభవం కలిగియున్నారని నాకు తెలుసు. అయితే ఈ లేఖనము మనందరికి ఓదార్పుకరంగా ఉన్నది.”
7 ఆయా బ్రోషూర్లు లేదా పత్రికలతో పాటు ఏదైనా సాహిత్యమును ఇస్తే వాటిని జాగ్రత్తగా వ్రాసికొనండి. వారి ఆసక్తిని వృద్ధిచేయుటకు మీరు తిరిగి దర్శించేటప్పుడు ఈ సమాచారము మీకు అవసరము.