సువార్తనందించుట—తరచు పనిచేయబడు ప్రాంతములో పత్రికలతో
1 పేతురు, యోహానులు సమరయ అంతటా సంపూర్ణ సాక్ష్యమిచ్చి “అనేక గ్రామములలో సువార్తను” ప్రకటించిరని అపొ. కార్యములు 8:25 నందు మనము చదువుదుము. మన సంఘమునకు కేటాయించబడిన ప్రాంతమును పూర్ణముగా పనిచేయుటకు, నేడు మనము చురుకుగా ఉండాలి.
2 ప్రచారకులు వేగంగా వృద్ధిచెందుచుండగా, అనేక సంఘములు తమ ప్రాంతమును బహు తరచుగా పూర్తి చేయగలుగుచున్నారు. ప్రాంతములను తరచూ పనిచేయుటకు మన తొలి ప్రతిచర్య ప్రతికూలంగా ఉండవచ్చును. అలాగుండకూడదు. మన ప్రాంతమందలి ప్రజలతో పంచుకొనుటకు ప్రతి ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలందు అన్నివేళల క్రొత్త మరియు ఆసక్తికరమైన అంశములు ఉంటున్నవి. మరియు, మన ప్రాంతమును బహు తరచుగా పూర్తి చేయగలుగుచున్నాము గనుక, ప్రతి గుమ్మమునొద్ద అదనపు సమయమును గడుపుటకు మనకు అవకాశమున్నది.
ప్రజలతో సంభాషించుము
3 మన ప్రాంతమునంతటిని పూర్తిగావించుటకు పత్రికలను విస్తృతంగా పంచిపెట్టుటకుగాను క్లుప్తమైన పత్రికా అందింపు వాడబడుచున్నది. అయితే తరచుగా పనిచేయబడుచున్న ప్రాంతములో పనిచేయుచున్న ప్రచారకులు ముఖ్యముగా గృహస్థులతో సంభాషించుటకు ఎక్కువ సమయమును తీసికొనుటలో బాగుగా పనిచేస్తున్నారు. యౌవన పిల్లలుకూడ ఆ శీర్షికలలో తమకు ఆసక్తిని కలిగించిన దానిపై విస్తరించి మాట్లాడగలరు. దీనిని ఎలా సాధించవచ్చును? పత్రికలలోవున్న శీర్షికలతో పరిచయము కలిగియుండుట ముఖ్యము. దీనికి సమయము, ముందాలోచన అవసరము. పత్రికను చదివేటప్పుడు మీ ప్రాంతమందలి ప్రజలకు ఏది బాగుంటుందో దానిని నిశ్చయించుకొనుము. అటుపిమ్మట, సేవకు వెళ్లేముందు, పత్రికలను చూచి, మీరు ఉన్నతపరచగోరు అంశములను ఎంచుకొనుము. గుమ్మములవద్ద వివిధ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ శీర్షికలను మీరు చూపెదరో పరిశీలించుము. మీ పరిచయములో ఉన్నత అంశముగా ఒక పత్రికలోని మంచి విషయాలను ఉపయోగించుము. స్నేహపూరిత సంభాషణతో ఇంటివారి దృక్పథములను రాబట్టుము. పత్రికలను అందించడములో సమదృక్పథాన్ని కలిగియుండుము.
మన సంకల్పమును మనస్సునందుంచుకొనుము
4 ఇంటింటికి వెళ్లడములో మన ఉద్దేశ్యము ఎన్ని పత్రికలను లేదా పుస్తకములను మనము అందించగలము అని చూచుకొనుటకు కాదు. సత్యమును గూర్చిన ఖచ్చితమైన జ్ఞానమునకు ఇతరులు రావడానికి సహాయపడాలని మన కోరిక. పేతురు యోహానులు సమరయులతో యెహోవా వాక్యమునుగూర్చి సంపూర్ణముగా మాట్లాడారు. అలాగే మనముకూడ మన ప్రాంతమందలి ప్రజలకు సత్యమునకు స్పందించే అవకాశమునిచ్చుటకు సమయమును గడుపగోరుచున్నాము.
5 మన సంభాషణకు ఆధారముగా పత్రికలను ప్రభావితముగా ఉపయోగించుట మూలముగా ఈ సంకల్పమును నెరవేర్చగలము. సువార్తనుగూర్చిన పరిశుద్ధ మర్మమును తెలియజేయుటకు . . . ధైర్యముతో . . . మాట్లాడు సామర్థ్యము” మనకు అనుగ్రహించబడునట్లు మన కొరకును, ఇతరులనుగూర్చియు మనము ప్రార్థన చేయవలెను.—ఎఫె. 6:18-20.