ఆసక్తిని రేకెత్తించు ఉపోద్ఘాతములు
1 ఉపోద్ఘాతములను ఉపయోగించుటలో యేసు ఎంతో ప్రవీణుడు. పెద్ద గుంపుతో మాట్లాడుతున్నప్పటికి లేక ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పటికి వారిని వ్యక్తిగతముగా సంభాషణలో చేర్చుట ద్వారా తన ప్రేక్షకుల అవధానమును ఆయన ఆకట్టుకొనెను. ఆయన తనను వినేవారికి తాను బోధించు అంశము యొక్క విలువను చూపించెను.—మత్త. 5:3-12; యోహా. 4:7-30.
2 ముందుగా సిద్ధపడుట అవసరము: మన వర్తమానము యెడల ఆసక్తిని రేకెత్తించాలంటే, ఉపోద్ఘాతములలో ఆ వ్యక్తిని ఇమిడ్చేరీతిగా మనము వాటిని మలచవలెను. ఆయనకు శ్రద్ధకలిగించే విషయాలను తెలియజెప్పి, రాజ్యవర్తమానము వ్యక్తిగతముగా తనకు సహాయము చేయునని చూపుము.
3 పరిచర్యకు సిద్ధపడునప్పుడు, ఆ ప్రాంతములోని ప్రజలకు ఆ సమయంలో ఏవి శ్రద్ధగల విషయాలో వాటిని పునఃసమీక్షించుకొనండి. ఇటీవలి వార్తలలోని ఏదైన సంఘటన వారి అవధానమును ఆకట్టినదా? ఒక యౌవనస్థునికి ఏది ఆసక్తిదాయకమైన సంగతి కాగలదు? ఒక వృద్ధునికి? భర్తలకు, భార్యలకు, పిల్లలకు? ప్రతి గుమ్మము యొద్ద ఒకే ఉపోద్ఘాతాన్ని ఉపయోగించే బదులు, విభిన్నమైన ఉపోద్ఘాతములను సిద్ధపడియుండి, ఇంటివారి ప్రతిస్పందనను, గమనించి వెంటనే అందుకు తగినట్లు వాటిని ఉపయోగించుటకు సంసిద్ధంగా ఉండుము. కొంతమంది ప్రచారకులు రీజనింగ్ పుస్తకమునుండి అనేక విధములైన ఉపోద్ఘాతములను సిద్ధపడి ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడెల్లా వాటిని ఉపయోగించుటలో మంచి విజయాన్ని పొందారు. (రీజ పు. 9-15) ఇది వారి సంభాషణను తాజాగా, మరియు ఆసక్తిదాయకంగా ఉంచుతుంది.
4 సెప్టెంబరు మాసములో ఇలాంటి పరిచయ ప్రసంగాన్ని మీరు ఉపయోగించవచ్చును:
◼ “నమస్కారమండి. మేము మా పొరుగువారిని కలుస్తూ, ఇతరులను పరిపాలించే వ్యక్తిలో ఎటువంటి లక్షణాలుండాలనే దాన్ని గూర్చి మాట్లాడుతున్నాము. మీరు ప్రాముఖ్యమని ఎంచు ఒకటి లేక రెండు లక్షణాలను గూర్చి మిమ్ములను అడుగవచ్చా? [జవాబు చెప్పనివ్వండి. అంశములను గుర్తించండి. యుక్తమైనవైతే అంగీకరించండి.] మానవజాతి పరిపాలకునిగా అంగీకరించబడిన వాని అర్హతలను బైబిలు వర్ణిస్తున్న సంగతి మీకు తెలుసా? అవి ఇక్కడ యెషయా 9:6, 7లో ఉన్నవి. [చదవండి] అటువంటి పరిపాలకుని క్రింద జీవించుటను గూర్చి మీరేమనుకుంటారు?” జవాబు చెప్పనివ్వండి, ఆ తర్వాత కీర్తన 146:3, 4 మరియు రీజనింగ్ పుస్తకము 153-4లో యేసు పరిపాలనకు హామీగా చూపబడిన లక్షణమును గూర్చిన సమాచారము వైపు అవధానమును మళ్లించుము. చర్చను ఇంకా పొడిగించుటకు నిరంతరము జీవించుము పుస్తకమందలి 112 మరియు 113 పేజీలను ఉపయోగించవచ్చును. ఆ తర్వాత మీరు ప్రచురణను అందించవచ్చును.
5 ఒక వేళ మీరు కుటుంబ విషయాలలో ఆసక్తిగల వ్యక్తులతో మాట్లాడుతున్నట్లయిన, నిరంతరము జీవించుము అను పుస్తకమును అందించునప్పుడు ఈ క్రింది పరిచయ ప్రసంగము బాగుండవచ్చును.
స్థానిక పద్ధతిలో అభినందించిన తర్వాత, మీరిలా చెప్పవచ్చును:
◼ “ఈ దినములలో అనుదిన వత్తిడులు, సమస్యలు కుటుంబములకు నిజమైన సవాలుగా ఉన్నవని మీరు గమనించారా? [జవాబు చెప్పనివ్వండి.] ఒక మంచి సలహా కొరకు కుటుంబములు ఎచ్చటికి వెళ్లవలెనని మీరనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] ఈ అంశముపై బైబిలు చెప్పేదానిపై మేము అవధానాన్ని మళ్లిస్తున్నాము. వివాహాన్ని మొదట ఏర్పాటుచేసిన వాడు తొలి మానవ జతకు ఏమి చెప్పాడో చూద్దాము.” ఆదికాండము 1:28 చదివిన తరువాత నిరంతరము జీవించుము అను పుస్తకములోని 238వ పేజికి త్రిప్పి, 29వ అధ్యాయములోని ఎంపిక చేయబడిన అంశాలను ఉపయోగిస్తూ, చర్చను కొనసాగించుము.
6 ఆసక్తిని ఆకట్టు కొనుటకు యేసు ఉపయోగించిన పద్ధతులను అనుసరించుట ద్వారా, వినువారిని చర్చలలో ఇముడ్చుటద్వారా యథార్థహృదయముగలవారికి ఆత్మీయ విషయముల విలువను చూపించెదము.