దైవపరిపాలనా వార్తలు
అల్‌బేనియా: డిసెంబరు 1991 నుండి డిసెంబరు 1992 వరకు ప్రచారకుల సంఖ్య 24 నుండి 107కు పెరిగింది. అదే సమయంలో బైబిలు పఠనాల సంఖ్య 4 నుండి 221కి పెరిగింది.
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్: జనవరి 20, 1993 నాడు, యెహోవా సాక్షుల పూర్తి కార్యాలను పునరారంభించడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఒక ఆజ్ఞాపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు వారు తమ రాజ్య మందిరములను ఉపయోగించు కోగలుగుతున్నందుకు, “వెలుగు సంబంధులు” జిల్లా సమావేశాన్ని బహిరంగంగా జరుపుకోగలుగుతున్నందుకు అక్కడి సహోదరులు ఆనందిస్తున్నారు. ఆరు సమావేశాలకు 4,739 మంది హాజరయ్యారు, అందులో 121 మంది బాప్తిస్మము తీసుకున్నారు.