మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అందించడంలో కరపత్రాలను ఉపయోగించండి
1 జూన్ నెలలో మనం జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అందిస్తాము. క్లుప్తమైన లేఖనాధార వివరణనిచ్చిన తర్వాత వెంటనే ఈ పుస్తకాన్ని నేరుగా చూపించవచ్చు. దానిలోని చివరి అధ్యాయంలోని చిత్రాన్ని చూపించి, క్రీస్తు పరిపాలన అటువంటి పరిస్థితిని తీసుకువస్తుందని చెప్పవచ్చు. దీనికి బదులుగా, ఈ పుస్తకం యెడల ఆసక్తిని రేకెత్తించడానికి కరపత్రాలను ఉపయోగించవచ్చును.
2 ఈ లోకం నిలుస్తుందా? సంభాషణ నారంభించడానికి కరపత్రాలు ఎంతగానో దోహదపడతాయి. ఇంటివారిపై వ్యక్తిగత ప్రభావాన్ని చూపించే అర్థవంతమైన విషయాలను అవి కలిగివుంటాయి గనుక, వారి అవధానాన్ని ఆకట్టుకోడానికి అవి ఎంతో సహాయపడతాయి.
ఉదాహరణకు మీరిలా అనవచ్చు:
◼ “ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, అనేకులు . . . [వార్తల్లోని వర్తమాన విషయాన్ని ఎన్నుకోండి] విషయంపై తమ శ్రద్ధను చూపుతున్నట్లు మేము గ్రహించాము. ప్రపంచ పరిస్థితులు అంతకంతకూ చెడ్డవౌతునట్లున్నాయి. కొందరైతే ఈ లోకం నిలుస్తుందా అని ఆందోళనపడుతున్నారు. దీని గురించి మీరేమను కుంటున్నారు? [ఇంటి వారిని ప్రత్యుత్తర మివ్వనివ్వండి. అనేకులు ఆశావాదులే] ప్రోత్సాహకరమైన దాన్నొకదాన్ని నేను చదివాను, అది నేను మీతో పంచుకోవాలను కుంటున్నాను. అది ఈ కరపత్రంలో వుంది. [విల్ దిస్ వరల్డ్ సర్వైవ్ అనే కరపత్రాన్ని మీరు పట్టుకొని, అలాంటి మరో కరపత్రాన్ని వారికివ్వండి.] . . . అని యేసు ఎలా ప్రవచించాడో గమనించండి.” మీ ఉపోద్ఘాతానికి సరిపడే దాన్ని 4, 5 పేజీల్లోని ఒక పేరాను చదవండి. అప్పుడు మహాగొప్ప మనిషి పుస్తకాన్ని పరిచయం చేయండి. తగినట్లనిపిస్తే, యేసు ప్రవచనాన్ని నొక్కితెలిపే 111వ అధ్యాయంలోని అదనపు సమాచారం వైపు త్రిప్పండి. వెళ్లే ముందుగా, నిత్యజీవితానికి నడిపించే యేసును గూర్చిన జ్ఞానం, ఆయన ద్వారా యెహోవాను గూర్చిన జ్ఞానం పొందడానికి ఈ పుస్తకం ఎలా సహాయపడుతుందో క్లుప్తంగా వివరించండి. (యోహాను 17:3) అంతేకాకుండా, మీరు పునర్దర్శనం చేసినప్పుడు చర్చించడానికి గాను ఒక ప్రశ్నను లేవదీయడం మరువకండి.
3 లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్: మీ దృష్టిలో శాంతియుతమైన నూతన లోకంలో జీవించడమంటే ఏమిటి? ప్రజలు సహజంగా అద్భుతంగా పారే నదులు, అలజడి లేని లోయలు, ఒక దానితో ఒకటి శాంతియుతంగా జీవించే అందమైన జంతువులున్న దృశ్యాలను ఊహించుకుంటారు. ప్రస్తుత లోకంలోని పరిస్థితులనుబట్టి ఆందోళన చెందుతున్న ప్రజలకు శాంతియుత నూతన లోక ఉత్తరాపేక్ష ఎంతో సేదదీర్చేదిగా వుంటుంది.
4 మీ పొరుగువారికి, మీ సహూద్యోగులకు, యింటింట మీరు కలిసేవారికి సేదదీర్చే, మనోహరమైనదాన్ని మీరు అందించడానికి సంసిద్ధులేనా?
“లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్” అనే కరపత్రికను ఉపయోగించి మీరిలా అనవచ్చును:
◼ “ఈ కరపత్రం పైన చూపించబడినట్లుగా ప్రజలు శాంతిలో జీవించడం ఎన్నడైనా సాధ్యపడుతుందంటారా? [ఇంటివారిని సమాధానము చెప్పనివ్వండి.] రెండవ పేజీలోని మొదటి పేరాలోని చివరి వాక్యాన్ని చూడండి. ‘ఈ పరిస్థితులు భూమిపైన వుంటాయి అని నమ్మడం వట్టి కల లేక భ్రమేనా?’ అని అది ప్రశ్నిస్తోంది [పిదప, ఆ కరపత్రంలోని తర్వాత పేరాను చదవండి.] క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గూర్చిన ఉల్లేఖనము బైబిలులోని 2 పేతురు 3:13 నందలిది. మీ దగ్గర బైబిలు వున్నట్లైతే దయచేసి దాన్ని తీసుకు వస్తే, కీర్తన 104:5లో భూమి భవిషత్ను గూర్చి మరింత నేర్చుకోవడానికి, దాన్ని మనం చదువుదాం.” లేక కేవలం మీ బైబిలు నుండే మీరు ఆ వచనాన్ని చదువవచ్చు. పిదప మీ సంభాషణను మహాగొప్ప మనిషి పుస్తకంలోని 133 అధ్యాయంలోకి మరల్చండి.
5 నాటిన విత్తనానికి ‘నీరు పోయడానికి’ పునర్దర్శనాలు అవసరం. (1 కొరిం. 3:6, 7) మొదటి సారిగానీ లేక మీ పునర్దర్శనంలో గానీ మహాగొప్ప మనిషి పుస్తకంలో పఠనం ప్రారంభించడానికి కొన్ని సలహాలను క్రింది శీర్షిక అందిస్తుంది.