మహాగొప్ప మనిషి పుస్తకంనుండి బైబిలు పఠనాన్ని ప్రారంభించుట
1 గృహ బైబిలు పఠనం చేయడం యింటివారికీ మీకూ చాలా ఆహ్లాదకరంగా, ప్రతిఫలదాయకంగా వుంటుంది. బైబిలు జ్ఞానాన్ని యితరులతో పంచుకోవడంలో పొందే అమితమైన ఆనందం మరి దేనితోనూ పోల్చలేనిది.—సామె. 11:25.
2 చివరి దినాల సూచనలు: పై శీర్షికల్లోని సలహాలను మీరు ఉపయోగించి మీ సంభాషణను మొదలు పెట్టడంలో విల్ ది వర్ల్డ్ సర్వైవ్ అనే కరపత్రమును ఉపయోగించినట్లైతే, మహాగొప్ప మనిషి పుస్తకంలోని 111 అధ్యాయంలో పఠనాన్ని ఎలా ప్రారంభించగలరు? నూటా ఒకటవ అధ్యాయం తెరిచి, మొదటి మూడు పేరాలను చదవండి. ఆ తర్వాత అధ్యాయం చివర్లోవున్న ప్రశ్నల్లో మొదటి దాన్ని మీరు అడుగవచ్చు: “అపొస్తలులు ప్రశ్నించుటకు వారిని ఏది పురికొల్పును, అయితే మరింకే విషయములను కూడ నిజముగా వారు తమ మనస్సులలో కలిగియుందురు?” ఇంటివారు సమాధానాన్ని గూర్చి తర్కించడానికి సహాయపడండి, బోధించడానికి ఉదాహరణలను ఉపయోగించండి. నాలుగు నుండి ఆరు పేరాల వరకూ చదివిన తర్వాత రెండవ ప్రశ్నను అడగండి: “యేసు ప్రవచనమందలి ఏ భాగము సా.శ. 70లో నెరవేరును, అయితే అప్పుడు ఏమి జరుగలేదు?” ఒక వేళ ఇంటివారికి ఆసక్తి వున్నట్లు కనిపించి, యింకా సమయంవుంటే మీ సంభాషణను కొనసాగించండి.
3 ఆ యింటి వారికి మరో సమయము సమంజసంగా వుంటుందని మీరు తలస్తే, మీరిలా అడగవచ్చు: “ఈ విధానాంతమెప్పుడు అనే దాని గూర్చి ఇంకా ఎక్కువ మీరు తెలుసుకోవాలను కుంటున్నారా?” అప్పుడు మీరు ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి పునర్దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
4 శాంతియుత లోకం సాధ్యమేనా? మహాగొప్ప మనిషి పుస్తకంలోకి నడిపించడానికి లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్ కరపత్రమును ఉపయోగించినట్లైతే, 133వ అధ్యాయం బైబిలు పఠనం ప్రారంభించడానికి ఎలా సహాయపడుతుంది?
రెండవ పేతురు 3:13 చదివిన తర్వాత, కరపత్రంలోని 3వ పేజీలోని రెండవ పేరాను చదవండి లేక దాని సారాంశాన్ని చెప్పిన పిదప మీరిలా అనవచ్చును:
◼ “దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, యెహోవా రాజ్యానికి రాజుగా వుంటాడు. జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం యేసును ఎలా వర్ణించింది, మరి భవిషత్లో ఆయన ఏమి సాధించబోతున్నాడో మనకు చూపించడాన్ని మీరు గమనించండి.” తర్వాత, పూర్తి అధ్యాయాన్ని చదవండి. అధ్యాయం చివర్న వున్న మొదటి ప్రశ్నను యింటి వారిని అడగండి: “‘హర్మగిద్దోనును తప్పించుకొనువారు మరియు వారి సంతానము యొక్క సంతోషదాయకమైన ఆధిక్యత ఏమైయుండును?’ [వారిని వ్యాఖ్యానించ నివ్వండి. యితర ప్రశ్నలు కూడా అలాగే చర్చించవచ్చు.] యేసు రాజుగా పరిపాలించబోయే క్రొత్త భూమిలో మీరు జీవించాలని కోరుకుంటారా? అందులో మీరు ఎలా జీవించగలరో బైబిలు నుండి చూపేందుకు నేను మీ దగ్గర్కి ప్రతివారం వచ్చే అవకాశాన్ని పొందాలను కుంటున్నాను”
5 ఈ దర్శనంలో యేసుక్రీస్తు గూర్చి యింకా చర్చించడానికి కొందరు ఆసక్తి కనపరుస్తారు.
మీరిలా అనవచ్చు:
◼ “నాలుగు సువార్తల్లో తెలియజేయబడిన యేసు భూ జీవితాన్నిగూర్చి ఈ పుస్తకంలో సమీక్షించడానికి కృషి చేయబడింది. యేసు భూ జీవితం గూర్చి మీరు యింకా తెలుసుకోవాలను కుంటున్నారా?” ఇంటివారు అనుమతిస్తే 15వ అధ్యాయంలో యేసు చేసిన మొదటి అద్భుతాన్ని మీరు చర్చించవచ్చు.
6 నీతిని ప్రేమించి, వారెదుర్కొనే సమస్యల పరిష్కారము కొరకు చూచే యథార్థ హృదయంగల ప్రజలనేక మంది యింకా వున్నారు. బైబిలు పఠనం ద్వారా యేసుక్రీస్తు బోధను పంచుకోవడం, నిజంగా అతి ప్రతిఫలదాయకమైన ప్రయాసే.