కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/94 పేజీ 3
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి
    మన రాజ్య పరిచర్య—2012
  • అపార్ట్‌మెంట్‌లలో ప్రకటిస్తూ సమగ్రంగా సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2013
  • సువార్తనందించుట—వ్యాపార ప్రాంతములో ధైర్యముగా సాక్ష్యమిచ్చుట ద్వారా
    మన రాజ్య పరిచర్య—1989
  • మంచివార్త ప్రకటించే పద్ధతులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1994
km 11/94 పేజీ 3

ప్రశ్నాభాగం

◼ మనం ప్రమాదకరమైన ప్రాంతంలో పరిచర్య చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తను తీసుకోవలసిన అవసరముంది?

1 హింస, దౌర్జన్యాలు, సామాజిక ఉపద్రవం మొదలైనవాటిని గూర్చి మనం వింటున్న నివేదికల సంఖ్య ప్రాముఖ్యంగా నగరాల్లో ఎక్కువవుతుంది. మనం కలత చెందుతున్నప్పటికీ, ఉపద్రవమున్న ప్రాంతాల్లో కూడా రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించే యథార్థపరులున్నారని మనకు తెలుసు. కాబట్టి యెహోవా మనలను సంరక్షిస్తాడనే నమ్మకముతో ముందుకు కొనసాగడానికి తగిన సమయంలో ధైర్యాన్ని సమకూర్చుకోవాలి.—సామె. 29:25; 1 థెస్స. 2:2.

2 మనం ప్రమాదం జరిగే సాధ్యతవున్న ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మంచి వివేచన కలిగి ఉండాలని, యెహోవా కోరుతున్నాడు. అప్రమత్తంగా ఉండండి. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” (సామె. 22:3) అవసరమైతే, జతలుగానో, అనేక ప్రచారకుల గుంపులుగానో పరిచర్య చేయడంలోని జ్ఞానాన్ని అనుభవజ్ఞులైన ప్రచారకులు గుణగ్రహిస్తారు. ప్రసంగి 4:9, 12 నందు యీ విధంగా చెబుతుంది: “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు . . . ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు.” నేరస్థులు తరచూ ఒంటరివారిని వెదకి సులభంగా మోసం చేయడానికి చూస్తారు.

3 చీకటిగానున్న వరండాలుగల అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లలోకి, ఎవరూ లేని పై అంతస్థుల్లోకి వెళ్ళేటప్పుడు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా యింట్లోకి గాని లేదా అపార్ట్‌మెంట్‌లోకి గాని రమ్మన్న ఆహ్వానాన్ని అంగీకరించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బెదిరించేవారిగానో, సవాలు చేసేవారిగానో కనిపించే వాళ్ళతో వాదించవద్దు. మీరు ఒక యెహోవాసాక్షి అని చెప్పడానికి వేగిరపడండి. కొందరు ప్రచారకులు తమను గుర్తించడానికి, అన్నివేళలా బైబిలును లేదా కావలికోటను లేదా తేజరిల్లు! పత్రికను చేతిలో పట్టుకుంటారు.

4 ఆ ప్రాంతంలో తారట్లాడే వ్యక్తులనుగూర్చి అప్రమత్తంగా ఉండండి. ఆ భవననివాసులు కారని అనిపించే యితరులతో లిఫ్ట్‌లో ప్రవేశించేటప్పుడు జాగ్రత్తపడాలి. ఖరీదైన ఆభరణాలను ధరించవద్దు. మీరు చీకటిపడిన తరువాత వీధుల్లోనే ఉంటే, ఎక్కువ జనసంచారం లేని చీకటిగావున్న వీధుల్లో నడవకండి. మీరు దౌర్జన్యానికి గురైతే, మీ డబ్బు, వస్తువులు మాత్రమే వాళ్ళు అడిగితే ఎదిరించకండి; మీకున్న ఏ వస్తువుకన్నా మీ ప్రాణము చాలా విలువ గలది.—మార్కు 8:36.

5 ఆ ప్రాంతంలో ప్రచారకుల జాడ తెలుసుకుంటూ, నాయకత్వం వహించే సహోదరులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరముంది. ఎల్లవేళలా ఒకరికొకరు దగ్గరగా ఉండేలా, సహజంగా గుంపులోని అందరినీ ఒకే చోటకు పంపించడం మంచిది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ రకమైన హింసగాని, ఆటంకాలు గాని కలిగినట్లయితే, ఆ గుంపు త్వరగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి.

6 మనం అప్రమత్తంగాను, జాగ్రత్తగాను ఉన్నట్లయితే, విపరీతంగా నేరాలు జరుగుతున్న ప్రాంతాల్లో “జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్నవారి”ని కలవడంలో మనం కొనసాగగలము.—యెహె. 9:4.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి