1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి—భాగం 3
1 తాను సువార్తను ధైర్యంగా చెప్పే సామర్థ్యాన్ని సంపాదించేందుకు తన కొరకు ప్రార్థించమని అపొస్తలుడైన పౌలు తన సహోదరులను కోరాడు. (ఎఫె. 6:18-20) మనం అదే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తాము. ఆ సామర్థ్యాన్ని పొందేందుకు, కూటానికి హాజరైనవారిలో యోగ్యతవున్నవారు పేరును నమోదు చేసుకోవాలని ప్రోత్సహించే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా ఇవ్వబడే సహాయాన్ని మనం గుర్తిస్తాం.
2 విద్యార్థులముగా, మాట్లాడే బోధించే మన సామర్థ్యాలను మెరుగుపరచుకునేందుకు మనకు సహాయపడే వ్యక్తిగతమైన సలహాను మనం పొందుతాం. (సామె. 9:9) మిగిలిన విద్యార్థులు పొందే సలహాలను విని, మనం నేర్చుకున్న వాటిని అన్వయించుకోవడం ద్వారా మనం కూడా ప్రయోజనం పొందుతాం. ఒక అసైన్మెంటును సిద్ధపడేటప్పుడు మనమిచ్చే వివరణ కచ్చితమైనదని రూఢి చేసుకునేందుకు మనం మూల సమాచారాన్ని జాగ్రత్తగా పఠించాలి. మొత్తం అంశాన్ని వృద్ధిచేయడానికి మనం ఉపయోగించే ముఖ్య విషయాలు మరియు లేఖనాలు దానికి తగినవై ఉండాలి. అసైన్మెంట్లో మరొకరు కూడా ఉన్నట్లయితే, దానిని పాఠశాలలో నిర్వహించకముందే బాగా రిహార్సల్ చేయాలి. మనం అభివృద్ధిని సాధిస్తున్న కొలది, చేవ్రాతప్రతికి బదులు చిన్న నోట్సును ఉపయోగించి అప్పటికప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి.
3 పాఠశాలలో అసైన్మెంట్లు ఉన్న అందరూ ముందుగా వచ్చి, పాఠశాల అధ్యక్షునికి తమ సలహా పత్రం ఇచ్చి, హాల్లో ముందు భాగానికి సమీపంలో కూర్చోవాలి. సహోదరీలు తమ భాగానికి సెట్టింగ్ ఏమిటో వారు కూర్చుంటారో లేక నిలబడతారో పాఠశాల అధ్యక్షునికి ముందే తెలపాలి. ఈ విధాల్లో సహకరించడం అనేది కార్యక్రమం సాఫీగా జరగడానికి, వేదిక మీద అన్నీ ముందే సిద్ధమై ఉండేలా చూసే వారికి సహాయపడేందుకు తోడ్పడుతుంది.
4 అసైన్మెంట్ నెం. 2కు సిద్ధపడడం: చదివే తన సామర్థ్యాన్ని విద్యార్థి మెరుగుపరచుకునేందుకు సహాయపడాలన్నదే బైబిలు చదవడంలోని ఒక ఉద్దేశం. దీనిని చక్కగా ఎలా సాధించవచ్చు? సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ బిగ్గరగా చదవడమే దానిపై పట్టు కలిగి ఉండేందుకు మంచి మార్గం. పరిచయం లేని పదాల అర్థాన్ని, సరైన ఉచ్చారణను తెలుసుకోవడానికి, విద్యార్థి వాటి కొరకు నిఘంటువులో చూడాలి. ఇందుకు నిఘంటువులో ఉపయోగించబడిన ఉచ్చారణ సంకేతాల భావాన్ని ఎరిగివుండవలసిన అవసరం కూడా ఉండవచ్చు.
5 బైబిలులో కనుగొనబడే ఆంగ్లంలోని సంజ్ఞావాచకాలను అంతగా వాడుకలోలేని పదాలను ఉచ్చరించడానికి నూతన లోక అనువాదము (ఆంగ్లం) సహాయం చేస్తుంది. అది పదాంశాలను విడగొట్టి, ఒత్తిపలికే స్వర చిహ్నాలను ఇస్తూ అలా చేస్తుంది. [“ప్రతి లేఖనము దైవ ప్రేరేపితమును ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం) 325-6 పేజీలు, 27-8 పేరాలు చూడండి.] ఒక నియమంగా ఒత్తిపలికే స్వర చిహ్నానికి ముందుండే పదాంశం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. నొక్కి పలికే పదాంశం ఒక అచ్చు అక్షరంతో ఆగితే ఆ అచ్చు దీర్ఘంగా ఉచ్చరించబడుతుంది. ఉచ్చారణ భాగం హల్లుతో ఆగితే అందులోని హల్లు హ్రస్వంగా ఉచ్చరించబడుతుంది. [Saʹlu (సేలు) Salʹlu (సాల్లు)తో పోల్చి చూడండి.] కొంతమంది సహోదరులు బైబిలు చదివే తమ అసైన్మెంట్లకు సిద్ధపడడానికి సొసైటీ యొక్క ఆడియో కేసెట్లను వింటారు.
6 చదివే అసైన్మెంట్ను సిద్ధపడ్డానికి తమ పిల్లలకు తలిదండ్రులు సహాయం చేయగలరు. ఇందులో పిల్లవాడు రిహార్సల్ చేసేటప్పుడు వినడం, తర్వాత మెరుగుపర్చుకునేందుకు అతనికి సహాయకరమైన సలహాలనివ్వడం ఇమిడి ఉంది. అనుమతించబడిన సమయం ప్రాథమిక విషయాలను అన్వయించే క్లుప్త ఉపోద్ఘాతాన్ని, సరైన ముగింపును ఇవ్వడానికి అనుమతినిస్తుంది. అలా విద్యార్థి అప్పటికప్పుడు ప్రసంగించే తన సామర్థ్యాన్ని వృద్ధిచేసుకుంటాడు.
7 కీర్తన రచయిత ప్రార్థనపూర్వకంగా ఇలా అభ్యర్థించాడు: “ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.” (కీర్త. 51:15) దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మనం భాగం వహించడం ఇదే కోరికను తృప్తిపరచడానికి సహాయం చేయవచ్చు.