మన క్రైస్తవ జీవితం
యవనులారా—సేవచేసే గొప్ప అవకాశాన్ని వదులుకోకండి
మీరు ఎప్పటికీ ముసలి వాళ్లు కారని, సాతాను లోకంలో ముసలితనం వల్ల వచ్చే “దుర్దినములు” మీకు ఎప్పటికీ రావని అనుకునే అవకాశం ఉంది. (ప్రసం 12:1) యవనంలో ఉన్నప్పుడు పూర్తికాల సేవ లాంటి ఆధ్యాత్మిక లక్ష్యాల మీద పని చేయడానికి చాలా సమయం ఉంటుంది అని మీరు అనుకోవచ్చా?
కాలవశము చేత అనుకోకుండా అందరికీ జరిగే సంఘటనలను యవనులు కూడా తప్పించుకోలేరు. (ప్రసం 9:11) “రేపేమి సంభవించునో మీకు తెలియదు.” (యాకో 4:14) కాబట్టి మీరు ఆధ్యాత్మిక లక్ష్యాలను అనవసరంగా పక్కన పడేయకండి. సేవ చేయడానికి మీ ముందున్న గొప్ప అవకాశాల్ని ఉపయోగించుకోండి. (1 కొరిం 16:9) ఆ విషయంలో మీకు బాధపడే పరిస్థితి రాదు.
మీరు చేరుకోగల కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలు:
వేరే భాషలో ప్రకటించడం
పయినీరు సేవ
దైవపరిపాలనా పాఠశాలలకు వెళ్లడం
రాజ్యమందిర నిర్మాణ పని
బేతేలు సేవ
ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవ చేయడం