కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 1/8 పేజీలు 26-27
  • క్రీడల్లో పోటీ తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీడల్లో పోటీ తప్పా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీడలు మరియు ఆటల చరిత్ర
  • పోటీ మరీ ఎక్కువ అయినప్పుడు
  • ఒక సమతుల్యమైన దృష్టి
  • క్రీడలను వాటి స్థానంలోనే ఉంచుట
    తేజరిల్లు!—1992
  • క్రీడలకున్న స్థానము
    తేజరిల్లు!—1992
  • ఆటల గురించి నేనేమి తెలుసుకోవాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • నేను క్రీడల జట్టులో చేరాలా?
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 1/8 పేజీలు 26-27

బైబిలు ఉద్దేశము

క్రీడల్లో పోటీ తప్పా?

ఇద్దరు పెద్దమనుషులు ఎండ బాగా కాస్తుండే రోజు పార్కులో కూర్చుని చదరంగం ఆడుతున్నారు. అక్కడికి దగ్గర్లో పిల్లలు అరుస్తూ అటూఇటూ పరిగెడుతూ టాగ్‌ ఆట ఆడుతున్నారు. కొంత దూరంలో, యువకుల గుంపు బాస్కెట్‌బాల్‌ ఆటను ఆనందిస్తుంది. అవును, మనచుట్టూ ఉన్నవారందరు ప్రతిరోజు, యౌవనస్థులు మరియు వృద్ధులు, క్రీడలు ఆటలు ఆడడంలో ఆనందిస్తారు. వారు ఆడుతున్నప్పుడు అనేకమంది తమ శక్తి కొలది ఆడాలని ఎంతో ప్రయత్నిస్తారు. బహుశా మీరు కూడా.

కానీ అటువంటి స్నేహపూర్వకమైన పోటీలు తప్పు అని చెప్పగలమా? గలతీయులు 5:26, NW నందు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహా గురించి అనేకమందికి తెలుసు, అక్కడ ఆయన, క్రైస్తవులు “ఒకరినొకరు పోటీకి రేపక” ఉండవలెనని అన్నాడు. దీని దృష్ట్యా, క్రైస్తవులు ఉల్లాసకరమైన క్రీడలు మరియు ఆటలలో పోటీపడడం అనుచితమా?

సూటిగా చెప్పాలంటే, కాదు. ఎందుకు? ఆ ప్రశ్నకు జవాబిచ్చే ముందు, మనం క్రీడల చరిత్ర మరియు ఆటల చరిత్రను క్లుప్తంగా చూద్దాం.

క్రీడలు మరియు ఆటల చరిత్ర

క్రీడలు మరియు ఆటలలో పాల్గొనడం అనేది ప్రాచీన కాలం నుండి ఉంది మరియు చరిత్రంతటిలో, దేవుని ప్రజల చరిత్రలో కూడా ఒక స్థిరమైన విషయంగా ఉండింది. “బంతి” అనే పదం బైబిలులో కూడా కనిపిస్తుంది. దుష్ట మానవులకు వ్యతిరేకంగా యెహోవా దేవుని ఆక్షేపణలను గురించి చెప్పినప్పుడు, యెషయా 22:18, NW ఇలా అంటుంది: “ఆయన (వారిని) గట్టిగా బంతి వలె చుట్టివేయును.” కొన్ని ఆధునిక బంతులు—గోల్ఫ్‌ బంతులు మరియు బేస్‌బంతులు వంటివి—ఇప్పటికీ పదార్థాలను గట్టిగా చుట్టడం ద్వారానే తయారు చేయబడతాయి. కింగ్‌ జేమ్స్‌ బైబిలు అదే వచనాన్ని ఇలా అనువదిస్తుంది: “ఆయన . . . మిమ్మును బంతి వలె ఎగుర వేయును.” ఈ సామ్యం సంగతంగా ఉండాలంటే బంతులు ఆ కాలంలోని వారిచే ఉపయోగించబడి ఉండాలి.

దానికి తోడు, బైబిలులో పితరుడైన యాకోబు దేవదూతతో మల్లయుద్ధం చేసిన నిదర్శనం ఉంది. కొన్ని గంటలపాటు సాగిన పోరాటం ముగింపుకు రాలేదు కాబట్టి, యాకోబు ముందుగానే కొంత అభ్యాసం చేసి ఈ కౌశల్యాన్ని పొందివుండవచ్చని ఈ వృత్తాంతం తెలియజేస్తున్నట్లు అనిపిస్తుంది. (ఆదికాండము 32:24-26, NW) ఆసక్తికరంగా, కొంతమంది విద్వాంసుల ప్రకారం, యాకోబు మల్లయుద్ధ నియమాలను ఎరిగియున్నట్లు ఈ వృత్తాంతం సూచించగలదు. ఇశ్రాయేలీయులు విలువిద్యలో కూడా పాల్గొని ఉండవచ్చు—అది అభ్యాసం మరియు నిపుణత అవసరమున్న ఇంకొక క్రీడ. (1 సమూయేలు 20:20; విలాపవాక్యములు 3:12) పరుగు అనేది పురాతన కాలంలోని పురుషులు అభ్యాసం మరియు శిక్షణ పొందిన మరొక అథ్లెటిక్‌ ప్రయత్నమై ఉంది.—2 సమూయేలు 18:23-27; 1 దినవృత్తాంతములు 12:8.

మనస్సును నిమగ్నమైవుండేలా చేసే ఆటలు—విప్పుడు కథలు ప్రతిపాదించడం వంటివి—స్పష్టంగా ప్రసిద్ధమైనవి మరియు గొప్పగా ఎంచబడేవి. బహుశా దీనికి అతి విశిష్టమైన ఉదాహరణ సమ్సోను ఫిలిష్తీయులకు ఒక విప్పుడు కథ ప్రతిపాదించడమే.—న్యాయాధిపతులు 14:12-18.

క్రైస్తవ గ్రీకు లేఖనాలలో, క్రీడలు మరియు ఆటలు కొన్నిసార్లు క్రైస్తవ జీవనానికి రూపకాలంకారాలుగా ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, 1 కొరింథీయులు 9:24, 25 నందు పౌలు ఒక అథ్లెట్‌ యొక్క కఠిన శిక్షణా క్రమపాలనను ఉదాహరిస్తూ దానిని క్రైస్తవుని ఆశానిగ్రహము మరియు సహనాల అవసరతకు అన్వయించాడు. మానవునికి మరియు మృగానికి ఆడుకునేందుకు సమయం దొరికేలా తన సృష్టిలో చాలా మట్టుకు ఆటలాడే స్వభావాన్ని యెహోవా చేర్చాడని స్పష్టంగా ఉంది.—యోబు 40:20; జెకర్యా 8:5; హెబ్రీయులు 12:1, పోల్చండి.

పోటీ మరీ ఎక్కువ అయినప్పుడు

అయితే, “ఒకరినొకరు పోటీకి రేపక” ఉండవలెనని అపొస్తలుడైన పౌలు వారితో చెప్పినప్పుడు తోటి క్రైస్తవులతో ఆయన ఏమి చెబుతున్నాడు? (గలతీయులు 5:26, NW) ఆ సందర్భమే జవాబిస్తుంది. పౌలు ఈ మాటలకు ముందుమాటగా “అహంకారులుగా,” లేక ఇతర బైబిలు అనువాదాలు పెట్టిన పదాలలో చెప్పాలంటే, “గర్వ”పడేవారిగా, “విఱ్ఱవీగు”వారిగా, “అత్యంతాహంభావ అభిలాష”గలవారిగా, ఉండొద్దని చెప్పాడు. పౌలు కాలంలో అథ్లెట్లు ఖ్యాతి మరియు మహిమల వెంబడిపడడమనేది ప్రబలివుంది.

అదేవిధంగా నేటి అత్యంతాహంభావ లోకంలో కూడా, అనేకమంది క్రీడాకారులు ఆడంబరం కనపర్చడం మరియు తమ వైపు, తమ నైపుణ్యాల వైపు అవధానాన్ని ఆకర్షించడం వంటి వాటికి పాల్పడుతున్నారు. కొంతమంది ఇతరులను హీనంగా చూడడం కూడా మొదలుపెడతారు. ఇతరులను దూషించడం, వేలెత్తి చూపడం, మాటలతో అవమానపరచడం, లేక కొంతమంది క్రీడాకారులు పిలిచినట్లు “చెత్త వాగుడు,” వంటివి త్వరితంగా ప్రమాణాలుగా అయిపోతున్నాయి. ఇదంతా కూడా “పోటీకి రేప”డమే. ఇది గలతీయులు 5:26 ఆఖరి భాగంలో పౌలు సూచించిన ఈర్ష్యకు నడుపుతుంది.

సమతుల్యతలేని పోటీ అన్నిటికంటే ఘోరంగా, పోరాటాలకు ఆఖరికి మరణానికి కూడా నడపగలదు. సౌలు మనుష్యులు మరియు దావీదు మనుష్యులు గిబియోను వద్ద కలిసినప్పుడు అబ్నేరు మరియు యోవాబు “యువకులు ముందుకు వచ్చి [వారి] ముందు క్రీడించ”నిచ్చుటకు ఒప్పుకొనినప్పటి సందర్భమును పరిశీలించండి. (2 సమూయేలు 2:14-32, తనఖ్‌) ఇది బహుశ మల్లయుద్ధం పోటీలవంటి దేన్నైనా సూచిస్తుండవచ్చు. పోటీ ఏదైనా, అది తొందర్లోనే ఘోరమైన రక్తపాతంతో కూడిన యుద్ధంగా దిగజారింది.

ఒక సమతుల్యమైన దృష్టి

క్రీడలు మరియు ఆటలు సేదదీర్పుగా ఉండాలి—కృంగుదలగా ఉండకూడదు. విషయాలను దృష్టిలో ఉంచుకొని, క్రీడలు లేక ఆటలలో మన నైపుణ్యతకు, దేవుని మరియు మానవుని దృష్టిలో మన విలువతో ఏమాత్రం సంబంధం లేదని గుర్తుంచుకుంటూ, మనం దీన్ని సాధించగలం.

శారీరక లేక మానసిక సామర్థ్యాల మూలంగా మనమే ఉన్నతులమనే భావాలు ఉప్పొంగేందుకు అనుమతించడం మూర్ఖత్వమౌతుంది. మనం ఇతరులలో ఈర్ష్యను రేపకుండా ఉండేందుకు మనం అనుచితంగా మన వైపు అవధానాన్ని ఆకర్షించడం మానుకొందము; ఎందుకంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. (1 కొరింథీయులు 13:4; 1 పేతురు 2:1) ఉత్సాహం, ఉత్తేజం బయటపడడం మరియు జట్టు సభ్యుల మధ్య అభినందనలు అపేక్షించడం సహేతుకమే అయినా, ఈ భావాలు అదుపు తప్పి డాబైన ప్రదర్శనలకు నడపాలని మనం కోరుకోము.

క్రీడలు మరియు ఆటలలో వారి సామర్థ్యాలను బట్టి ఇతరుల విలువను మనం ఎప్పటికీ కొలవము. అదేవిధంగా, నైపుణ్యం లోపించడం వలన మనలను మనం తక్కువ అంచనా వేయడానికి ఇష్టపడము. అంటే ఫలితాలను లెక్కించడం తప్పు అని దాని అర్థమా? అలా కానవసరం లేదు? కానీ ఏ ఆటైనా నిజానికి ఎంత నిరర్థకమైనదో మనం గుర్తుంచుకోవాలి—ప్రజల నిజమైన విలువ వారెంత బాగా ప్రదర్శిస్తారో అన్నదానిపై ఆధారపడివుండదు. జట్లు కలిసి ఆడే ఆటలలో, ఒకే జట్టు ప్రతీసారీ గెలవకుండా ఉండేందుకు కొన్ని జట్లు క్రమంగా తమ జట్టులోని ఆటగాళ్ళను మార్చుకుంటాయి.

బైబిలులో క్రీడలు మరియు ఆటలు పేర్కొనబడినప్పటికీ అవి చాలా మితముగా పేర్కొనబడ్డాయని క్రైస్తవులు మనస్సులో పెట్టుకోవాలి. బైబిలులో క్రీడలు కేవలం పేర్కొనబడడం క్రీడలన్నింటికీ స్పష్టమైన ఆమోదాన్ని స్థాపిస్తుందనే ముగింపుకు రావడం పొరపాటు అవుతుంది. (కీర్తన 11:5తో 1 కొరింథీయులు 9:26ను పోల్చండి.) ఇంకా పౌలు, “శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి . . . అన్ని విషయములలో ప్రయోజనకరమవును” అని గమనించాడు.—1 తిమోతి 4:8.

కాబట్టి వాటి యుక్తమైన స్థానంలో, క్రీడలు మరియు ఆటలు ఆనందకరంగా మరియు సేదదీర్పుగా ఉంటాయి. బైబిలు పోటీని ఖండిస్తుంది కానీ అన్ని విధాలైన పోటీలను ఖండించడంలేదు, కానీ దురభిమానాన్ని, విరోధాన్ని, లోభాన్ని, ఈర్ష్య లేక హింసను రేపే పోటీని ఖండిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి