కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 2/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • భూదిగంతముల వరకూ దేవుని జ్ఞానాన్ని తీసుకువెళ్లడం
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 2/8 పేజీ 30

మా పాఠకుల నుండి

చిన్నతనంలో పెళ్ళి “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . మరీ తొందరగా పెళ్ళి చేసుకున్నాం—మేము సఫలీకృతులమవ్వగలమా?” (మే 8, 1995) అనే శీర్షికనుబట్టి మీకు కృతజ్ఞతలు. సంఘాధ్యక్షులుగా మేము వైవాహిక సమస్య కలిగివున్న ఒక యౌవన దంపతుల వద్దకు కాపరి సందర్శనానికి ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంచిక వచ్చినప్పుడు నాకెంత ఆశ్చర్యం కలిగిందో! ఆ యౌవన దంపతులకు సహాయపడేందుకు మాకు కావలసింది అదే. మేము ఉదాహరించబడిన లేఖనాలన్నింటితో సహా శీర్షికనంతా పరిశీలించాము.

ఎమ్‌. సి., బ్రెజిల్‌

సముద్రాంతర్భాగ అన్వేషణ “తరంగాల క్రింద ఉన్న ప్రపంచాన్ని సురక్షితంగా అన్వేషించుట” అనే శీర్షికను మేమెంతో మెచ్చుకున్నాము. (మే 8, 1995) ఎర్ర సముద్రానికి వెళ్ళి మేమిప్పుడే ఇంటికి తిరిగి వచ్చాము, మరి మీ సలహా చాలా ఉపయుక్తంగా ఉన్నట్లు కనుగొన్నాము. అద్భుతమైన సముద్రపు అడుగు భాగాన్ని అన్వేషించడమే కాకుండా మేమెంతో డబ్బును కూడా ఆదా చేశాము!

వి. సి. మరియు కె. బి., ఇటలీ

మా ఇద్దరు కుమారుల విరామ సమయాల్లోని కార్యకలాపాల విషయంలో నాకు నాభర్తకు అప్పుడప్పుడు సమస్యలు వచ్చేవి. నా భర్తకు డైవింగ్‌నందు ఆసక్తి ఉంది, మరి మా ప్రాంతంలో క్రొత్త డైవింగ్‌ పాఠశాల ప్రారంభమైంది. మీ శీర్షికను చదివిన తరువాత, వారు పాల్గొన్నప్పుడు, నేను మంచి మనస్సాక్షి కలిగివుండగలనని సంతోషిస్తున్నాను.

సి. పి., జర్మనీ

పొగాకు పరిశ్రమ “లక్షలను గడించడానికి లక్షలాదిమందిని చంపడం” శీర్షికల (జూన్‌ 8, 1995) పరంపర ఉపదేశాత్మకంగాను, విశదంగాను ఉంది. విన్సెట్‌ వాన్‌ గోగ్‌ చిత్రించిన (“సిగరెట్టుతో కపాలం”) ముఖపత్రంపైని చిత్రం ఒళ్ళు జలదరించేలా ఉంది! బహుశ, కొంతమంది ప్రజలు పొగత్రాగడాన్ని ఆపడానికి లేక మొదలెట్టడం నుండి కొంతమందిని కనీసం నిరుత్సాహపరచడానికి కేవలం ఈ చిత్రం సరిపోతుంది.

ఎమ్‌. బి., అమెరికా

నేను అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ కొరకు పనిచేస్తుండడంవలన, ఈ శీర్షికలు చదవడానికి నేను ఉత్తేజపరచబడ్డాను. నేను ఒక ప్రతిని ఒక పొగాకు-రహిత కూటమియొక్క స్థానిక శాఖ అధ్యక్షస్థానంలో ఉన్న ఒక స్త్రీకి పంపాను. ఆ రచనా శ్రేష్ఠత మరియు పరిశోధననుబట్టి ఆమె ప్రభావితురాలై తన తోటి ఉద్యోగులకొరకు 35 ప్రతులను కోరింది.

జె. ఓ., అమెరికా

నేను నా భర్త పొగత్రాగడాన్ని మూడు నెలల క్రిందటే విడిచిపెట్టాము, కానీ సిగరెట్లయెడల నాకింకా వాంఛ ఉంది. అప్పుడు నేనీ శీర్షిక చదివాను, సిగరెట్టులోని కొన్ని పదార్థాలు ఎంత విషపూరితమంటే వాటిని భూమిలో కప్పివేయడం కూడా చట్టవిరుద్ధమని నేను తెలుసుకునేలా ఇది చేసింది! నేను చెడును అసహ్యించుకోవడానికి ఇది బలపరచింది.

ఎల్‌. టి., దక్షిణ ఆఫ్రికా

లూపస్‌ బాధితురాలు “ఇప్పుడు మియా మరియు యెహోవా మాత్రమే” అనే శీర్షికలో లూపస్‌ గురించిన సమాచారానికి చాలా కృతజ్ఞతలు. (మార్చి 8, 1995) నా వయస్సు 18 సంవత్సరాలు, దాదాపు రెండు సంవత్సరాలనుండి నేను ఈ జబ్బువలన బాధపడుతున్నాను, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ఇతర సహోదర సహోదరీలు బాధను ఎలా సహిస్తున్నారో తెలుసుకోవడం, మన సృష్టికర్త మనల్ని ఎలా ప్రేమపూర్వకంగా బలపరుస్తాడో చూడడం ప్రోత్సాహకరంగా ఉంది.

జె. ఎ. వై., ఇటలీ

వ్యవహరింపశక్యంకాని తలిదండ్రులు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా తండ్రి [లేక తల్లి] విఫలుడైనప్పటి విషయమేమిటి?” (జూన్‌ 8, 1995) వంటి శీర్షిక కొరకు నేను ప్రార్థించాను. క్రైస్తవ సంఘంనుండి నా తల్లి బహిష్కరించబడినప్పుడు నేనెంత దుఃఖించాను, ఎంత బాధపడ్డాను! నేను పయినీరింగును, పూర్తికాల సువార్తపనిని దాదాపు విడిచిపెట్టాను. యెహోవాతో అమ్మకున్న సంబంధాన్నిగురించి ఎక్కువగా కలతచెందే బదులు ‘భయముతోను వణకుతోను నా సొంతరక్షణను కొనసాగించుకొనుటకు’ ఆ శీర్షిక నన్ను బలపరచింది. (ఫిలిప్పీయులు 2:12) మీకెంతో కృతజ్ఞతలు.

జె. పి., ఫిలిప్పీన్స్‌

నేను బాప్తిస్మంపొందిన క్రైస్తవురాలిని, కానీ ప్రతిరోజు తాగి ఇంటికివచ్చే నా తండ్రిని గౌరవించడం ఎంతో కష్టంగా ఉన్నట్లు నేను కనుగొన్నాను. ఈ శీర్షికను చదివేటప్పుడు నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. ఇప్పుడు, నేనిది చదివాను గనుక, నా తండ్రియెడల ప్రతికూల భావాలు, ఆలోచనలు గణనీయంగా తగ్గిపోయాయి, మరి నేను లోలోపల బాగా స్థిమితపడినట్లు భావిస్తున్నాను.

ఎన్‌. ఎమ్‌., జపాన్‌

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి