కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/89 పేజీ 4
  • సువార్తనందించుట—ఒప్పించుటతో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సువార్తనందించుట—ఒప్పించుటతో
  • మన రాజ్య పరిచర్య—1989
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివేకముగా నుండుము
  • ఉపమానములను ఉపయోగించుము
  • ఒప్పించడమనే కళతో హృదయాలను చేరడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఇతరులను ఎలా ఒప్పింపచేయాలి?
    మన రాజ్య పరిచర్య—2001
  • రాజ్య సందేశాన్ని అంగీకరించడానికి ఇతరులకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీ బోధ ఒప్పించేలా ఉండాలి
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1989
km 7/89 పేజీ 4

సువార్తనందించుట​—ఒప్పించుటతో

1 సత్యమును అంగీకరించుమని ప్రజలను వెంబడించుట సువార్తయొక్క పరిచారకులకు తగునా? అవును తప్పక! (అపొ. కా. 18:4) తిమోతి కూడ అతని తల్లి మరియు అవ్వచే ఒప్పించబడి ఒక విశ్వాసి అయ్యెను. (2 తిమో. 3:14) ఒకరిని ఒప్పించుట అనగా, ఒక నమ్మకము, ఒక స్థానము లేక ఒక క్రియ చేయుటకు సంబంధించి వేడుకొనుటచే, లేక యథార్థముగా కారణ సహితముగా మాట్లాడుటచే ఒప్పించుట.

2 ఈ ఒప్పించుటలోని మంచి నైపుణ్యమును పౌలు ఉపయోగించుకొనెను. ఆయన ఏథెన్స్‌లో ఉన్నప్పుడు, “ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేక పోయెను.” (అపొ. కా. 17:16) అయినప్పటికి అరియో పాగస్‌ మధ్య నిలబడినపుడు, వారి ఆరాధన వ్యర్థము అని సూటిగా లేక మొరటుగా చెప్పలేదు. కఠినమైన ఉద్రేకముతో కూడిన సంభాషణను తొలగించి వారి శ్రద్ధను, “తెలియబడని దేవునికి” అని చెక్కబడిన ఒక బలిపీఠమువైపు మళ్లించెను.​—అ.కా. 17:23, 28, 29, 34.

వివేకముగా నుండుము

3 ఒప్పించుట అనగా, ఉద్రేకంగా అందించుట లేక మాట్లాడుట లేక ఎక్కువ మాటలు మాట్లాడుటకంటే మించినదని పౌలు స్పష్టముగా ప్రదర్శించెను. లోతైన ఆలోచన కలిగి ప్రజల భావములు, నమ్మకములు మరియు వారికాసక్తికరమైన వాటిని గూర్చి మంచి వివేకమును కలిగియుండవలెను. బైబిల్‌ సత్యములను ఉన్నది ఉన్నట్టుగా గ్రహించు ఆ ఇంటివారి మనస్సునకు వారి ఉద్రేకమే అడ్డుగోడగా ఉన్నప్పుడు దానిని గ్రహించుటకు చురుకుగాను మరియు వేగముగాను ఉండవలెను.​—సామె. 16:23.

4 ఉదా: ఒక వ్యక్తి తాను ప్రేమించుచున్న ఒక మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపకమునకు మూఢనమ్మకపు సంబంధమును కలిగియుండుటనుబట్టి ఆత్మ అమర్త్యమైనదని నమ్ముచుండవచ్చును. సత్యమును బోధించి అతనికి సహాయపడుటకు ఒప్పించు మార్గమేది? అతని ఉద్దేశము తప్పని, ఆత్మ చనిపోతుందని సూటిగా చెప్పుటకు బదులు, అతని ఉద్రేకపూరితమైన ఆ అడ్డుగోడను తొలగించుటకు ఒక మంచి ఒప్పించు మార్గమునుపయోగించి అతనితో కారణ సహితముగా మాట్లాడుట మంచిది కాదా? అతని బాధను లేక భావములను మనము అర్థము చేసికొనగలమనియు, మనము కూడ మరణించిన ప్రియులను కలిగియున్నామనియు చెప్పవచ్చు. పునరుత్థానము యొక్క వాగ్దానముచే మనము ఓదార్పునొందుచున్నాము. అనగా మనము మరణించిన మన ప్రియులను మరల కలిసికొని వారి సహవాసమును మరల ఆనందించు సమయము. అప్పుడు తగిన లేఖనములను చదివి తర్కించుము. మనము వివేకమును చూపి మన సంభాషణకు ఉప్పు చేర్చినట్లయిన సువార్తను గూర్చి ఒప్పించువారమగుదుము.​—సామె. 16:21; కొలొ. 4:6.

ఉపమానములను ఉపయోగించుము

5 వారి ఆలోచనలను సవరించుటకు ఉపమానములు బాగుగా ఒప్పించుటకు సహాయపడును. ఈ విషయములో గమనింపదగిన మంచి ఉదాహరణ నాతాను దావీదు హృదయమును వివేకముగా చేరుట. (2 సమూ. 12:1-14) బాగుగా ఎన్నిక చేయబడిన ఉపమానములు జ్ఞానముతో కూడిన వివరణకు భావోద్రేక సంయోగమును చేర్చును. అవి క్రొత్త ఆలోచనలను, సులభముగా అంగీకరించునట్లు చేయును. ఉదా: భూమి ఒక గృహముగాను ప్రజలు అద్దెకుండు వారిగాను పోల్చవచ్చు. అద్దెకుండువారు ఇంటిని పాడుచేస్తున్నట్లయిన యజమాని ఆ ఇంటిని నాశనము చేయడుకాని వారిని ఖాళీ చేయించును. కనుక దేవుడు భూమిని నాశనము చేయడుకాని చెడ్డవారిని ఆయన తీసివేయును.​—యెష. 45:18.

6 ఒప్పించుట కూడ పరిమితి గలదే. ప్రజలు నమ్ముటకు ఇష్టపడక పోతే లేక వారు తమ జీవితములలో మార్పునొల్లకపోతే వారు అట్లే ఉండెదరు. (మత్త. 13:14, 15) అయినను సువార్తను స్వీకరించు యథార్థ హృదయులు అనేక మంది ఉన్నారు. వారికి సహాయపడుటకు, మన పరిచర్య అభివృద్ధి చేసికొనుటకు మరియు ఒప్పించుటలో నైపుణ్యమునుపయోగించుటకు మనము చేయదగిన ప్రయత్నములన్నింటిని చేయుదము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి