కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/90 పేజీ 4
  • సువార్తనందించుట—వివేకముతో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సువార్తనందించుట—వివేకముతో
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యింటివారిని అర్థము చేసుకొనుట
  • మీ అందింపును తగినవిధముగా మలచుట
  • జీవాన్ని కాపాడే మన పరిచర్యలో విజయవంతంగా పాల్గొనుట
    మన రాజ్య పరిచర్య—1993
  • దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకోవడానికి ఇతరులకు సహాయపడండి
    మన రాజ్య పరిచర్య—1993
  • ప్రతిపాదనను పరిస్థితికి అనుగుణంగా మలచుకోవడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించడం
    మన రాజ్య పరిచర్య—2005
  • హృదయపూర్వకంగా వివేచననభ్యసించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 4/90 పేజీ 4

సువార్తనందించుట—వివేకముతో

1 విభిన్నమైన నమ్మకము జీవితవిధానములుగల ప్రజలకు సువార్తనందించునప్పుడు వివేకమునుపయోగించు అవసరతను అపొస్తలుడైన పౌలు నొక్కితెల్పెను. మన దినములలో కొందరు ఆత్మీయ విషయములయందు యిష్టములేనివారై ఆత్మీయ విలువలను మెచ్చుకొనరు. అయితే సువార్త ప్రచారకులుగా వివేకమునుపయోగిస్తూ, రాజ్యవర్తమానమును “అన్ని విధములైన ప్రజలకు” ప్రీతికరమైనదిగా చేయవలెను.​—1 కొరిం. 9:19-23.

యింటివారిని అర్థము చేసుకొనుట

2 ప్రాంతీయసేవలో ఆచరణయోగ్యముగా దీనిని అన్వయించుటయందు యింటివారి ఆసక్తికి అనుగుణ్యముగా మన అందింపును చేపట్టగల సామర్థ్యము యిమిడియున్నది. దీనికి మంచి సిద్ధపాటు అవసరము. మనకు లభ్యమగు పుస్తకములు పత్రికలలో పరిశీలించబడిన అనేక రకములైన అంశములతో బాగుగా పరిచయము కలిగియుండుటద్వారా, రకరకములైన మాట్లాడు అంశములతో సువార్తను అందించుటకు ప్రచారకుడు సిద్ధముగా యుండగలడు. పెద్దవారితో, యౌవనులతో, కుటుంబయజమానులతో, గృహిణులతో, పనిచేయు స్థలమందలి స్త్రీలతో, మరియు ఇతరులతో మాట్లాడునప్పుడు అందించు సమాచారమును ఎన్నుకొనుటలో వారి వ్యక్తిగత పరిస్థితులను గమనించవలసినవారమై యున్నాము.

3 మీరు యింటివారిని సమీపించుకొలది, చుట్టూరయున్నవాటిని గమనించుటలో మెలుకువతో యుండుము. తద్వారా యింటివారు తండ్రి లేక తల్లియా, ఎటువంటి మత విధానమును కలిగియున్నారు. గృహముయెడల ఎక్కువ శ్రద్ధ కలిగియున్నారా అనువాటిని నీవు గ్రహించవచ్చును. ఈ సమాచారముతో నీ ఉపోద్ఘాతమును యింటివారి పరిస్థితులకు మరియు ఆసక్తులకు తగినట్టు మార్చుకొనవచ్చును. ఉపాయము, తెలివితోకూడిన ప్రశ్నలు మరియు వ్యక్తియొక్క వ్యాఖ్యానములను జాగ్రత్తగా వినుటద్వారా, వారియొక్క నమ్మకములను భావములను గ్రహించి ఆ తర్వాత నీ అందింపును కొనసాగించుటకు శ్రేష్టమైన పద్ధతిని నిర్ణయించుకొనుము.

మీ అందింపును తగినవిధముగా మలచుట

4 యింటిని సమీపించినప్పుడు బొమ్మలను లేక పిల్లలను మీరు గమనించినట్లయిన, ప్రస్తుత సంభాషణా అంశమును యిలా ప్రారంభించవచ్చును: “ఈ ప్రాంతములోని తల్లిదండ్రులతో వారు తమ పిల్లలకు అందించు నడిపింపు మార్గములను గూర్చి మేము మాట్లాడుచున్నాము. పాఠశాల విధానములో పిల్లలకు లోపించియున్న నైతిక నడిపింపును గూర్చి అనేకమంది తల్లిదండ్రులు చింత కలిగియున్నారు. ఈ నడిపింపుల విషయములలో ఏదైన సమస్యను మీరు గమనించారా?” యింటివారి జవాబును వినుము. ఆ జవాబు యింటివారూ మతపరమైన ఆధారమును కలిగియున్నట్లు సూచించిన ఇట్లు కొనసాగవచ్చును: “మనము మన పిల్లలు తెలివిగల నడిపింపును పొందు అవసరతను బైబిలు సూచించుచున్నదనుట చాలా ఆసక్తికరమైనది. ఇచ్చట సామెతలు 14:12 లో ఏమి చెప్పబడియున్నదో గమనించుము.” ఆ లేఖనము చదివిన తరువాత యిలా చెప్పవచ్చును: “నేను ఇటీవలెనే బైబిలు సలహా ఎంత ఆచరణయోగ్యమైనదో తెలుపు ఒకదానిని చదువుచున్నాను.” సర్‌వైవల్‌ పుస్తకములో 30వ పేజీని త్రిప్పి బొమ్మను చూపుము. 37వ పేజీలోని చివరి రెండు వాక్యములను చదివి ముగించుము. సాహిత్యమును 10 రూ. అందించుము.

5 యింటివారి జవాబు వారు ఇంకొక పవిత్రగ్రంథమును అనుసరించుచున్నట్లు సూచించినట్లయిన మీ అందింపును ఈ విధముగా మలచుటద్వారా వివేకమును చూపవచ్చును: “ఒకరి మతసంబంధమైన నమ్మకము ఎలాగున్నను, సరైన ఆలోచనగల ప్రజలందరు ప్రస్తుత అసంతృప్తికర లోకస్థానమందు శ్రేష్టమైన మరొకదానిని చూడవలెనని ఆశించుదురు. అట్టి నిరీక్షణనుగూర్చి ఈ సాహిత్యమేమి చెప్పుచున్నదో వినుము.” 7వ అధ్యాయమందలి 1-3 పేరాలలోని అంశములను ఉపయోగించుము. ఇంకా 24వ అధ్యాయము పేరా 5 లేక 14 పుస్తకమును 10 రూ. అందించుము.

6 మనము బాగుగా సిద్ధపడి యెహోవా సేవలో వివేకమును చూపుకొలది, “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను” అని అపొస్తలుడైన పౌలు చెప్పినట్లే మనమును చెప్పగలవారమగుదుము.​—1 కొరిం. 9:22; సామె. 19:8.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి