ప్రశ్నాభాగము
• బ్రూక్లిన్ బేతేలు, వాచ్‌టవర్ ఫామ్స్ మరియు ప్రపంచమంతటనున్న బ్రాంచి కార్యాలయాలను సందర్శించునప్పుడు మనమెందుకు మన దుస్తులు, కేశాలంకరణ విషయములో ప్రత్యేక శ్రద్ధవహించాలి?
క్రైస్తవులు సభ్యతగల రీతిలో ఉండాలి. మన దుస్తులు కేశాలంకరణ అన్నివేళల యెహోవా దేవుని దాసులకు తగినట్లుగా మర్యాద, గంభీరతను ప్రతిబింబించేదిగా ఉండాలి. ఇది ప్రత్యేకంగా బ్రూక్లిన్ బేతేలును, వాచ్‌టవర్ ఫామ్స్‌ను, ప్రపంచమంతటనున్న బ్రాంచి కార్యాలయాలను సందర్శించునపుడు ఎంతో ప్రాధాన్యతను కలిగియున్నది. సరైన దుస్తులు కేశాలంకరణ ప్రాముఖ్యతనుగూర్చి ఆర్గనైజ్‌డ్ టు అకంప్లిష్ అవర్ మినిస్ట్రీ అనే పుస్తకము వ్యాఖ్యానిస్తూ, ఇంటింటి సేవలో పాల్గొనునపుడు, క్రైస్తవ కూటముల హాజరగునపుడు శరీర శుభ్రత, నమ్రతగల దుస్తులు, కేశాలంకరణ ఉండాలని తెలిపింది. మరియు 131వ పేజీ రెండవ పేరాలో ఇలా వుంది. “బ్రూక్లిన్ బేతేలు గృహాన్నిగాని సొసైటి కార్యాలయాల్లో దేనినైనను సందర్శించునపుడు ఇదే సూత్రము వర్తిస్తుంది. జ్ఞాపకముంచుకోండి. బేతేలు అనగా ‘దేవుని గృహము,’ కాబట్టి రాజ్యమందిరములో ఆరాధన కూటములకు హాజరగునప్పుడు మనమెలా ఉండవలెనో ఆలాగే ఇక్కడ కూడా మన దుస్తులు, కేశాలంకరణ, ప్రవర్తన ఉండాలి.”
మనము “లోకమునకు దేవదూతలకు మనుష్యులకు వేడుకగా ఉన్నామని” అపొ. పౌలు అన్నాడు. (1 కొరిం. 4:9) అందుచేత మన దుస్తులు కేశాలంకరణ ఎలా ఉండాలంటే యెహోవా సత్యారాధనను గమనించు ఇతరులు దాని విషయములో ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలగాలి. అయినను గమనించిన విషయమేమంటే సొసైటి బ్రాంచి కార్యాలయాలను సందర్శించునపుడు కొందరు సహోదరీ సహోదరులు వారు ధరించే దుస్తుల విషయములో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. బ్రాంచి కార్యాలయాన్ని దర్శించే సమయాల్లో అటువంటి దుస్తులు ధరించుట యుక్తము కాదు. మన క్రైస్తవ జీవితములోని ఇతర విషయములవలెనే ఈ విషయములో కూడా దేవుని ప్రజలమైన మనము లోకస్థులకంటె ప్రత్యేకంగా ఉన్నామని రుజువు చేసుకొంటూ దేవుని మహిమర్థమై ఉన్నతమైన నీతినియమాలను పాటించాలి. (రోమా. 12:2; 1 కొరిం. 10:31) బ్రూక్లిన్ బేతేలునుగాని సొసైటి బ్రాంచి కార్యాలయాలనుగాని మొదటిసారిగా సందర్శించు మన బైబిలు విద్యార్థులకు, యితరులకు వారి సరైన వేషధారణను గురించి మాట్లాడి వివరంగా తెలియజేయుట మంచిది.
గనుక సొసైటి కార్యాలయాలను సందర్శించేటప్పుడు మిమ్ములను మీరే ఇలా ప్రశ్నించుకోండి: ‘నా వేషధారణ తగిన విధంగా ఉన్నదా? (మీకా 6:8) నేనారాధించే దేవుని ప్రతిబింబించేదిగా ఉన్నాదా? నా వేషధారణ చూచి ఇతరులు తొట్రిల్లుదురా? లేదా బాధపడెదరా? మొదటిసారిగా సందర్శించే వారికి నేను మంచి మాదిరిని చూపిస్తున్నానా?’ మనమెల్లప్పుడు మన దుస్తులు కేశాలంకరణతో “అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించు” కొందుము గాక!—తీతు 2:10.