కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/02 పేజీ 2
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—1998
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2008
  • మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉండాలి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 6/02 పేజీ 2

ప్రశ్నా భాగం

◼ బేతేలు గృహాలను, బ్రాంచి కార్యాలయాలను సందర్శించేటప్పుడు, వస్త్రధారణకు, కేశాలంకరణకు సంబంధించిన ఏ ప్రమాణాలను మనం పాటించాలి?

మనం బేతేలును సందర్శించేటప్పుడు, అది బ్రాంచిని పర్యటించి చూడడానికి కానివ్వండి లేక బేతేలు కుటుంబంలోని సభ్యులను సందర్శించడానికి కానివ్వండి, “మనం ఆరాధనకై రాజ్యమందిరానికి హాజరగునపుడు తయారయినట్లే, అక్కడికి వెళ్లునపుడు దానికి తగినట్లుగా తలదువ్వుకొని, దుస్తులు ధరించి, మంచి ప్రవర్తన కలిగివుండాలి.” (om 131వ పేజీ) అయితే, కొంతమంది సహోదర సహోదరీలు బ్రాంచి కార్యాలయాలను సందర్శించేటప్పుడు తమ దుస్తుల విషయంలో చాలా అశ్రద్ధగా ఉండడానికి మొగ్గు చూపుతున్నట్లు గమనించడం జరిగింది. ఈ కార్యాలయాలను సందర్శించేటప్పుడు అలా చేయడం తగినది కాదు. మన రూపం యెహోవా దేవుని సేవకులకు తగిన మర్యాదను, హుందాతనాన్ని ప్రతిబింబించే విధంగా మాదిరికరంగాను గౌరవప్రదంగాను నిరాడంబరంగాను ఉండాలి.​—1 తిమో. 2:9, 10.

ప్రత్యేకించి బేతేలు గృహాలను, బ్రాంచి కార్యాలయాలను సందర్శించేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే అలా సందర్శించేవారిని సాక్షులు కానివారు ఎంతోమంది గమనిస్తూ ఉంటారు. అలాంటివారు తాము చూసినదాన్ని బట్టి దేవుని ప్రజల గురించి, ఆయన సంస్థ గురించి అభిప్రాయాలను ఏర్పర్చుకోవచ్చు. మర్యాదకరమైన వస్త్రధారణకు, కేశాలంకరణకు అవధానమివ్వవలసిన ప్రాముఖ్యతను గుర్తుచేయడానికి బైబిలు విద్యార్థులతో, సందర్శించబోయే ఇతరులతో ముందుగా మాట్లాడడం సముచితం. మీరు అలా చేస్తే బేతేలు కుటుంబం ఆనందిస్తుంది.

క్రైస్తవ పరిచారకులముగా మనం, మన రూపం ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. (2 కొరిం. 6:3, 8) మర్యాదకరమైన మన ప్రవర్తనతో, ఎల్లప్పుడూ “అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు” ఉందుము గాక!​—తీతు 2:9, 10.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి