కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/08 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—1998
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2002
  • మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉండాలి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 3/08 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ యెహోవా సేవకోసం ఉపయోగించబడే వివిధ స్థలాలను చూడడానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యమందిరాలు, సమావేశ హాళ్ళు, బెతెల్‌ గృహాలు, బ్రాంచి సౌకర్యాలు వంటివి యెహోవా సేవకు సమర్పించబడిన ప్రత్యేక స్థలాలు. గౌరవభావం ఉట్టిపడేలా అవి నిరాడంబరంగా, పరిశుభ్రంగా, తీరైనరీతిలో ఉంటాయి. సాతాను విధానంలో ఉన్నవాటికి వీటికి తరచూ ఎంతో తేడావుంటుంది. యెహోవా సేవకు ఉపయోగించే స్థలాలను చూడడానికి వచ్చేవారు తాము యెహోవా ప్రజలుగా, ఆయన చిత్తం చేస్తున్నవారిగా కనబడాలి.

క్రైస్తవులముగా మనం తగుమాత్రపు వస్త్రధారణ, కనబడేతీరుతో సహా అన్ని విధాల్లోనూ, ‘దేవుని సేవకులమని రుజువుచేసుకుంటున్నాము.’ (2 కొరిం. 6:4, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మనం చక్కగా ప్రవర్తించడమే కాక, అన్ని సమయాల్లోనూ మన వస్త్రధారణ, కనబడేతీరు యెహోవా దేవుని సేవకులకు తగినట్లుగా గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా మనం, ప్రధానకార్యాలయ వసతులను గానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచి కార్యాలయాలను గానీ చూడడానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన గౌరవప్రదంగా ఉండాలి.

యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకం సరైన వస్త్రధారణ, కనబడేతీరు యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చిస్తూ, క్షేత్రపరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నప్పుడు పాటించవలసిన శారీరక పరిశుభ్రత గురించి, మర్యాదకరమైన దుస్తులు, సరైన కేశాలంకరణ వంటివాటి గురించి వ్యాఖ్యానించింది. ఆ పుస్తకంలోని 138వ పేజీ, 3వ పేరా ఇలా తెలియజేస్తోంది: “బెతెల్‌ అంటే ‘దేవుని గృహము’ అని గుర్తుంచుకోండి. కాబట్టి, రాజ్యమందిరంలో ఆరాధన కోసం కూడుకునేటప్పుడు మన వస్త్రధారణ, కనబడే తీరు, మన ప్రవర్తన ఎలా ఉండాలో, బెతెల్‌ గృహాన్ని సందర్శించేటప్పుడు కూడా అలాగే ఉండాలని ఆశించబడుతుంది.” స్థానికంగావున్న రాజ్య ప్రచారకులైనా లేదా దూరప్రాంతాల వారైనా బెతెల్‌ను చూడడానికి వెళ్తున్నప్పుడు ఈ ఉన్నత ప్రమాణాన్ని అనుసరించాలి. ఇలా చేయడంద్వారా సందర్శకులు సరైన మెప్పును, గౌరవాన్ని చూపించినవారౌతారు.—కీర్త. 29:2.

మన దుస్తులు “దైవభక్తిగలవారమని చెప్పుకొనే” వారికి తగినట్లుగా ఉండాలి. (1 తిమో. 2:10) సరైన వస్త్రధారణ, కనబడేతీరు, ఇతరులు యెహోవా సత్యారాధనను దృష్టించే విధానంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. యెహోవా సేవకు ఉపయోగించబడే స్థలాలను చూడడానికి వచ్చినవారిలో కొంతమంది సహోదర సహోదరీలు తమ వస్త్రధారణలో నిర్లక్ష్యవైఖరితో ఉన్నట్లు, బిగుతైన దుస్తులు ధరించినట్లు గమనించబడింది. అలాంటి దుస్తులు క్రైస్తవులకు ఏ మాత్రం తగినవి కావు. మన క్రైస్తవ జీవితంలోని అన్ని రంగాల్లో దేవునికి మహిమను తీసుకొచ్చే ఉన్నత ప్రమాణాలను అనుసరించాలని కోరుకుంటాము.—రోమా. 12:2; 1 కొరిం. 10:31.

కాబట్టి ప్రధానకార్యాలయాన్ని లేదా ఇతర బ్రాంచి కార్యాలయాలను చూద్దామని వెళ్లినా లేక సెలవుపై యాత్రాస్థలాలు చూడ్డానికి వెళ్లి అటునుంచి అటే వాటిని కూడా చూద్దామనుకున్నా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా వస్త్రధారణ, కనబడే తీరు మర్యాదకరంగా, పరిశుభ్రంగా, నేను వెళ్తున్న స్థలానికి తగ్గట్టుగా ఉన్నాయా? నేను ఆరాధించే దేవునికి ఘనతను తీసుకొచ్చేవిగా ఉన్నాయా? నేను కనబడే తీరు ఇతరులను ఇబ్బందిపెట్టేదిగా లేదా అభ్యంతరపరిచేదిగా ఉందా?’ మన వస్త్రధారణ, కనబడే తీరుతో సహా మనం ‘అన్ని విషయాల్లో మన రక్షకుడగు దేవుని ఉపదేశమును’ గౌరవిస్తున్నట్లు ఎల్లప్పుడూ చూపించుదము గాక!—తీతు 2:9, 10.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి