సువార్తనందించుట—వీధి సాక్ష్యము ద్వారా
1 సామెతలు 1:20 ఇలా చెప్పుచున్నది: “జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. సంత వీధులలో బిగ్గరగా కేకలు వేయుచున్నది.” యెహోవా సేవకులు తాము ప్రజలను కనుగొనగలిగిన చోటలెల్లా రాజ్యసువార్తను ఆసక్తితో ప్రకటించుచుండగా ఈ మాటలు ప్రత్యేకముగా నిజమైయున్నవి. యేసు మరియు క్రైస్తవకాలమునకు ముందటి ప్రవక్తలవలెనే, ప్రజల యెడల మనకుగల నిజమైన ప్రేమ ప్రతి ఒక్కరికి మరియు ప్రతిచోట సత్యమును అందించుటకు మనలను నడుపుచున్నది.—యిర్మీ. 11:6; మార్కు 6:56; లూకా 13:22, 26.
2 సత్యముగూర్చి ఒకరితో మాట్లాడుటకు అతని యొక్క గృహము అత్యంత కోరదగినదిగా ఉన్నను మనము ఇంటింటికి వెళ్లునప్పుడు ఎక్కువమంది ఇంటియొద్ద ఉండుటలేదు. ఇంటివారు గృహముయొద్ద ఉన్నను తరచు ఆ ఇంటియొద్ద మనము పిలిచినప్పుడెల్లా ముందుసారి కలిసియున్న వ్యక్తితోనే కలియుట జరిగి కుటుంబములోని ఇతర సభ్యులను కలియుట జరగదు. అందునుబట్టి మన పరిచర్యలో వీధిసాక్ష్యము తప్పక ఒక నిశ్చయ స్థానమును కలిగియుండవలెను. ఒక పయినీరు వ్యక్తపరచినట్లు వీధిసాక్ష్యమును “ఆహ్లాదకరమైన దానిగా, తాజాగా ఉండునదిగా మరియు ఇంటికి సంబంధించిన ప్రాంతముగా” మీరును కనుగొనవచ్చును.
ఉల్లాసము కూడిన అనుకూల దృక్పథము
3 ఒకే ప్రాంతములో క్రమముగా వీధిసాక్ష్యమును నిర్వహించుటకు ఎందుకు ప్రయత్నించకూడదు? దీనిని చేయు ఒక సహోదరి “తన” వీధిలోని ఎక్కువమంది దుకాణపువారు, తరచు అందు నడచు ప్రజలు తనకు పరిచయమైనట్లు తెలుపుచున్నది. అనేక ఫలవంతమైన బైబిలు చర్చలకు నడిపినట్టి అన్యోన్యతగల సమాధాన స్థితిని అది వృద్ధిచేసినది. వీధి సాక్ష్యమును ఎంతో బాగుగా ఆనందించు ఒక ఆక్సిలరీ పయినీరు ఇలా చెప్పుచున్నాడు. దుకాణములముందు అద్దముల బీరువాలలో ప్రదర్శనకై పెట్టిన వస్తువులను చూచువారితోను, కారులలో కూర్చొన్నవారితోను, బస్సులకొరకు వేచియుండు వారితోను చివరకు ఇంతకుముందు కాదన్నవారితోను కలియుటకు ఆయన ప్రయత్నించును. నిర్భయముగా, పట్టుదలతో చేయుటకు ధైర్యము మరియు మంచి తీర్పు అవసరము. అయినను మితిమీరి వత్తిడి చేయునట్టి వారముగా ఉండకూడదు.
4 ఫలవంతమైన వీధిసాక్ష్యమునకు కీలకమేమనగా ఉల్లాసము, ఉత్సాహముతో నిష్కపటముగా సమీపించుట, చిరునవ్వు ప్రదర్శించుము. వ్యక్తియొక్క దృష్టిని ఆకర్షించుము. లేనట్లయిన ముందుకు వెళ్లి స్నేహపూర్వకంగా సమీపించుము. పరిస్థితులను గమనించి వాటిని ఉపయోగించుము. సరుకుల సంచులతో భారముగా వెళ్తుండే స్త్రీలను చూచి ఒక సహోదరి “మీరు ఆహారమును కొనితీసుకొని వెళ్తున్నారనుకుంటున్నాను. ఈ రోజులలో నిజముగా అది ఎంతో ఖరీదుతో కూడినది. హృదయానికి మరియు మనస్సుకు ప్రోత్సాహకరమగు ఆహారము సంగతేమి? ఈ శీర్షికను నేనెంతగానో ఆనందించాను. . . . ” పిల్లలున్న ఒకరితో ఆమె ఇలా చెప్పును: “మీ ఇద్దరు పిల్లలు ముచ్చటగా ఉన్నారు. పిల్లలు దేవుడిచ్చు ఆశీర్వాదమని బైబిలు చెప్పు సంగతి మీకు తెలుసా? ఇక్కడ నన్ను చూపనివ్వండి. . . ” బాగా ఆలోచనలో మునిగి ఉన్న ఒక వ్యక్తిని సమీపించి ఆమె ఇట్లంటుంది. “మీరు ఏదో తీవ్రంగా ఎంతో బాధతో నిండియున్నది. దానికి మీరు అంగీకరించరా? ఎప్పటికైనా ఇలాంటి సమయము . . . వస్తుందని మీరనుకొంటారా?
5 ఒక వ్యక్తి వీధిలో వెళ్తున్నట్లయిన, మీరు కేవలము వారికి ఒక కరపత్రమును అందించి, “మీరు సమయమున్నప్పుడు చదువుటకు ఇది మీకు సువార్త అని” చెప్పవచ్చును. ప్రజలు అలా వేగముగా వెళ్తున్నట్లు కనిపించకపోయిన పత్రికలను అందించుము. మరియు చందాకట్టి వాటిని తెప్పించుకొనవచ్చుననియు తెలియజేసి వెలను తెలియజేయుము. సాధ్యమైనప్పుడెల్లా ప్రజల చేతిలోకి సాహిత్యము వెళ్లునట్లు చేయుట మంచిది.
6 మొదట వీధిసాక్ష్యమును చేయుటకు భయపడిన అనేకమంది ప్రచారకులు ఈనాడు తమ ప్రకటించుపనిలో దానిని ప్రియమైన భాగముగా ఎంచుచున్నారు. అయినను, అపాయకర స్థలములలో లేక సురక్షితముకాని స్థలములలో పనిచేయునప్పుడు జాగరూకతను కలిగియుండవలెను. చివరకు చిన్న పట్టణములందు సహా రద్దీగా ఉండు ప్రాంతములు, ప్రజా రవాణా కేంద్రములు, బహిరంగముగా వాహనములు నిలుపుస్థలములందు ప్రజలను సమీపించవచ్చును. అవకాశమును జారిపోనివ్వక వినువారికి ఆశీర్వాదము, యెహోవాకు ఘనత కలుగునట్లు వివేకముతో నీ స్వరము వీధులలోను సంతవీధులలోను సువార్తను అందించనివ్వుము.—సామె. 1:20.