ప్రత్యుత్తరమును పొందే అందింపు ప్రసంగములు
1 ఏ అంశములు ఇంటివారిపై స్పష్టంగా శ్రద్ధచూపించునో, అట్టి అందింపు ప్రసంగములు ప్రత్యుత్తరమును పొందగలవు. అటువంటిది అతనికి అవసరమైనదై, లేక అతడు ఉపయోగించుకొనగలదైయుండును. మీ సంభాషణంతటిలో, ఇంటివారు “ఇది నాక్కూడ వర్తిస్తుంది” అని గుర్తించేలాగున సహాయపడుము. అందింపు ప్రసంగమును సిద్ధపడునప్పుడు మనకైమనము ఇట్లు అడుగుకొనవలెను: ‘నా ప్రాంతములోని ప్రజలకు ఏ అంశములు ఎక్కువ శ్రద్ధగలవై ఉంటాయి? వారి అవసరతలేమిటి? యెహోవా వారి అవసరతలను తన మనస్సులో కలిగియున్నాడని చూపురీతిగా నేనెట్లు వర్తమానమును అందించగలను? ఈనాడు ప్రజలకు ముఖ్యశ్రద్ధగల కొన్ని విషయములు క్రిందచూపబడినవి. వీటిలో దేనినైనను, లేక అలాంటివాటిని నీ అందింపు ప్రసంగంలో ఉపయోగించగలవా? యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకములోని అంశములను వీటితో ఎట్లు జతపరచవచ్చునో గమనించుము.
2 సంతోషము లేకపోవుటనుబట్టి చింత: “మన సమాజములో శ్రేష్టమైన జీవితంను గూర్చి నిజముగా శ్రద్ధగల ప్రజలతో మేము మాట్లాడుతున్నాము. ప్రజలు అవసరమైన వస్తువులన్నీ కలిగియున్నను, అనేకులు తమకున్న వస్తుసంపదనుబట్టి నిజంగా సంతోషించుటలేదు. అణుయుద్ధము లేక ద్రవ్యోల్బణము సంభవిస్తుందేమోనన్న భయం, ప్రతిఒక్కరి భవిష్యత్తుకు ముప్పుగా పరిణమిస్తుంది. సంతోషకరమైన భవిష్యత్తును ఖచ్చితంగా పొందాలంటే మనము మనుష్యునిపై ఆధారపడగలమా? విజయమును సాధించుటలో మానవుని అసమర్ధతను గూర్చి బైబిలేమి చెబుతుందో యిర్మీయా 10:23ను చదువుచుండగా గమనించండి. (చదువుము) భవిష్యత్తునుగూర్చి దేవుడు చెప్పుదానిని అర్థంచేసికొనుట మీకు సంతోషమును తేగలదు. కేవలం ఆయనయొక్క ఒక్క వాగ్దానమును గమనించండి.” ప్రకటన 21:3, 4 చదివి, తర్వాత యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకంలో 307 పేజి, 2 పేరా చదువుము.
3 భవిష్యత్తును గూర్చిన చింత: “భవిష్యత్తునుగూర్చిన ఒక అనుకూల దృక్పథమును మా పొరుగువారితో పంచుకుందామని మేము కృషిచేస్తున్నాము. ఇందుకు ఆటంకంగా ఉన్నది ఏమిటని మీరు తలస్తారు? దీనికి ఆటంకము ఏదని బైబిలు చూపుతుందో యిర్మీయా 10:23 చదువుతూ చూద్దాము. (చదువుము) తర్వాతి వచనము సంతోషకరమైన భవిష్యత్తుకై మానవుడు దేవునిచే నడిపించబడవలసిన అవసరతను చూపుతుంది. (24వ వచనము చదువుము)
4 మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొనుటనుగూర్చిన చింత: “మన పొరుగువారిలో అనేకమంది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొనుటగూర్చి ఎక్కువ జాగ్రత్తవహిస్తారు. మనమెన్ని ముందుజాగ్రత్తలు తీసుకొన్నను ఇంకా, వ్యాధివలన బాధపడుతునే ఉన్నాము. ప్రతిఒక్కరు పరిపూర్ణమైన ఆరోగ్యము, మంచిశక్తితో జీవించే లోకములో మీరు జీవించుటకు యిష్టపడతారా? అది నమ్మశక్యముకానట్లు కనిపించినను, ప్రకటన గ్రంథము అటువంటి కాలమున్నదని, అది సమీప భవిష్యత్తులోనే వస్తుందని చెప్పుచున్నది. (ప్రకటన 21:3, 4 చదువుము.) అటువంటి సంతోషకర పరిస్థితులను అనుభవించాలంటే మనము ఏమిచేయటం అవసరమని మీరనుకుంటారు?” ఆ తదుపరి మీరు యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకములో 308 పేజీ 2 పేరా చదివి, దేవునినుండి నిత్యజీవముపొందుటకు విశ్వాసమెట్లు ప్రాముఖ్యమో చూపించవచ్చును.
5 పర్యావరణము, కాలుష్యమునుగూర్చిన చింత: “పొరుగువారితో మాట్లాడుచున్నప్పుడు అనేకులు మన గాలి, నీరు, ఆహారము కలుషితమైన దాన్నిగూర్చి చింతను కలిగియున్నట్లు మేము గమనించాము. ప్రభుత్వములు వీటిని ఎప్పుడైనా ఆపగలవని మీరు తలస్తారా? [వ్యాఖ్యానము చేయనివ్వండి] భూమిని నాశనము చేయుచున్నవారికి ఏమి సంభవిస్తుందో బైబిలు చెప్పుసంగతి ప్రోత్సాహకరంగా ఉంది. ప్రకటన 11:18 b చదువుము. భూమిని నశింపజేయువారిని నాశనము చేయుటతోపాటు, కీర్తన 37:10, 11 లేక యెషయా 65:21, 22 లో చూపబడినట్లు దీనులైనవారు భూమిని పరదైసుగా చేయడమే దేవుని సంకల్పమని తెలుపుము.
6 మతసంబంధమైన మనస్సుగలవారికి: “ఈ ఇరుగుపొరుగువారిని ఒక ప్రశ్న అడుగుతున్నాము: “మనుష్యులు తాము మంచిదనుకొను పద్ధతిలోనే, తనను ఆరాధించవలెనని దేవుడు కోరుకుంటాడని మీరనుకుంటారా? (వ్యాఖ్యానము చేయనిమ్ము) బైబిలు యిర్మీయా 10:23లో ఏమిచెబుతుందో గమనించుము.”
7 వినువారి హృదయమును చేరుటకు మీరు మనఃపూర్వకముగా కృషిచేయుకొలది, నీతి, సత్యముకొరకు ఆకలిగలవారు ప్రత్యుత్తరమిత్తురు.—మత్తయి 5:3, 6.