నిజమైన సంతోషానికి ఒక కీలకం
1 సంతోషాన్ని ఎలా కనుగొనవచ్చో యేసుక్రీస్తు మనకు చెబుతున్నాడు గనుక, లూకా 11:28 నందు వ్రాయబడిన ఆయన మాటలు మనకు సువార్తే. “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు . . . ధన్యులని” ఆయన చెప్పాడు. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు మరియు నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాలు మరింత సంతోషాన్ని కనుగొనడానికి చాలా మందికి తోడ్పడ్డాయి. వాటిని ఇతరులకు ప్రతిపాదించడంలో మనకు మంచి కారణముంది.
2 పెరుగుతున్న నేరాన్ని గూర్చి, హింసను గూర్చి అనేకులు చింతిస్తున్నారు గనుక ఇది కొందరికి ఆసక్తిని కలిగించవచ్చు:
◼ “మనకు అత్యవసరమైనదేదని మీరనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] ప్రశాంతమైన శాంతియుతమైన జీవితాలను గడిపేందుకు భద్రత అవసరమని ఒప్పించబడిన అనేకులున్నారు.” నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 14వ పేజీకి త్రిప్పి, 16వ పేరాలోని మొదటి వాక్యాన్ని చదవండి. ఈ విధంగా చెబుతూ కొనసాగండి: “అయినప్పటికీ, దుష్టత్వాన్ని నిర్మూలం చేస్తానని, భూమిపైని ఆధిపత్యాన్ని తీసేసుకుంటానని, ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సాంఘిక మార్పునుండి తప్పించుకోవడానికి మనకు వాస్తవంగా కావలసినది నిజమైన జ్ఞానమే. కాని, దేనిని గూర్చిన జ్ఞానం?” బైబిలు నుండి గానీ లేదా పుస్తకంలోని తరువాతి పేజీలోని 19వ పేరానుండి గానీ యోహాను 17:3 చదివి, దేవుని గూర్చిన జ్ఞానం నిత్యజీవానికెలా నడపగలదో వివరించండి. పుస్తకాన్ని ప్రతిపాదించి, మానవజాతి అవసరాలన్నింటినీ తీర్చాలనే దేవుని సంకల్పాన్ని గూర్చిన అద్భుతమైన సమాచారాన్ని అది ఎలా తెలియజేస్తుందో చూపించడానికి తిరిగి వస్తారని చెప్పండి.
3 ప్రపంచంలోని విపత్తును గూర్చి అనేకులు చింతిస్తున్నారు గనుక, మీరీ విధంగా ప్రయత్నించవచ్చు:
◼ “ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నది భవిష్యత్తును గూర్చిన విషయమే. శాంతియుత క్రొత్త యుగం యొక్క ద్వారమున మనమున్నామని కొందరు ప్రపంచ నాయకులు బావిస్తారు. దానిని గూర్చి మీరేమని బావిస్తారు? [జవాబు చెప్పనివ్వండి.] మానవ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా విపత్తు అధికమౌతూనే ఉంది. బైబిలు మాత్రమే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని తెలియజేస్తుంది. [2 పేతురు 3:13 చదవండి. 156 నుండి 162 వరకున్న పేజీల్లోని చిత్రాల వైపుకు త్రిప్పి, దేవుని పరలోక రాజ్యం ఈ భూమిపై నిరంతరం నిలిచే శాంతిని భద్రతను ఎలా తెస్తుందో వివరించండి.] దేవుని రాజ్య పరిపాలన క్రింద నిత్య జీవాన్ని అనుభవించే ప్రజల క్రొత్త సమాజంలో మీరు కూడా ఎలా బాగమై ఉండవచ్చో గ్రహించడానికి ఈ ప్రచురణ మీకు సహాయపడుతుంది.”
4 పనిరద్దీలో ఉన్న ఒకరిని మీరు కలిసినప్పుడు, మీరు క్లుప్తంగా చెప్పాలి, మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మీకు ఒక్క క్షణమే ఉంది కనుక, [సముచితమైన కరపత్రాన్ని లేదా శీర్షికను ఎన్నుకొని] ఈ కరపత్రాన్ని [లేదా పత్రికాశీర్షికను] మీకిచ్చి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. దీనిని చదవమని నేను ప్రోత్సహిస్తున్నాను. నేను ఈ సారి వచ్చినప్పుడు, దీనిని గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను.”
5 “నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము” అనే పుస్తకాన్ని మీరుపయోగించేటప్పుడు, మీరిలాంటి దేనినైనా చెప్పవచ్చు:
◼ “ఆధునిక కుటుంబం మునుపటి తరాలు ఎరుగని సవాళ్ళను ఎదుర్కొంటోందని మీరు ఒప్పుకుంటారా? [జవాబు చెప్పనివ్వండి.] మీ అభిప్రాయంలో, ఎందుకిది సంభవిస్తుంది? [ప్రతిస్పందనను గుర్తించండి. 2 తిమోతి 3:1-3 తీసి, చదవండి.] ‘తలిదండ్రులకు అవిధేయులు,’ ‘అనురాగరహితులు’ అనే పదబంధాలు మనకాలంలోని అనేకులను సరిగ్గా వర్ణిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ సమస్యలను ముందుగా తెలిపిన దేవుడే, కుటుంబం ఎలా సన్నిహితంగా కాగలదు అనే దానిని గూర్చి మంచి మార్గదర్శకాన్ని మనకిచ్చాడు.” 2వ పేజీలోని “ప్రకాశకులు” వ్రాసిన పేరాను చదివి, పుస్తకాన్ని రూ. 15కు ప్రతిపాదించండి (తెలుగు ప్రతిని ప్రత్యేక వెలకు ప్రతిపాదించవచ్చు).
6 ఫిబ్రవరిలో ఈ ప్రచురణల్లో ఒకదాన్ని లేక రెండింటినీ ప్రతిపాదించడం ద్వారా నిజమైన సంతోషానికి కీలకం బైబిలులో కనిపించే సహేతుకమైన సలహాను అనుసరించడమేనని తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశాన్నిద్దాం.—కీర్త. 119:105.