ఇంకా ఆసక్తిని పురికొల్పుటకు నేను ఏమి చెప్పగలను?
1 సువార్త ప్రకటించుటలోని మన ఉద్దేశ్యంలో ముఖ్యభాగము శిష్యులను తయారుచేయటమేగాని, కేవలం సాహిత్యమునందించటం కాదు. ఆసక్తిని కనుగొన్నప్పుడు, విత్తబడిన విత్తనములు మొలిచి పెరుగులాగున, ఆ వ్యక్తి ఆత్మీయంగా వృద్ధియగునట్లు యెహోవా అతనికి సహాయపడుటకు తగిన అనుకూల వాతావరణాన్ని మనము కలుగజేయాలి. (1 కొరిం. 3:6) పైన పేర్కొనబడిన అందింపు ప్రసంగములను మొదట ఉపయోగించిన తరువాత, వాటిపై నిర్మాణాత్మకంగా నీవు ఏమి చెప్పవచ్చును? నీవు ఎదుర్కొనే విభిన్న పరిస్థితులకు తగిన సూచనలు కొన్ని ఇక్కడ ఇవ్వబడినవి.
2 చూపిన ఆసక్తిని వృద్ధిచేయుట: “మొదట మేము మీతో క్లుప్తముగా మాట్లాడినప్పుడు, మీరు చాలా పనితొందరలో ఉన్నారు. అయినా మీరు సమయము తీసికొని భవిష్యత్తును గూర్చిన మీ శ్రద్ధను వ్యక్తపరిచారు. మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొన్నట్లయిన, బైబిలులో యిర్మీయా 10:23 నందు సంతోషకరమైన భవిష్యత్తును తీసికొనివచ్చుటకు మానవుడు అసమర్థుడనే విషయాన్ని మనము చదివాము. ఆ లేఖనాన్ని గూర్చి ఈ పుస్తకం ఏమి చెబుతుందో గమనించండి. (యంగ్ పీపుల్ ఆస్క్ పేజి 305, పేరా 5 చదువుము.) ఈ ప్రచురణ యౌవనులకు, ఆలాగే తల్లిదండ్రులకు ఉపయోగకరమైన విషయములను తెలియజేస్తుంది. మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి యిష్టపడతారని నా దృఢనమ్మకం.”
3 బైబిలు పఠనమును ప్రారంభించుటకు యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకమును ఉపయోగించుట: “మిమ్ములను మరలా కలవడం సంతోషంగా ఉంది. నేను మీకిచ్చివెళ్లిన పుస్తకములో నేను మీతో చెప్పాలనుకుంటున్న ప్రోత్సాహకరమైన మరొక అంశం ఒకటుంది. దేవుని దయను, ఆయన ఆశీర్వాదములను పొందుటకు, మనము మన తల్లిదండ్రులను సన్మానించవలెనని బైబిలు చెబుతుంది. మన తల్లిదండ్రులను సన్మానించటమంటే దాని అర్థమేమి?” యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకంలో 11వ పేజి త్రిప్పి, “వాట్ ‘ఆనరింగ్’ దెమ్ మీన్స్” అను ఉపశీర్షిక క్రిందనున్న పేరాగ్రాఫ్లను చదివి, 17వ పేజి లోని “కొశ్చన్స్ ఫర్ డిస్కషన్” అను భాగానికి త్రిప్పి, చదివిన పేరాగ్రాఫ్లకు సంబంధించిన ప్రశ్నలను చర్చించుము. మరలా తిరిగివచ్చి, ఈ విధమైన చర్చను కొనసాగిస్తానని చెప్తూ ముగించుము.
4 బైబిలు పఠనమును ప్రారంభించుటకు మరొక ప్రచురణను ఉపయోగించుట: “మీరు ఇంట్లో ఉండటం నాకు సంతోషంగా ఉంది. పోయినసారి మనము మాట్లాడుకొన్నప్పుడు, ప్రకటన 21:3, 4 లోని బైబిలు వాగ్దానమును మనం కలసి చదివాము. [మరలా చదువుము] అయితే వాగ్దానముచేయబడిన ఆ సంతోషకరమైన పరిస్థితులు వాటంతటవే మన స్వంతంకావు. ప్రకటన 1:3లో స్పష్టముచేయబడినట్లు, అందుకు రెండు విషయములు అవసరం. (చదువుము) అనగా మనము బైబిలును చదువవలెను, వ్రాయబడినదానిని ఆచరణలో పెట్టవలెను. ‘ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను’ అను ఈ బ్రోషూరు, మూలంగా నేను మీకు ఇచ్చివెళ్లిన సాహిత్యమును చదువుట మీకు అధిక ఆనందాన్నిచ్చుటకు దోహదపడుతుంది. ఎందుకనగా దేవుడు మనలను కోరువాటిని సులభమైన పద్ధతిలో అది వివరిస్తుంది. అనేకమంది అడుగు 12 ప్రశ్నలు వరుసగా 30వ పేజీలో ఉన్నవి. వీటిలో దేనికి మీరు సమాధానము కావాలని యిష్టపడతారు?” ఇంటివారు జవాబిచ్చిన తరువాత ఆ ప్రశ్నకు బ్రోషూరులో సమాధానము ఇవ్వబడిన చోటును తెరచి, బైబిలుపఠనమును ప్రారంభించుము.
5 పునర్దర్శనములందు, మనం మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడిన అంశమును పునాదిగా తీసికొని దానిపై మాట్లాడవలెను. పరిచర్యయొక్క ఈ భాగంయెడల శ్రద్ధతోకూడిన అవధానాన్ని ఇచ్చుటద్వారా, అది మనకును, మనలను వినువారికిని యెహోవానుండి గొప్పదీవెనలను తెచ్చును.—1 తిమో. 4:16.