అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి
1 బైబిలులో చెప్పబడిన కొన్ని విషయాలు ‘గ్రహించడానికి కష్టమని’ అపొస్తలుడైన పేతురు తెలియజేశాడు. (2 పేతు. 3:16) అనేకులు ఆ విధంగా బావించారు. అయినప్పటికీ, దాని ప్రాథమిక బోధలు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో తేటతెల్లం చేయబడ్డాయి. ఈ పుస్తకాన్ని మరియు నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మనమెలా ఆసక్తిగలవారికి సహాయపడగలం?
2 మీరు మొదట సందర్శించినప్పుడు యోహాను 17:3 ను చర్చించినట్లయితే, ఈ విధంగా చెప్పడం ద్వారా మరి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించవలసిన అవసరతను మీరు నొక్కిచెప్పగలుగుతారు:
◼ “నేను క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించడం నిత్యజీవానికి నడపగలదు అని యోహాను 17:3 నందు చదివాం. కాని నేడు మనం జీవిస్తున్న లోకంలో నిరంతరం జీవించాలని మీరు కోరుకుంటారా? [జవాబు చెప్పనివ్వండి.] అనేకులు ఇష్టపడరు. ఈ కారణాన, దేవుడు వాగ్దానం చేసిన దానిని విన్నప్పుడు మనం ఆనందించగలం.” 12 మరియు 13 పేజీల్లోని 12వ పేరాకు వెళ్ళి, యెషయా 11:6-9 చదివి, ‘మొదటి సంగతులు గతించిపోయి’నప్పుడు ఉండేటటువంటి లోకాన్ని వర్ణించే ఆ పేజీల్లోని చిత్రాన్ని ఉపయోగించండి. తరువాయి చర్చ కొరకు తిరిగి వెళ్తారని ప్రతిపాదించండి.
3 దేవునిరాజ్యం విపత్తును నిర్మూలంచేస్తుందని చూపించడానికి 156 నుండి 162 వరకున్న పేజీల్లోని చిత్రాలు ఉపయోగించబడినట్లయితే, మీరు పుస్తకంలోని ఆ పేజీలను మరలా తీసి ఇలా చెప్పవచ్చు:
◼ “ఇక్కడ వర్ణించబడిన దేవుని రాజ్య పరిపాలన క్రింద ప్రజలు అనుభవించబోయే ఆశీర్వాదాలను మనం చర్చించాం. ఆ రాజ్యం క్రింద మనం జీవించాలనుకుంటే మనమేం చేయాలని మీరనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] 250వ పేజీలోని 2వ పేరాను తీసి, హెబ్రీయులు 11:6 చదవండి. యథార్థపరులైన ప్రజలు దేవుని అన్వేషించి, అంగీకారయోగ్యమైనవిధంగా ఆయనను ఆరాధించడానికి యెహోవాసాక్షులు సహాయపడుతున్నారని వివరించండి.
4 సంబాషించడానికి వీలుకానంతగా పనిరద్దీలో ఉన్న గృహస్థుని(రాలి)కి “ఈ లోకం నిలుస్తుందా?” అనే కరపత్రాన్ని ఇచ్చినట్లయితే, మీరీవిధంగా ఆరంభించవచ్చు:
◼ “నేను ఇటీవల వచ్చినప్పుడు, మీరు చాలా పనిరద్దీలో ఉన్నారు. ఈ క్లిష్టమైన కాలాల్లో లోకం నిలవడాన్ని గూర్చిన ఓ ప్రశ్నను లేవదీసిన ఒక కరపత్రాన్ని మీకిచ్చాను. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే ఈ పుస్తకంలో ఎత్తివ్రాయబడిన ప్రకటన 21:4 చదువుదాం [162వ పేజీలో ఉన్నదానిని చదవండి]. ఈ [156 నుండి 162 పేజీల్లోని] చిత్రాలు ‘దేవుడు మన కన్నుల ప్రతిబాష్ప బిందువును తుడిచివేసే’టప్పుడు ఎలా ఉంటుందనే దానిగురించిన ఒక ఊహనిస్తుంది. ఈ వాగ్దానం అతి సమీప భవిష్యత్తులోనే నెరవేరుతుందనే దానికి ఒప్పించే రుజువును ఈ పుస్తకం ప్రతిపాదిస్తుంది. మీరు దీనిని చదవాలని ఇష్టపడుతున్నట్లయితే, ఇది మీ కొరకైన ప్రతి.”
5 “నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము” అనే పుస్తకాన్ని అందించిన చోట తిరిగి వెళ్ళినప్పుడు, మీరీవిధంగా ఆరంభించవచ్చు:
◼ “నేను మిమ్మల్ని మొదట సందర్శించినప్పుడు, మీ కుటుంబాన్ని గూర్చిన మీ శ్రద్ధనుబట్టి నేను ముగ్ధుడనయ్యాను. ఈ దుష్ట విధానం యొక్క అంత్య దినాల్లో మనం జీవిస్తుండగా, కుటుంబాల భవిష్యత్తు కొరకు సిద్ధపడుతూ ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆ లక్ష్యం కొరకు, ఇంట్లో క్రమంగా బైబిలు చర్చలు జరగాలని నేను మీకిచ్చిన నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం గట్టిగా సిఫారసు చేస్తుంది. [185-6 పేజీల్లోని 10వ పేరాను చదవండి.] సాధ్యమైతే, దాదాపు 200 దేశాల్లోని ప్రజలు ఇండ్లలో కుటుంబ గుంపులుగా బైబిలును ఎలా చర్చిస్తారో మీకు చూపించడానికి కొన్ని నిమిషాలు తీసుకుంటాను.” సమయం అనుమతించే దానినిబట్టి పఠనాన్ని ప్రదర్శించేందుకు 71వ పేజీలోని ఉపశీర్షిక క్రిందనున్న సమాచారాన్ని ఉపయోగించండి.
6 వారికి ఆసక్తి ఉందని మీరు కనుగొంటే, పఠనాన్ని ఆరంభించడానికి ఏర్పాట్లను చేయాలని మీరనుకోవచ్చు. ‘అనుభవంలేనివారు గ్రహించడానికి’ సహాయపడడంలో మీరు చాలా ఆనందాన్ని తప్పక అనుభవిస్తారు.—కీర్త. 119:130.