నిరంతరము జీవించగలరు పుస్తకమునుండి బైబిలు పఠనములను నిర్వహించండి
1 నిరంతరము జీవించగలరు పుస్తకమునుగూర్చి మాట్లాడుతూ, ఒక స్త్రీ ఇలా వ్యక్తపరచింది: “నేను చదివిన వాటిలో బైబిలు తర్వాత, ఈ పుస్తకమే అత్యంత కచ్చితమైంది, ప్రేరేపించగలది, కదిలించశక్తిగల సాహిత్యంగా నాకు కన్పించింది!” బైబిలును అర్థంచేసుకోవడానికి, ప్రత్యేకంగా యెహోవాను క్రియాశీలకరీతిలో స్తుతించే వారిగా తయారయ్యేలా సహాయపడేందుకు ప్రచురించబడిన అత్యంత శ్రేష్టమైన వాటిలో ఇదొకటని మనమందరము ఏకీభవిస్తాము.
2 నిరంతరము జీవించగలరు అను ఈ పుస్తకము 1982లో విడుదలైనప్పుడు, ఇండియాలో ఉన్న సరాసరి 5,136 మంది ప్రచారకులు 3,310 బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. గతసంవత్సరం అక్టోబరు మాసంలో 12,306 మంది ప్రచారకులు 10,912 బైబిలు పఠనాలను నిర్వహించారు. నేటికి, నిరంతరము జీవించగలరు పుస్తకము 115 భాషలలో, 6 కోట్ల 20 లక్షల కాపీలు ముద్రించబడినవి. ప్రపంచవ్యాప్తమైన మన పనిపై ఈ పుస్తకము ఎంతటి ప్రభావాన్ని కలిగివుంది!
3 లక్ష్యాలను పెట్టుకొనండి: ఇంతటి ఉన్నతమైన పెరుగుదల యెహోవా ఆశీర్వాద ఫలితంగా, జీవమును కాపాడే బైబిలు వర్తమానాన్ని యథార్థమైనవారికి అందించాలనే ఆయన ప్రజలకున్న ఆసక్తి మూలంగా కలిగిందే. (రోమా. 10:13-15; 1 తిమో. 2:4) ప్రస్తుతకాల అత్యవసరతను, దేవుని రాజ్యాన్ని ప్రకటించడంలో తీసుకోవలసిన శ్రద్ధను మనము గుర్తిస్తాము.
4 ఒకప్రక్క దేవుని సంస్థ ముందుకు సాగిపోతుండగా, వ్యక్తిగతంగా మనమెలా పనిచేస్తున్నాము? శిష్యులను తయారుచేసే ప్రాముఖ్యమైన పనిలో పూర్తిగా భాగం వహించాలని మనము తీర్మానించుకున్నామా? దీనిని చేయాలంటే మనం వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆసక్తి కనపరచిన వారిని విడువక దర్శించడంలో మనము శ్రద్ధ కలిగివున్నామా? ఫిబ్రవరి మాసంలో ఒక కొత్త బైబిలు పఠనాన్ని ప్రారంభించే లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకోకూడదు?
5 బైబిలు పఠనాన్ని ఎవరు నిర్వహించగలరు?: వివిధ స్థాయిలుగల ప్రచారకులు నిరంతరము జీవించగలరు పుస్తకమునుండి బైబిలు పఠనాన్ని నిర్వహించడంలో ఆనందాన్ని పొందారు. దాని రచనా విధానములోని సరళత దానినుండి పఠనం నిర్వహించడాన్ని సులభతరంచేసి, కొత్త ప్రచారకులు కూడా ఈ ప్రాముఖ్యమైన పనిలో వంతుకలిగి ఉండేలా చేస్తుంది. అంతేగాక మనలో అనేకమంది వ్యక్తిగతముగా దానిని పఠించి, దానిలోని అంశాలతో పరిచయము కలిగివున్నాము. నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని ఉపయోగించక ముందు ఏ పఠనాలు నిర్వహించని ఒక ప్రచారకుడు ప్రశంసతో ఇలా వ్రాశాడు: “నాకిప్పుడు మూడు పఠనాలున్నవి. నాలుగవదానిని ప్రారంభించబోతున్నాను. బైబిలు పఠన నిర్వహణను సులభతరం చేసినందుకు నేను తెల్పే కృతజ్ఞతలు సరిపోవు.”
6 బాలురు సహితం, నిరంతరము జీవించగలరు పుస్తకము ద్వారా బైబిలు పఠనాలను నిర్వహించే పనిలో చురుకుగా పాల్గొంటున్నారు. బాలుడైన ఒక సహోదరుడు తన స్కూలు డెస్క్‌పై ఈ పుస్తకాన్ని విడిచిపెడతాడు. ఇది మంచి చర్చలకు, అనేక బైబిలు పఠనాలకు అవకాశాన్ని కల్పించింది. కొంతమంది పిల్లలు ఇంటింటి పరిచర్యలో తాము కలిసిన తల్లిదండ్రులను, మేము మీ పిల్లలతో బైబిలు పఠనాన్ని నిర్వహించడానికి అనుమతిస్తారా అని అడగటం ద్వారా సూటిగా సమీపించే పద్ధతిని ఉపయోగించారు. యెహోవా పరదైసు భూమిపై వాగ్దానముచేసిన నిత్యజీవమునుగూర్చి మాట్లాడుటకు మన పిల్లలు ఎన్నటికిని పసివారు కాదు.
7 పిల్లలైనా, వృద్ధులైనా, ఎవరైననూ పరిచర్యలో పొందే సంతోషాలలో గొప్పదొకటేమనగా గృహబైబిలు పఠనాన్ని నిర్వహించుట. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం సహాయంకొరకు యెహోవాను ప్రార్థించి, మన నిరీక్షణను బహిరంగంగా చాటించే అవకాశాన్ని జారవిడువకుందాము. ఇతరులును మన దేవుడైన యెహోవాను స్తుతించుటలో ఎలా వంతు కలిగియుండగలరో నేర్చుకొనుటకు నిరంతరము జీవించగలరు పుస్తకమును ఉపయోగించండి.—కీర్త. 148:12, 13.