కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/93 పేజీ 1
  • “రమ్ము” అని చెబుతూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “రమ్ము” అని చెబుతూ ఉండండి
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటన —దాని దివ్యమైన ముగింపు సమీపించింది!
    మన రాజ్య పరిచర్య—2006
  • యెహోవా సేవలో ఆనందించుట
    మన రాజ్య పరిచర్య—1994
  • ప్రకటన ముగింపు పుస్తకాన్ని మరలా పఠించడం
    మన రాజ్య పరిచర్య—1994
  • ప్రత్యుత్తరమును పొందే అందింపు ప్రసంగములు
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 3/93 పేజీ 1

“రమ్ము” అని చెబుతూ ఉండండి

1 యేసు అర్పించిన విమోచన క్రయధన బలిద్వారా యెహోవా ఎంతటి అద్భుతమైన ఏర్పాటుచేసెను! ప్రజలను నిజంగా సంతోషవంతులను చేయడానికి అవసరమైనదంతా ఇందులో మనకు కన్పిస్తుంది. (యోహాను 3:16) అయితే ఈ సత్యాన్ని బహుకొద్దిమంది మాత్రమే తెలుసుకొని దానిని స్థిరంగా నమ్ముతున్నారనుట విచారకరము. అయినా మానవజాతిపైగల తన ప్రేమపూర్వక శ్రద్ధతో ప్రజలందరు ఈ సువార్తను తెలుసుకొను ఏర్పాటును యెహోవా చేశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుద్వారా సంతోషము మరియు నిత్యజీవముపొందే అవకాశమును ఆయన అందరికి అనుగ్రహించాడు.—యోహాను 17:3.

2 మానవజాతిని పాపము, మరణమునుండి విమోచించు వాడెవడనేది వేలసంవత్సరముల వరకు గుప్తంగా ఉండింది. క్రీస్తుయేసు వచ్చి, “మరణమును నిరర్థకముచేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోకి” తెచ్చేంతవరకు అది “పరిశుద్ధ మర్మము”గా ఉండెను. (రోమా. 16:25 NW; 2 తిమో. 1:10) యేసు అనుచరులు ఈ సువార్తను ప్రకటించే పనిని మొదటి శతాబ్దములో చేపట్టారు; ఈ ఆధునిక కాలములలో జీవించు మనము అదే సువార్తను ప్రకటించు ఉన్నతమైన ఆధిక్యతను కలిగియున్నాము. రాజ్యవర్తమానమును ప్రకటించేటప్పుడు, సకల జీవన విధాలలో నడుచుకొను ప్రజలను ‘రండి! . . . జీవజలములను ఉచితముగా పుచ్చుకొనండి’ అని ఆహ్వానించే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, క్రీస్తు సహోదరులతోపాటు మనముకూడా పాలుపంచుకుంటున్నాము.—ప్రక. 22:17.

3 నిజమే, అందరూ ఈ సువార్తను వినరు. బహు కొద్దిమంది మాత్రమే ఎక్కువ శ్రద్ధకనపరుస్తారు. కొందరు సత్యసంబంధమైన జీవజలములనుండి ప్రయోజనముపొందుమని వారినాహ్వానించే దేవుని సేవకులను మూర్ఖంగా తృణీకరిస్తారు. అయినా, యెహోవానుండి వచ్చు బలముతో మనమీపనిలో పట్టుదలతో కొనసాగుతాము. సత్యమును మాట్లాడుతూ, వినేవారికి సహాయం చేయాలనే మన ఇష్టత యెహోవాను ప్రీతిపరచి ఆయన ఆశీర్వాదములను తెస్తుందని మనకు తెలుసు.

4 మార్చిలో మనం చేసే పరిచర్యయందు సత్యమును వెదకువారిని యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకమును చదవమని, నేడు పరిశుభ్రమైన జీవితమును జీవించుటకు అదిచ్చే ఆచరణాత్మకమైన ఉపదేశమును అన్వయించుకొనుమని, అందులోని చివరి అధ్యాయాలలో చూపబడిన భవిష్యత్‌ నిరీక్షణనుగూర్చి నేర్చుకొనుమని మనము ప్రోత్సహిస్తాము. లేక వారికి నిరంతరము జీవించగలరు పుస్తకమును చూపి, వారితో క్రమముగా బైబిలు పఠనమును నిర్వహించులాగున దానిని అందిస్తాము. ఈ అందింపులను అంగీకరించుటద్వారా వారు అనేక దీవెనలను పొందగలరు. అంతేగాక, భవిష్యత్తునుగూర్చి అనగా మన భవిష్యత్తునుగూర్చి వారి భవిష్యత్తునుగూర్చి బైబిలు చెబుతుంది. ఇప్పుడు యెహోవాకు సమర్పించుకొన్న సేవకులైనవారిలో అనేకమంది ఈ నిరంతరము జీవించగలరు పుస్తకములోని బైబిలు సిద్ధాంతముల వివరణను చదివిన తరువాతే సత్యముపట్ల మొదట ఆసక్తి కనపరచారు. ఆ పుస్తకమును మనమట్టుకు మనము విపులముగా పఠించినవారమై, సత్యముకొరకు ఆకలిగల యథార్థహృదయులకు అది ఎంతముఖ్యమో మనము గుణగ్రహించగలము. అటువంటివారిని మనము మనపరిచర్యలో కనుగొనే కొలది, నిరంతరము జీవించగలరు పుస్తకముయొక్క విలువను వారికి చూపించుటకు అందులోని ఒకటి లేక రెండు ఉన్నతాంశములను చూపించుటకు ప్రయత్నించుదము. ఇతర అనేకమైన వాటితోసహా ఈ పుస్తకము 18వ అధ్యాయములో వివరించబడిన యేసు ప్రవచనముల వంటి ఈ 20వ శతాబ్దములో నెరవేరిన బైబిలు ప్రవచనముల స్పష్టమైన వివరణను మనము చూపించవచ్చును.

5 క్రీస్తు మరణజ్ఞాపకార్థమును ఏప్రిల్‌ 6న, ఆచరించుటకు మనము సిద్ధపడుతుండగా, మానవజాతికొరకు యెహోవాచేసిన ప్రేమగల ఏర్పాట్లనుగూర్చి మాట్లాడుట ఎంతో యుక్తమైనది. ప్రజలు వినుటకు ఇష్టపడినను ఇష్టపడకున్నను, స్వీకరించుటకు ఇష్టపడు ఎవరికైనా ‘రండి! . . . జీవజలములను ఉచితముగా పుచ్చుకొనండి’ అను ఆహ్వానమును ఇచ్చే మన దేవుని నియమిత పనిలో పట్టుదలతో కొనసాగుదము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి