ఆసక్తిగలవారికి సహాయం చేయుటకై సంతోషంగా తిరిగి దర్శించండి
1 ఇంటింటి పరిచర్యలో పాల్గొనే వారందరూ ఆసక్తిగల వారికి సహాయం చేయటానికి ఇష్టపడతారు. అలాంటి సహాయాన్ని అందించడం ద్వారా మనం అమితానందాన్ని, సంతృప్తిని పొందుతాము. (కీర్తన. 126:5, 6 పోల్చండి.) ఇందు కొరకు మనం సిద్ధపడి ఉండడం అవసరం.
2 మన ఇంటింటి రికార్డులో వివరణలు వ్రాసి ఉంచుకోవడంతో సిద్ధపాటు మొదలవుతుంది. మీరు గృహస్థునికి ఏ వాచ్‌టవర్ లేక అవేక్! సంచికను ఇచ్చారు, అతడు చందా చేశాడా లేదా అనే సమాచారం దానిలో ఉండాలి. మొదటి దర్శనంలో ఏ విషయాన్ని చర్చించారు, దానికి గృహస్థుని ప్రతిస్పందన ఎలా వుంది అనేది వ్రాసుకోవాలి. మళ్లీ దర్శించినప్పుడు సంభాషణను ఎలా ప్రారంభించాలి అనేది కూడ మీరు వ్రాసుకోవచ్చు.
3 ఉదాహరణకు, మొదటిసారి మీరు ప్రభువు ప్రార్థన గురించి సూచించి, “ప్రభుత్వం” బ్రోషూర్‌ను ఇచ్చివుంటే, మీరు క్లుప్తంగా ఇలా అనవచ్చు:
◼ “నేను క్రితంసారి వచ్చినప్పుడు, ఈ భూమిపై దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనం చర్చించాం. నేను మీకు యిచ్చివెళ్లిన బ్రోషూర్‌లోని 29వ పేజీలో, మానవజాతి కొరకు దేవుని రాజ్యం తీసుకురాబోయే యితర దీవెనల గురించి ఏం చెప్పబడిందో గమనించండి.”
4 ఒకవేళ ఆ వ్యక్తి హిందువయితే, ఇలా చెప్పండి:
◼ “మనం మునుపు కలిసినప్పుడు, దానియేలు 2:44 నందలి ప్రవచనాన్ని దాని నెరవేర్పును గూర్చి చర్చించుకున్నాము.” లేఖనాన్ని మళ్లీ చదివి మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్‌లోని 12-17 పేజీలకు త్రిప్పి, మీ మొదటి దర్శనమప్పుడు ఆపిన దగ్గరనుండి సంభాషణను మొదలుపెట్టండి. ఈ మార్పు వచ్చే సమయాన్ని గురించి ఏ సందేహాలకు బైబిలు తావివ్వడంలేదన్న వాస్తవం వైపు గృహస్థుని దృష్టిని మళ్లించండి. ఒకవేళ వీలయితే, తన స్వంత బ్రోషూర్‌ను తెచ్చుకొమ్మని చెప్పి విషయాన్ని కలిసి పరిశీలించండి.
5 గృహస్థుడు ఆ విషయాన్ని గూర్చి కాని, మరితర విధంగా కాని సంతృప్తి చెందినట్లు కనిపిస్తే మీరు అతనికిచ్చిన పత్రికలోని వివరణ గూర్చి లేక ఆకర్షణీయమైన చిత్రాన్ని గురించి వ్యాఖ్యానించమని అడగండి. అతడు కేవలం కరపత్రాన్ని మాత్రమే తీసుకుని వుంటే, లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వర్ల్డ్ అనే కరపత్రాన్నే మళ్లీ పరిశీలించి, 3, 4 పేజీలలో ఉన్న దాన్ని చదవండి. అందమైన పరదైసు భూమిపై జీవించాలని కోరుకుంటున్నారా అని గృహస్థున్ని అడగండి. ఆరవ పేజీలో “అది మీకెలా సాధ్యం” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారాన్ని అతనితో చర్చించండి.
6 వాచ్‌టవర్, లేక అవేక్!లలో బహుశ మీరు చర్చించిన శీర్షికతో ఇదే మాదిరిని అనుసరించవచ్చు. మొదటి దర్శనంలో మీరు ఉన్నతపరచిన శీర్షికలో గాని మీవద్దనున్న ఇంకొక సంచికలోని శీర్షికలో గాని ఆసక్తి ఉన్న అంశాన్ని వివరించండి. వీలైతే, ఒక లేఖనం కలిసి చదివి గృహస్థున్ని వ్యాఖ్యానించ మనండి.
7 మొదటిసారి మీరు దర్శించినపుడు గృహస్థుడు చందా చేయుటకు ఇష్టపడి వుండడు, మరైతే పునర్దర్శనమప్పుడు, ఆ పత్రిక తరువాతి సంచికలలో ఏదైనా మీవద్ద వుంటే, అతనికి అందులోని ఆసక్తికరమైన కొత్త శీర్షికలను చూపించి చందా సేకరించుటకు అది మంచి అవకాశం కావచ్చును.
8 బైబిలు పఠనం మొదలు పెట్టాలనే మీ గురిని మనస్సులో వుంచుకోండి. అంతవరకు ఆసక్తిని పెంపొందించాలంటే ఎన్నో పునర్దర్శనాలు చేయవలసి వుంటుంది. వీలైనంత త్వరగా పునర్దర్శనం చేయడం ద్వారా గృహస్థుని యెడల మీకున్న వ్యక్తిగత శ్రద్ధను కనపర్చండి.
9 మనం ప్రకటించే సువార్త గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. (లూకా 2:10) మన ప్రయత్నాలకు ఆసక్తిగల వారు ప్రతిస్పందిస్తే నిజంగా అది గొప్ప ఆనందానికి కారణమౌతుంది. (ఫిలిప్పీ. 4:1) సేవాప్రాంతంలో మనం కనుగొనే ఆసక్తిగలవారికి సహాయం చేయటానికి వారిని తిరిగి దర్శించడం ద్వారా మనమందరం అలాంటి సంతోషాన్ని పొందుదాము.