మన సమస్యలు అను బ్రోషూరునుండి పఠనములు ప్రారంభించుట
1 రాజ్యవర్తమానమునకు ఆసక్తిచూపిన వ్యక్తితో మీరు గతంలో మాట్లాడినప్పటినుండి కొంత సమయము—బహుశ ఒకటి రెండురోజులు, బహుశ ఒక వారము గడచింది. అతడు బైబిలు సాహిత్యమును అంగీకరించినను, అంగీకరించక పోయినను, ఆసక్తి చూపితే వీలైనంత త్వరగా దానిని వృద్ధిచేయుట ప్రాముఖ్యము.
2 ప్రథమ సందర్శన తరువాత మీరు వ్రాసికొనినవాటిని జాగ్రత్తగా పునర్విమర్శన చేయండి. పిమ్మట, మీ సాక్ష్యమిచ్చే బ్యాగ్ సర్దుకునేటప్పుడు, మీరు పునర్దర్శనము చేయునప్పుడు ఆ సాహిత్యమునుండి పేర్కొనడానికి వీలగునట్లు మీరు వారికందించిన సాహిత్యము నొకదానిని దానిలో పెట్టుకొనండి.
“మన సమస్యలు” అను బ్రోషూరును అందించివుంటె, మీరిలా చెప్పవచ్చును:
◼ “మరోసారి మిమ్మల్ని దర్శించినందుకు నేను సంతోషిస్తున్నాను. గతములో నేను మీతో మాట్లాడినప్పుడు, ఈ బ్రోషూరును మీకు చూపించాను, దేవుడు తన రాజ్యము ద్వారా మన సమస్యలన్నింటికి పరిష్కారమునందించునని, నిరూపించుటకు బైబిలునుండి ఒక లేఖనమును చదివాము. అనారోగ్యము, అంగవైకల్యముల మూలంగా కలుగు సమస్యలు కూడ యిందు యిమిడియున్నవి. దానిని నమ్ముట కష్టమని మీరనుకుంటున్నారా? [ప్రత్యుత్తరమిచ్చుటకు గృహస్థుని అనుమతించండి] మీకు నేనిచ్చిన బ్రోషూరులో 19 పేజి 1 పేరానందలి ఈ అంశాన్ని గమనించండి.” ఆ పేరాను చదివి, తదుపరి పేరానందలి ఒకటి లేక రెండు లేఖనాలను చర్చించండి. ఒక బైబిలు పఠనము ప్రారంభమైనదన్నమాట!
3 భవిష్యత్ సందర్శనమునకు మార్గము సరాళముచేయుటకు మీరు ఈ విధంగా చెప్పి సంభాషణను ముగించవచ్చును:
◼ “అయితే, మనము పరిశీలన చేసినదంతా బైబిలునుండియే, కాని బైబిలు చెప్పేదానిని తాము నిజంగా నమ్మగలమా అని అనేకులు ఆశ్చర్యపడుచున్నారు. ఈసారి నేను వచ్చినపుడు, ఈ అంశాన్ని గూర్చి మీతో కొద్దినిమిషాలు చర్చించాలను కుంటున్నాను.” వారి ఆసక్తిని వృద్ధిచేయుటకు మీరు తిరిగి వెళ్ళినప్పుడు, ఆ బ్రోషూరులో 24 పేజి “ఉపదేశములుగల గ్రంథకము” అనే ఉపశీర్షిక క్రిందనున్న 2వ పేరానుండి చర్చ ప్రారంభించండి.
4 కొద్దిపాటి సాహిత్యములనే అందించిన ప్రాంతాలలో: కొద్దిగా ఆసక్తినిచూపి సాహిత్యములను అంగీకరించని వారిని దర్శించునప్పుడుకూడ అదే విధంగా మాట్లాడవచ్చును. గతమందు మీ సంభాషణలో పరిచయముచేసిన బ్రోషూరును గూర్చి పేర్కొనవచ్చును. గృహస్థుడు బ్రోషూరును అంగీకరించేంత వరకు మీ బైబిలును, మీ వ్యక్తిగత బ్రోషూరును ఉపయోగించి అనేకసార్లు దర్శించ వలసివస్తుందికూడ. ఒకవేళ మీరు పత్రికను అందించియుంటే, ఆసక్తిని వృద్ధిచేయడానికి తిరిగి సందర్శిస్తుంటే మన సమస్యలు అనే బ్రోషూర్ నందు ఒక సంబంధిత అంశాన్ని పేర్కొనవచ్చును.
5 మన సమస్యలు అనే బ్రోషూర్ నుండి బైబిలు పఠనము చేయుటకు నడిపించగల మంచి పునర్దర్శనములను రీజనింగ్ పుస్తకమందలి 154-6 పేజీలలో నున్న సమాచారమునుబట్టి సిద్ధముచేయవచ్చును. ఇలా ప్రశ్నించవచ్చును: “బైబిలు ప్రవచనములు ఎల్లప్పుడు ఎట్టి లోపము లేకుండా నెరవేరినవని మీకు తెలియునా? మన దినములలో నెరవేరుటను మనము చూడగలుగుచున్న ప్రవచనములలో నొకదానిని ఈ బ్రోషూర్ చర్చిస్తూ, అదే ప్రవచనము భవిష్యత్తునుగూర్చి ఏమి సూచిస్తుందో తెల్పుచున్నది.” పిమ్మట 12 పేజికి త్రిప్పి “సూచన” అను ఉపశీర్షిక క్రిందనున్న సమాచారమును చర్చించండి.
6 మన సమస్యలు అనే బ్రోషూరును, రెండుపత్రికలను లేక ఒక పుస్తకాన్ని అందించినా లేదా కేవలం ఒక ఆసక్తికరమైన బైబిలు చర్చను ఎవరితోనైనా చేసియున్నా, వారి ఆసక్తిని వృద్ధిచేయు బాధ్యత మీకున్నది. జీవమును కాపాడు ఈ పనిలో భాగము వహించుటకు ఆగష్టులో కొంత సమయాన్ని కేటాయించుకొనుమని మిమ్ములనందరిని మేము ప్రోత్సహించుచున్నాము.—1 తిమో. 4:16.