క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
1 పందొమ్మిది వందల తొంభై అయిదులోని మన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం “సత్యమును గూర్చి సాక్ష్యమిస్తూ ఉండండి” అనే అంశాన్ని నొక్కి చెబుతుంది. కార్యక్రమమంతా, యేసు మనకు ఉంచిన మాదిరిని గూర్చి, యితరులతో సత్యాన్ని పంచుకోడానికి లభించే ప్రతి అవకాశాన్ని ఆయన ఎలా ఉపయోగించాడనే విషయాన్ని గూర్చి నొక్కి చెబుతుంది. క్రీస్తు శిష్యులముగా, సత్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంలో ఆయనను అనుకరించవలసిన మన బాధ్యతను అది నొక్కి చెబుతుంది.—1 కొరిం. 11:1.
2 సత్యాన్ని పెంపొందించడంలో సంఘం వహించే పాత్ర పరిశీలించబడుతుంది. మన పత్రికలను, యితర ప్రచురణలను చక్కగా ఉపయోగించుకోవడాన్ని గూర్చి కూడా వక్కాణించి చెప్పబడుతుంది.
3 దర్శించే ప్రసంగీకుడు “సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుట—అది దేనిని సాధిస్తుంది” అనే ముఖ్య ప్రసంగాన్నిస్తాడు. (యోహా. 8:32) ఈ ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం సత్యంయెడల మనకు గల మెప్పుదలను తప్పకుండా అధికం చేస్తుంది, “సత్యమందు స్థిరపరచబడి” దృఢంగా ఉండడానికి మనకందరికీ సహాయపడుతుంది.—2 పేతు. 1:12; 1 కొరిం. 15:58.