క్రొత్త ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం
తొలి క్రైస్తవులు, పరిశుద్ధాత్మ ద్వారా శక్తినొంది, సువార్తను వీలైనంత విస్తృతంగా వ్యాప్తిచేయడానికి తీవ్ర కృషిచేశారు. (అపొ. 1:8; కొలొ. 1:23) ‘వాక్యమును బోధించుటయందు ఆతురతగలవారై ఉండండి’ అనే 2007వ సేవా సంవత్సరంలోని ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం, వారి మంచి మాదిరిని మనం అనుకరించేందుకు సహాయం చేస్తుంది.—అపొ. 18:5.
దేవుని వాక్యంపై వ్యాఖ్యానిస్తూ రాజైన దావీదు ఇలా అన్నాడు: “యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.” (కీర్త. 19:7) 2007వ సంవత్సరంలో ప్రత్యేక సమావేశదినం కోసం జాగ్రత్తగా సిద్ధం చేయబడిన కార్యక్రమం, ‘తప్పు దిద్దడానికి’ లేఖనాలు ఎలా ఉపయోగపడతాయో నొక్కిచెప్పడమే కాక అత్యవసర భావంతో ప్రకటించి, బోధించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించేందుకు కూడా మనల్ని ప్రోత్సహిస్తోంది. (2 తిమో. 3:16, 17) ప్రతిదిన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా ప్రమాదాలను తప్పించుకొని, వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందవచ్చో ఈ క్రొత్త కార్యక్రమం చూపిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించి యౌవనులు, క్రొత్తవారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేలా తోడ్పడడానికి కూడా అది సహాయం చేస్తుంది.
కార్యక్రమం ఆరంభమవడానికి ముందే అక్కడ ఉండేలా చూసుకోండి, జాగ్రత్తగా వినండి. వ్యక్తిగతంగా అన్వయించుకోగల విషయాలను వ్రాసుకోండి. అక్కడ లభించే ఉపదేశాలకు, జ్ఞాపికలకు కృతజ్ఞత చూపించి, మీరు నేర్చుకున్న విషయాలను ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారనే విషయం గురించి ధ్యానించండి.
ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం దేవుని వాక్యంపట్ల మనకున్న కృతజ్ఞతను అధికంచేసి, ఉత్సాహంతో, రాజ్యసువార్తను ప్రకటించడంలో స్థిరంగా కొనసాగమని మనకు గుర్తుచేస్తుంది, ఇతరులు మనలాగే ప్రకటించడానికి సహాయం ఎలా చేయాలో చూపిస్తుంది. యెహోవా ఈ విధంగా ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక మార్గనిర్దేశం, ఉపదేశం పొందడానికి తప్పకుండా హాజరవ్వాలని తీర్మానించుకోండి!—యెష. 30:20, 21.