ఇండ్లవద్ద లేనివారి రికార్డు ఎందుకుంచుకోవాలి?
1 సాక్షులైన దంపతులు ఆ రోజు పెందలకడనే ప్రాంతీయ పరిచర్యకు వెళ్ళారు. తర్వాత ఆ రోజే ఆ ప్రాంతంలో ఇండ్లవద్ద లేనివారిని దర్శించడానికి వెళ్ళారు. ఒక వ్యక్తి వారిని లోపలికి ఆహ్వానించి ఆతురతతో విన్నాడు. అతడు నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని తీసుకుని, మళ్ళీ వస్తారా అని సాక్షులను అడిగాడు. అతడు క్రితమెన్నడూ యెహోవాసాక్షులతో మాట్లాడలేదు, జవాబు పొందవలసిన ప్రశ్నలు ఆయనకు అనేకమున్నాయి; ఒక బైబిలు పఠనం ఆరంభమైంది. ఇలా గొర్రెవంటి ఒక వ్యక్తిని కనుగొన్నందుకు ఈ దంపతులు చాలా సంతోషించారు. మీకు కూడా అలాంటి అనుభవం కావాలని మీరు కోరుకుంటున్నారా? ఇండ్లవద్ద లేనివారిని గూర్చిన చక్కని రికార్డును ఉంచుకొని, వెంటనే తిరిగి వెళ్ళడం మీకు కూడా దానిని సాధ్యం చేస్తుంది.
2 ఇండ్లవద్ద లేనివారి సరైన రికార్డు ఉంచుకోవాలని, త్వరగా తిరిగి సందర్శించాలని మనం మళ్ళీ మళ్ళీ కోరబడ్డాము. పై అనుభవం చూపుతున్నట్లు, అదే రోజున తిరిగి వెళ్ళడం కూడా శ్రేష్ఠమైన ఫలితాలను తేవచ్చు. మనకు నియమించబడిన ప్రాంతాన్ని పూర్తి చేయాలనే ఆతురత మనకు ఉండవచ్చు, కాని, ఇండ్లవద్ద లేనివారిని గూర్చిన రికార్డు ఉంచుకోవడంలో మనకు అంత శ్రద్ధ ఉండకపోవచ్చు. కొందరు ఇలా చెబుతారు: ‘మేము మా ప్రాంతంలో ప్రతి రెండు లేదా మూడు వారాలకొకసారి చేస్తూనే ఉంటాము; ఎలాగూ త్వరలోనే మేము తిరిగి వస్తాము గనుక, అలా రికార్డు పెట్టుకోనవసరం లేదు.’ అయితే రికార్డు ఉంచుకోవడానికి అది ఇంకా ఎక్కువ కారణాన్నిస్తుంది. తరచూ ప్రాంతాన్ని పూర్తి చేసే చోట, ఇండ్లవద్ద లేనివారి దగ్గరకు వెళ్ళడం అర్హతగలవారి కొరకు ఇంకా చక్కగా అన్వేషించడానికి మనకు తోడ్పడుతుంది. అదెలా?
3 అనేక ప్రాంతాల్లో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువమంది నివాసులు పగలు ఇంట్లో ఉండరు. కాబట్టి, వాస్తవానికి, ఇండ్లవద్ద లేనివారి దగ్గరకు వెళ్ళడానికి ఎక్కువ శ్రద్ధ నిలపడం ద్వారా మరింత ప్రాంతాన్ని లభ్యం చేసుకుంటున్నాము. ఆ ప్రాంతంలో పరిచర్య అరుదుగా చేస్తున్నప్పటికీ, ఆ ప్రాంతమంతటా పరిచర్య చేయబడిందని సూచించక ముందే ప్రతి ఒక్కరిని చేరడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫలితాలను కూడా మెరుగుపరచుకోవచ్చు.
4 సాధారణంగా ఇంట్లో ఎవరూ లేని చోటకు వెళ్ళడానికి ఆ వారంలోనే మరొక రోజున ఏర్పాటు చేసుకోవాలి. మొదట సందర్శించిన అదే రోజు కాకుండా మరొక రోజున, మరొక సమయంలో తిరిగి వెళ్ళడం మంచిదని అనేకులు కనుగొన్నారు. వారమంతటిలో వ్రాసిపెట్టుకున్న రికార్డు ప్రకారం ఇండ్లవద్ద లేనివారిని దర్శించడానికి ఆ వారంలోని శనివారమో లేదా ఆదివారమో కొంచెం సమయం ఉపయోగించాలని మీరు తీర్మానించుకోవచ్చు. మరో సాధ్యత ఏమిటంటే, ఇలాంటి సందర్శనాలను సాయంకాలం చేయడం ఫలవంతమని అనేక సంఘాలు కనుగొన్నాయి. వారు సగంకన్నా ఎక్కువ మందిని ఇండ్లవద్ద కనుగొనవచ్చు.
5 మీరు పునర్దర్శనాలను మీ వ్యక్తిగత రికార్డులో పట్టిక వేసుకోవాలి. ఇంట్లో ఎవరూ లేని చోటకు మళ్ళీ వెళ్ళలేకపోతే, ఇండ్లలో లేనివారిని గూర్చిన మీ రికార్డును, ఆ ప్రాంతానికి వెళ్ళే తరువాతి గుంపు ఉపయోగించేందుకు ఆ గుంపును నడిపించే సహోదరుని చేతికి ఇవ్వాలి.
6 మన పరిచర్యలోని ఈ అంశానికి మంచి అవధానమివ్వడం, మన ఉత్పాదక శక్తిని అలాగే మన సంతోషాన్ని పెంచగలదు. గొర్రెవంటి వారిని వెదకడం, వారియెడల శ్రద్ధ చూపించడం వంటి వాటిని సంపూర్ణంగా చేస్తున్నామని గ్రహించడం వల్ల అది మనకు సంతృప్తినివ్వగలదు.—యెహె. 34:11-14.