కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/07 పేజీ 8
  • ప్రజలు ఇళ్ళలో లేనప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలు ఇళ్ళలో లేనప్పుడు
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇండ్లవద్ద లేనివారి రికార్డు ఎందుకుంచుకోవాలి?
    మన రాజ్య పరిచర్య—1995
  • మీకు వ్యక్తిగత క్షేత్రం ఉందా?
    మన రాజ్య పరిచర్య—2006
  • మీ సంఘానికి విస్తారమైన సేవా ప్రాంతం ఉందా?
    మన రాజ్య పరిచర్య—2002
  • అక్టోబరు 16—నవంబరు 12 వరకు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 4/07 పేజీ 8

ప్రజలు ఇళ్ళలో లేనప్పుడు

1. ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఎలాంటి సవాలు మనందరికీ ఎదురవుతుంది?

1 అనేక ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ళలో కనుగొనడం అంతకంతకు కష్టమవుతోంది. ఈ “అంత్యదినములలో” చాలామంది కనీస అవసరాలను తీర్చుకోవడానికే ఎన్నో గంటలు పనిచేస్తున్నారు. (2 తిమో. 3:1) కొంతమంది షాపింగ్‌కు లేదా ఉల్లాస కార్యకలాపాల్లో గడపడానికి బయటకు వెళ్తుండవచ్చు. అలాంటివారికి మనమెలా సువార్తను ప్రకటించవచ్చు?

2. ఇళ్ళలో లేనివారికి కూడా సాక్ష్యమివ్వబడేలా మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

2 వివరాలను సరిగ్గా వ్రాసుకోండి: ముందుగా మనం ఇంట్లో లేనివారి వివరాలను వ్రాసుకోవాలి. మీరు మీ క్షేత్రంలో తరచూ పనిచేస్తున్నట్లయితే అలా చేయడం మరింత ప్రాముఖ్యం. మీరు వీధి పేరును, టెరిటరీ నంబరును, మీ పేరును, తేదీని వ్రాసుకుంటారా? మీరు లేదా మరో ప్రచారకుడు ఇళ్ళలో లేనివారి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు అదనపు సమాచారాన్ని వ్రాసుకునేందుకు వీలుగా కొంత ఖాళీస్థలాన్ని వదిలిపెట్టవచ్చు. సాక్ష్యపు పని ముగించిన తర్వాత వ్రాసుకున్న సమాచారపు నోట్స్‌ను టెరిటరీ మ్యాప్‌ కార్డ్‌ ఉన్న వ్యక్తికి ఇవ్వాలని గుర్తుంచుకోండి, ఆయన మిమ్మల్నే పునర్దర్శనం చేయమని చెబితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆసక్తిగల వారెవరినైనా మీరు పునర్దర్శనం చేయాలనుకుంటే వారి వివరాలను వ్రాసుకోవడానికి వేరే పేపరును ఉపయోగించండి.

3. ఇంట్లో లేనివారికి సాక్ష్యమిచ్చే విషయంలో కొన్ని సలహాలేమిటి?

3 వేరే సమయాల్లో వెళ్ళడానికి ప్రయత్నించండి: వారంలోని పనిరోజుల్లో ఇంట్లో ఉండనివారు బహుశా సాయంకాల సమయాల్లో లేదా వారాంతాల్లో ఇంట్లో ఉండవచ్చు. వారికి అనుకూలంగా ఉండే సమయంలో తిరిగి వెళ్ళేలా మీ పనులను సర్దుబాటు చేసుకోగలరా? (1 కొరిం. 10:24) అలా కుదరకపోతే, మరో సమయంలో వెళ్ళగలిగే ప్రచారకుడికి ఇంట్లో లేనివారి వివరాలను వ్రాసిన రికార్డును ఇవ్వవచ్చు. లేదా మీరే ఆ ఇంటివారికి ఉత్తరం వ్రాయవచ్చు లేక ఫోన్‌లో సాక్ష్యమివ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్య సమస్యలవల్ల ఇంటింటి పరిచర్యలో అంతగా భాగం వహించలేని ప్రచారకులు ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి ఇష్టపడవచ్చు.

4. ఇళ్ళలో లేనివారిని కలుసుకోవడం ప్రాముఖ్యమని ఏ అనుభవం చూపిస్తుంది?

4 ఇళ్ళలో లేనివారిని కలుసుకునేందుకు ప్రయత్నించడం ఎంత ప్రాముఖ్యమో ఒక అనుభవం చూపిస్తుంది. ప్రచారకులు ఒకే ఇంటికి క్రమంగా మూడు సంవత్సరాలు వెళ్లిన తర్వాతే ఆ గృహస్థురాలిని చివరికి కలుసుకోగలిగారు. నిజానికి, ఆమె ఆ ప్రాంతానికి వచ్చేముందు ఆపేసిన బైబిలు అధ్యయనాన్ని సాక్షులు వచ్చి తిరిగి ప్రారంభిస్తారని ఆ మూడు సంవత్సరాలు ఎదురుచూసింది.

5. ఒక క్షేత్రం పూర్తైనట్టుగా ఎప్పుడు పరిగణించబడుతుంది?

5 క్షేత్రాన్ని పూర్తి చేయండి: క్షేత్రం పూర్తైనట్లు ఎప్పుడు పరిగణించబడుతుంది? సాధారణంగా, ప్రతి ఇంట్లో ఒక్కరినైనా కలవడానికి సాధ్యమైనంత కృషి చేయబడినప్పుడు క్షేత్రం పూర్తైనట్టుగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఎవరూ లేకపోతే ఒక కరపత్రాన్ని లేదా పాత పత్రికను బయటివారికి కనిపించని విధంగా పెట్టడం సముచితం కావచ్చు, ప్రత్యేకంగా చాలా అరుదుగా చేయబడే క్షేత్రాల్లో మీరు అలా చేయవచ్చు. క్షేత్రాన్ని నాలుగు నెలల్లోపు పూర్తిచెయ్యాలి. క్షేత్ర సేవకుడు తన రికార్డుల్లో నమోదుచేసుకునే విధంగా దాని గురించి నివేదించాలి.

6. మన క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సువార్తను ప్రకటించడానికి ఎందుకు ప్రయత్నించాలి?

6 యెహోవా నామాన్నిబట్టి ప్రార్థనచేసే, రక్షించబడే అవకాశం సాధ్యమైనంత ఎక్కువమందికి దొరకాలని మనం కోరుకుంటాం. (రోమా. 10:13, 14) మనం ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఇళ్ళలో లేనివారికి కూడా ఆ అవకాశం లభించాలని కోరుకుంటాం. అపొస్తలుడైన పౌలులాగే ‘దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమివ్వడాన్ని’ మీ కోరికగా చేసుకోండి.​—అపొ. 20:24.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి