ఇతరులు తమకు తామే ప్రయోజనం పొందేందుకు సహాయం చేయండి
1 మనం తెలుసుకోవలసిన వాటిని బోధిస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. కీర్తన 32:8 నందు ఆయన ఈ విధంగా హామీ ఇస్తున్నాడు: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” ఈ హామీ మనకు ఎంతో ప్రయోజనకరమైనది. బైబిలులోని జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని అనుసరించడం వలన తమకు తామే ఎలా ప్రయోజనం పొందవచ్చో ఇతరులకు చూపించాలని మనం నిస్వార్థంగా కోరుకుంటాము. (యెష. 48:17) సెప్టెంబరు నెలలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని మనం కలిసే వారికందరికి అందించడం ద్వారా మనమిది చేయగలము. మన అందింపులను తయారు చేయడంలో, బైబిలు పరిజ్ఞానమున్న పూర్వాపరాలు లేని మరియు బైబిలు బోధలను నమ్మని వ్యక్తులకు కూడా బైబిలు యొక్క ఆచరణాత్మక విలువను చూపించే అనేక మార్గాలున్నాయి.
2 నేడు అంతటా వ్యాపించి ఉన్న వివాహ సమస్యల దృష్ట్యా, “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకం నుండి మీరు ఈ తలంపును ఎంపిక చేసుకోవచ్చు:
◼ “నేను మాట్లాడిన ప్రజల్లో చాలా మంది వివాహ జీవితంలో అధికమవుతున్న అసంతోషం మరియు విడాకులను గూర్చి ఎంతో వ్యాకులపడుతున్నారు. ఈ సమస్యను గూర్చి మీరేమని భావిస్తారు? [జవాబు చెప్పనివ్వండి.] అనేకులు ముఖ్యమైన కారణాలను గ్రహించడంలో విఫలులౌతున్నారు. దంపతులు యథార్థమైన ప్రయత్నం చేస్తున్నట్లయితే, వారు తమ వివాహ జీవితాన్ని కాపాడుకోగల్గడమే కాక, నిజమైన సంతోషాన్ని కూడా కనుగొనగలరు. అనేకులు బైబిలులో ఉన్న సలహాను అన్వర్తించడంలో విజయానికి కీలకాన్ని కనుగొన్నారు.” ఎఫెసీయులు 5:28, 29, 33 చదవండి. పేజీ 243కు త్రిప్పి 16, 17 పేరాలను చర్చించి, పుస్తకాన్ని అందించండి.
3 పిల్లలకు తలిదండ్రుల నుండి మంచి సమయము మరియు శిక్షణ అవసరం. “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని చూపించేటప్పుడు మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మనమందరం మన యౌవనస్థుల బావి క్షేమాన్ని గూర్చి చింతిస్తాము. మీ అభిప్రాయంలో, పిల్లలు భవిష్యత్ భద్రతను కనుగొనేలా తలిదండ్రులు వారికి సహాయపడే మంచి మార్గమేది? [జవాబు చెప్పనివ్వండి.] దాదాపు 3,000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన బైబిలు సామెత నుండి ఈ సలహాను వినండి. [సామెతలు 22:6 చదవండి.] మన పిల్లలు పాఠశాలలో పొందే ఉపదేశం నుండి ఎంతో ప్రయోజనం పొందగలిగినప్పటికీ, వారికి మరింత విలువైన శిక్షణ ఇంట్లో వారి తలిదండ్రుల నుండి ఇవ్వబడుతుంది. దానికి సమయం, శ్రద్ధ, ప్రేమ అవసరమైనప్పటికీ, అది ప్రయోజనకరమైన ప్రయత్నమే.” పేజీ 245 త్రిప్పి, 20 మరియు 21 పేరాలను చర్చించి, ఆ పుస్తకాన్ని కుటుంబ చర్చలకు ఆధారంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించండి.
4 భూమి పరదైసుగా ఎలా మారుతుందో చూపిస్తూ “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని అందించాలని మీరు కోరుకోవచ్చు:
◼ “భవిష్యత్తులో మీ జీవితం ఎలా ఉంటుందనే దానిని గూర్చి మీరు వ్యాకులపడుతున్నారనేది నిశ్చయమే. అనేక మత సంబంధమైన పుస్తకాలు భవిష్యత్తును గూర్చి మాట్లాడుతున్నాయి. ఉదాహరణకు, బైబిలులో దేవుని చిత్తము పరలోకంలోవలెనే భూమ్మీదకూడ జరగాలని ప్రార్థించాలని యేసుక్రీస్తు నేర్పించాడు. అది సంభవించినప్పుడు భూమి ఎలా ఉంటుంది? [జవాబు చెప్పనివ్వండి.] పరదైసు లోకాన్ని గూర్చిన కళాకారుని చిత్రీకరణ ఇది. [పేజీ 12 మరియు 13లోని చిత్రాన్ని చూపించండి. తరువాత 12వ పేరాలో ఉన్న యెషయా 11:6-9 చదవండి.] అలాంటి లోకంలో జీవించడం ఆనందదాయకంగా ఉండదా? మీరు మీ కుటుంబం ఇలాంటి పరదైసులో ఎలా జీవించగలరో ఈ పుస్తకం మీకు చూపిస్తుంది.”
5 మీరు ముందుగా అందింపులను తయారు చేయడమే ఇంటిద్వారం వద్ద మీ విజయానికి నిర్ణాయక కీలకం. మీరు తలుపు తట్టక ముందే లేఖనాధార తలంపును గూర్చి చెప్పడానికి మీ మనస్సులో కచ్చితమైనదొకటుందని నిశ్చయపరచుకోండి. అలాగే, పుస్తకం తీసుకోనట్లయితే, మీరు అందించాలనుకుంటున్న పత్రిక లేదా కరపత్రంలోని ఆసక్తికరమైన అంశాన్ని గూర్చి ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని మనస్సులో ఉంచుకోండి. సెప్టెంబరు నెలలో రాజ్యసత్యాల విత్తనాలను విత్తే ప్రతి అవకాశాన్ని వినియోగించండి. (ప్రసం. 11:6) నిరంతరం నిలిచే ప్రయోజనాలను ఇతరులు పొందేందుకు మీరు సహాయపడతారు.