జిల్లా సమావేశంలో క్రొత్త పుస్తకం విడుదల చేయబడడంతో అందరూ పులకించిపోయారు
క్రొత్త పుస్తకం దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఉన్నతపరుస్తుంది
1 మన “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశంలోని కార్యక్రమమంతటితో మనం ఎంతగా ఆనందించామో! శనివారం మధ్యాహ్నం నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే క్రొత్త పుస్తకాన్ని గూర్చిన ప్రకటనను, తరువాత దానికి సంబంధించిన సమాచారాన్ని విన్నప్పుడు మన ఆనందం పొంగిపొర్లింది. దేవుడు మాత్రమే తనను గూర్చి, తన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి ఇవ్వగల జ్ఞానం భూమ్మీది లక్షలాది మంది ప్రజలకు అవసరం.—సామె. 2:1-6; యోహా. 17:3.
2 ప్రసంగీకుడు పుస్తకంలోని భాగాలను ఎంత స్పష్టంగా వివరించాడో! అధ్యాయాల ఆకట్టుకునే శీర్షికలు, ఆచరణాత్మకమైన ఉదాహరణలు, సత్యాన్ని గూర్చిన అనుకూలమైన వివరణ, సరళమైన ప్రశ్నలు మరియు ప్రతి అధ్యాయానికి చివర “మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి” అనే బాక్సు చదివే వారికందరికీ ఆకర్షణీయంగా అనిపించే విశేషతల్లో కొన్ని. అయితే, మన బైబిలు విద్యార్థులు బైబిలులోని ప్రాథమిక బోధలను త్వరగా స్వంతం చేసుకుంటుండగా, ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు.
3 మనం ఈ క్రొత్త పుస్తకాన్ని ఉపయోగించి కుటుంబ బైబిలు పఠనాన్ని కలిగి ఉండాలని శని, ఆదివారాల ముగింపు ప్రసంగాల్లో ప్రోత్సహించబడ్డాం. ఇప్పటికెల్లా మనం దాని విషయసూచికను బాగా ఎరిగినవారమై ఉండవచ్చు. పరిచర్యలో ఈ పుస్తకాన్ని ప్రతిపాదించేటప్పుడు మనస్సులో ఉంచుకోవలసిన అంశాలను కూడా మీరు చర్చించి ఉండవచ్చనే దానికి సందేహం లేదు.
4 పునఃసమీక్షించవలసిన అంశాలు: “దేవుని గూర్చిన జ్ఞానము మానవజాతికి ఎందుకు అవసరము” అనే విషయాన్ని చర్చించేటప్పుడు ప్రసంగీకుడు ఈ క్రిందివాటితో సహా అనేక విషయాలను నొక్కిజెప్పాడు: (1) పఠనాలను నిర్వహించేందుకు మీరీ పుస్తకాన్ని ఉపయోగించేటప్పుడు ముఖ్య అంశాలను మరుగుపరచే అదనపు సమాచారాన్ని ఉపయోగించడం జ్ఞానయుక్తం కాదు; ప్రతి అధ్యాయంలోను పుస్తకం దేనిని రుజువు చేస్తుందో దానిని తెలియజేయడంపైనే కేంద్రీకరించండి. (2) అధ్యాయాలు మరీ పెద్దవి కావు గనుక సాధారణంగా మీరు పఠించే ప్రతిసారి ఒక్కో అధ్యాయం చొప్పున పూర్తి చేయగలుగుతారు. (3) ప్రతి అధ్యాయం చివరన, ఇవ్వబడిన “మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి” అనే బాక్సులోని ప్రశ్నలు సంక్షిప్త పునఃసమీక్షనిస్తాయి.
5 బైబిలు పఠనాల్లో ఉపయోగించడం: చాలా మంది ప్రచారకులు తమ బైబిలు పఠనాలను ఈ క్రొత్త పుస్తకంలోనికి మార్చడం యుక్తమేనా అని అడిగారు. ప్రస్తుతం పఠిస్తున్న పుస్తకంలో చాలా భాగం అయినట్లయితే, ఆ ప్రచురణను పఠించడాన్ని పూర్తి చేయడం ఆచరణాత్మకమై ఉంటుంది. అలాకాకపోతే, మీరు జ్ఞానము అనే పుస్తకాన్ని పఠించవచ్చని సిఫారసు చేయబడుతుంది. బైబిలు పఠనాన్ని ఆరంభించేందుకు మీరు బ్రోషూరునో లేక కరపత్రాన్నో ఉపయోగించినట్లయితే, సరైన సమయంలో క్రొత్త పుస్తకాన్ని పరిచయం చేసి, దానిని పఠనానికి ఉపయోగించండి. జ్ఞానము అనే పుస్తకం ఉపయోగాన్ని గూర్చిన మరింత సమాచారం రానున్న నెలల్లోని మన రాజ్య పరిచర్యలో వస్తుంది.
6 నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని గూర్చి ఇతరులకు బోధించడంలో మనకు సహాయపడేందుకు యెహోవా ఈ క్రొత్త పుస్తకాన్ని ఇచ్చాడు. మనమిప్పుడు బాగా సిద్ధపడి, ఇంకా చేయనున్న పనిలో పూర్తి భాగం వహించవలసిన అవసరముంది.