క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము
1 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాంశం “యెహోవాచే ఉపదేశింపబడిన వ్యక్తులై ఉండండి.” (యోహా. 6:45) యెహోవానుండి వచ్చే దైవిక బోధ, మనం సంతృప్తికరమైన జీవితాలను జీవించేందుకు నిజంగా సహాయపడుతుంది. మన ఆత్మీయ వారసత్వం ఎడల మన మనస్సుల్లో ఎంతో మెప్పుదలను అది వృద్ధిచేస్తుంది. ఇతరులు సువార్తను వినేందుకు సహాయపడాలని మనం చేసే ప్రయత్నాలు సమాజంలో మనం ఉపయుక్త సభ్యులమయ్యేలా చేస్తుంది. ఈ ప్రత్యేక సమావేశ దినం యెహోవా బోధించే వ్యక్తులు అనుభవించే ఆశీర్వాదాలను ఉన్నతపరుస్తుంది.
2 దైవిక బోధవల్ల వచ్చే ప్రయోజనాలకూ మరియు ప్రాపంచిక జ్ఞానంవల్లవచ్చే అపాయాలకూ మధ్య ఉన్న తేడాను ఈ కార్యక్రమం చూపిస్తుంది. అత్యున్నతమైన విద్యను, అంటే తన వాక్యమైన బైబిలుపై ఆధారపడిన విద్యను యెహోవా ఎలా అందిస్తాడో మనం మరింత స్పష్టంగా చూస్తాము. దేవునినుండి నేర్చుకోవడంవల్ల మనం మన ఆరాధనలో ఆనందించే మూడు రంగాలకు ఎక్కువ శ్రద్ధనివ్వడం జరుగుతుంది. అదనంగా, దావీదు, తిమోతి వంటి చక్కని బైబిలు ఉదాహరణలను అనుకరించవల్సిందని మరియు ఆత్మీయ కార్యకలాపాలతో తమ జీవితాలు నింపుకోమని యౌవనులను ప్రోత్సహించడం జరుగుతుంది. వయస్సు మళ్లినవారి యథార్థత కూడా ఉన్నతపర్చినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. క్రొత్తగా సమర్పించుకున్న అర్హతగలవారు బాప్తిస్మం తీసుకోగల్గుతారు. సమావేశ దినానికి కావల్సినంత ముందుగానే తమకున్న ఆ కోరికను గూర్చి వారు సంఘ పైవిచారణకర్తకు తెల్పాలి.
3 ప్రత్యేక సమావేశ దిన ముఖ్య ప్రసంగాంశం “యెహోవా చిత్తాన్ని చేయడానికి ఆయనచే బోధింపబడడం.” మనమందరమూ ఎందుకు నేర్చుకుంటూనే ఉండాలి, విశ్వాసంలో దృఢంగా ఉండాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి అన్న వాటిని అది నొక్కి చెబుతుంది. నిత్యజీవానికి నడిపించే సత్యాన్ని గూర్చి ఇతరులకు నేర్పించడం ద్వారా మనం యెహోవాను అనుకరించేందుకు ఉద్బోధించబడతాము. అనేకులు యెహోవానుండి నేర్చుకునేందుకు సంస్థ ప్రచురణలు ఎలా సహాయపడ్డాయో చూపించే ప్రోత్సాహకరమైన అనుభవాలు కూడా ఉంటాయి. యెహోవా యొక్క ప్రపంచవ్యాప్త బోధనా కార్యక్రమం సాధించిన మంచి ఫలితాలు కూడా ఉన్నతపర్చబడతాయి.
4 దీనికి హాజరయ్యేందుకు కచ్చితమైన పథకాలను వేసుకోండి. ఆసక్తిగలవారందరినీ హాజరుకమ్మని ప్రోత్సహించండి. మన మహా గొప్ప బోధకుని చేత అనేక మంచి సంగతులు మనకు బోధించబడతాయని ఎదురుచూడండి.—యెష. 30:20, NW.