‘మనుష్యులందరికీ’ సాక్ష్యమివ్వడం
1 వేర్వేరు సంస్కృతులకూ, వేర్వేరు మత నేపథ్యాలకూ చెందిన ప్రజల్ని మనం కలుసుకొన్నప్పుడు, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెన[నేదే]” యెహోవా చిత్తమని మనం గుర్తుంచుకుంటాం. (1 తిమో. 2:4) ప్రత్యేకంగా తయారుచేయబడిన అనేక కరపత్రాలూ, బ్రోషూర్లూ మాత్రమే కాకుండా, మన దగ్గర రెండు అద్భుతమైన ప్రచురణలు ఉన్నాయి. దేవుని గూర్చిన, క్రీస్తును గూర్చిన సత్యాల్ని బోధించని మతాలకు చెందిన వ్యక్తులకు సహాయం చేసేందుకు ఆ ప్రచురణల్ని ఎప్పుడైనా సరే ఉపయోగించవచ్చు.
2 యేసుక్రీస్తు జీవితాన్ని ఉన్నతపర్చడం ద్వారా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకం, మొదటి శతాబ్దంలో అనేకమంది ప్రజలు ఎలాగైతే దేవుని కుమారుని గురించి బాగా తెలుసుకొని, ఆయన పట్ల ఆకర్షితులయ్యారో అలాగే ఒక వ్యక్తికి సహాయపడగలదు. (యోహా. 12:32) నిత్యజీవాన్ని గూర్చిన ఉత్తరాపేక్ష కూడా అందరినీ ఆకట్టుకొంటుంది. ఈ అద్భుతమైన ఉత్తరాపేక్షతో ప్రతీ ఒక్కరూ పరిచయం కల్గివుండేలా సహాయపడేందుకు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూపొందించబడింది. మహాగొప్ప మనిషి, నిరంతరము జీవించగలరు పుస్తకాలు రెండింటినీ తగ్గింపు ధరలకు అందించవచ్చు. సముచితమనిపించిన చోట, ఈ పుస్తకాల్ని పరిచయం చేయడానికి ఈ క్రింది సలహాల్ని మీరు ప్రయత్నించడానికి ఇష్టపడవచ్చు.
3 “మహాగొప్ప మనిషి” పుస్తకాన్ని ఒక వ్యక్తికి అందించడం సముచితమని మీకు అన్పిస్తే, మీరిలా అడగవచ్చు:
◼ “యేసుక్రీస్తు గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సులోకి వచ్చేదేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషిగా యేసును అనేకమంది చరిత్రకారులు గుర్తించారు. [మహాగొప్ప మనిషి పుస్తకంలో ఉపోద్ఘాతం నుండి ఒక ఉదాహరణను ఎత్తి చెప్పండి.] యేసు జీవితం, మనం అనుకరించడానికొక ఆదర్శం అని బైబిలు చూపిస్తోంది.” 1 పేతురు 2:21 వచనాన్నీ, మహాగొప్ప మనిషి పుస్తకంలోని ఉపోద్ఘాతపు చివరి పేజీలో ఉన్న మొదటి పేరానూ చదవండి. యేసును గురించి తెలుసుకోవడంలో గృహస్థునికి ఆసక్తి ఉంటే, పుస్తకాన్ని అందించండి. మీరు ఆ గృహస్థుణ్ణి విడిచి వెళ్ళేముందు, యోహాను 17:3 వ వచనాన్ని చదివి, “నిత్యజీవానికి నడిపించే ఈ జ్ఞానాన్ని మనమెలా గైకొనగలం?” అని ప్రశ్నించండి. దాన్ని గురించి తెలియజేయడానికి మరలా తిరిగి వెళ్లేందుకు ఖచ్చితమైన ఏర్పాట్లను చేసుకోండి.
4 జీవాన్ని అనుగ్రహించే జ్ఞానాన్ని ఎలా పొందవచ్చో వివరించేందుకు మీరు తిరిగి వెళ్లినప్పుడు, మీరిలా చెప్పవచ్చు:
◼ “నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని మనమెలా గైకొనవచ్చో మీకు తెలియజేయడానికి నేను మరలా వస్తానని మీకు మాటిచ్చాను.” జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించి, మొదటి అధ్యాయాన్ని ఉపయోగిస్తూ బైబిలు పఠనం ఎలా చేస్తామో ప్రదర్శించి చూపండి.
5 “మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు” పుస్తకాన్ని అందించాలనుకొంటే, మీరిలా అనవచ్చు:
◼ “నిరంతర జీవితం కేవలమొక కల మాత్రమేనని మీరు అనుకుంటున్నారా?” ప్రతిస్పందించిన తర్వాత, నిరంతర జీవితము పుస్తకాన్ని 7వ పేజీ వైపుకు త్రిప్పండి. 4వ పేరాలో ఉన్న విషయాన్ని ఉన్నతపర్చి, పరిశుభ్రమైన భూమిపై నిరంతర జీవితం కోరదగినదై ఉంటుందనే విషయంతో గృహస్థుడు ఏకీభవిస్తున్నాడో లేదో తెలుసుకోండి. 11-13 పేజీలలో ఉన్న చిత్రాలతో 8, 9 పేజీల్లో ఉన్న చిత్రాల్ని పోల్చి చూపండి. 13వ పేరాలో ఉదాహరించబడిన లేఖనాల్లో ఒకదాన్ని తెరచి చూపించండి. నిజమైన ఆసక్తి కనిపిస్తే, ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. ఆ గృహస్థుని దగ్గర నుండి వెళ్లిపోతున్నప్పుడు, “నిరంతర జీవితాన్ని గూర్చిన ఉత్తరాపేక్ష మీ విషయంలో వాస్తవరూపం దాల్చాలనుకుంటే మీరేం చేయాల్సి ఉంటుందనుకుంటున్నారు?” అని ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నకు జవాబివ్వడం కోసం మరలా తిరిగి వస్తానని చెప్పండి.
6 నిత్యజీవము ఎలా వాస్తవరూపం దాల్చబోతుందనే విషయాన్ని వివరించడానికి మరలా తిరిగి వెళ్లినప్పుడు, మీరిలా చెప్పవచ్చు:
◼ “పోయినసారి నేను మీ దగ్గర నుండి వెళ్ళేముందు ‘నిరంతర జీవితాన్ని గూర్చిన ఉత్తరాపేక్ష మీ విషయంలో వాస్తవరూపం దాల్చాలనుకొంటే మీరేం చేయాల్సి ఉంటుందనుకుంటున్నారు?’ అని నేనడిగిన ప్రశ్న మీకు గుర్తుందా?” [ప్రతిస్పందించనివ్వండి.] నిరంతర జీవితము పుస్తకంలోని 15వ పేజీవైపుకు త్రిప్పి, 19వ పేరాలో ఎత్తి రాయబడిన యోహాను 17:3 వ వచనాన్ని చదవండి. ఆ గృహస్థునికీ, ఆయన కుటుంబ సభ్యులకూ ఈ ప్రత్యేక తరహా జ్ఞానం లభ్యమౌతోందని ఆయనకు తెలియజేసి, ఆయనకు అనుకూలమైన సమయంలో క్రమంగా ఆయనను సందర్శించడానికి మీరెంతగానో సంతోషిస్తారని చెప్పండి. గృహస్థుణ్ణి మీరు క్రమంగా సందర్శించడం మొదలుపెట్టిన తర్వాత కొంత కాలానికి, బహుశా మీరు దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్నిగానీ లేకపోతే జ్ఞానము స్తకాన్నిగానీ పరిచయం చేయవచ్చు.
7 సంభాషణను ఆరంభించేవి: నిరంతరము జీవించగలరు పుస్తకంలో అనేక బోధనా సహాయకాలు ఉన్నాయి. ప్రారంభ సందర్శనంలో గానీ లేదా పునర్దర్శనంలో గానీ సంభాషణను ఆరంభించడానికి సహాయకాలుగా వాటిని ఉపయోగించవచ్చు. మీరు కేవలం సముచితమైన ప్రశ్నను అడగడం ద్వారానే సంభాషణను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, ఈ క్రింది ప్రశ్నలనూ, వాటికి జవాబులివ్వబడిన అధ్యాయాల్నీ చూడండి:
దేవుడు—ఆయనెవరు? (4)
బైబిలు నిజముగా దేవునినుండి వచ్చినదా? (5)
మరణమందు ఏమి సంభవించును? (8)
దేవుడు ఎందుకు దుష్టత్వమును అనుమతించెను? (11)
పరలోకమునకు ఎవరు వెళ్లుదురు, ఎందుకు? (14)
మనము పది ఆజ్ఞలక్రింద ఉన్నామా? (24)
8 నిరంతర జీవితము పుస్తకంలోని ఎంపికచేయబడిన పేజీ(ల) వైపుకు త్రిప్పి, అక్కడ చర్చించబడిన అంశాన్ని వివరించండి. ఆ తర్వాత, తత్సంబంధమైన ప్రశ్నను అంటే దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరు నుండి గానీ లేదా జ్ఞానము పుస్తకం నుండి గానీ జవాబివ్వగలిగే ప్రశ్నను అడగడం ద్వారా పునర్దర్శనాన్ని ఏర్పాటు చేయండి. బహిరంగ కూటానికి గృహస్థుణ్ణి తప్పక ఆహ్వానించి, హ్యాండ్బిల్ను ఇవ్వండి. పై పుస్తకాల్ని వాటిని తయారు చేయడానికి అయిన ఖర్చుకన్నా తక్కువ ధరకు అందిస్తున్నామనీ, మరి మన పనియంతా స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడి ఉందనీ చెప్పండి.
9 యథార్థవంతులైన ప్రజలందరూ దేవుని గూర్చిన, క్రీస్తును గూర్చిన సత్యాన్ని అన్వేషిస్తున్నారు. భూమిపై పరదైసులో నిరంతరమూ జీవించడమనే తలంపే చాలా ఆహ్లాదకరమైన విషయంగా అనేకమంది దృష్టించారు. సాక్ష్యమిచ్చే మన పని ద్వారా అలాంటి ప్రజలందరికీ మనం సహాయపడవచ్చు. అందుకని మనం “మనుష్యులకందరికి రక్షకు[డైన], . . . జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుప[డుతూ]” ఉందాము.—1 తిమో. 4:10.